సగం సగం తెలివితో అభిమన్యుడు పద్మవ్యూహం లోకి పోలేదు! అతని కి ఆ రోజు కథన రంగం లో మృత్యువు పొంచి ఉంది అని తెలిసే వెళ్ళాడు!
కానీ ఏదో చిన్న నమ్మకం తనవాల్లు తన వెంట ఉన్నారు అనే నమ్మకం! కానీ వాళ్ళు అతన్ని అనుసరించడంలో విఫలం అయ్యారు! అది తెలిసినా అభిమన్యుడు బెదరలేదు, ఇంకా ముందుకు చొచ్చుకుపోతూ కౌరవ సేనను కకావికలం చేశాడు! కర్ణ దుర్యోధనాదులకు ప్రాణ భయం అంటే ఏమిటో చూపించాడు
కృపాచార్యుడు ద్రోణాచార్యుడు భీష్ముడికి చెమటలు పట్టించాడు! ఈ రోజే యుద్దానికి మనకి అంతం అనేలా బీకర పోరు సాగించాడు! కనీస ప్రతి ఘటన ఇవ్వలేక కౌరవ యోధులు అంతా కలిసి అధర్మ యుద్ధం చేసి ఒకే సారి దాడి చేసి చేతిలో ఆయుధం లేకుండా చేసి రథాన్ని విరగొడితే! రథ చక్రమే చక్రాయుధంగా మార్చి పోరు సలిపాడు!
అభిమన్యుడికి చావు అయితే వచ్చింది గానీ అతని వీరత్వం మాత్రం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది!
ఒక్కసారి పని మొదలు పెట్టాక ఎంత ఇబ్బంది వచ్చినా దానిని విడువకూడదు మన ఒంట్లో ఓపిక ఉన్నంతరకు పోరాడాలి !
ఎప్పుడు మనతో మన వాళ్ళు ఉండక పోవచ్చు లక్షల కౌరవ సేన మధ్యలో ఒంటరి అభిమన్యుడిగా నువ్వు మిగిలిపోవచ్చు!
కానీ వెన్ను చూపక పోరాడిన వాడే చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో రాయగలడు!
ఓం నమో నారాయణాయ