రుద్రాక్ష మాల విశిష్టత ధరించడానికి నియమాలు - తులసిమాల ప్రాముఖ్యత

P Madhav Kumar


*>>>>>>>>>>>ఓం<<<<<<<<

రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,


1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.

2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.

4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.

5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.

6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.

7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.


రుద్రాక్షమాల ధారణవిధి:-


సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.


రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:-


పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.


జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు:-


నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష


అశ్వని నవముఖి

భరణి షణ్ముఖి

కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి

రోహిణి ద్విముఖి

మృగశిర త్రిముఖి

ఆరుద్ర అష్టముఖి

పునర్వసు పంచముఖి

పుష్యమి సప్తముఖి

ఆశ్లేష చతుర్ముఖి

మఖ నవముఖి

పుబ్బ షణ్ముఖి

ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి

హస్త ద్విముఖి

చిత్త త్రిముఖి

స్వాతి అష్టముఖి

విశాఖ పంచముఖి

అనురాధ సప్తముఖి

జ్యేష్ఠ చతుర్ముఖి

మూల నవముఖి

పూర్వాషాఢ షణ్ముఖి

ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి

శ్రవణం ద్విముఖి

ధనిష్ట త్రిముఖి

శతభిషం అష్టముఖి

పూర్వాభాద్ర పంచముఖి

ఉత్తరాభాద్ర సప్తముఖి

రేవతి చతుర్ముఖి...


సాలగ్రామాలు అనే పేరు తరచూ వినిపిస్తుంది. 

సనాతన కుటుంబాల్లో సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 


దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్‌లోని గండకీ నదిలో దొరుకుతాయి. వీటిని విష్ణు సంబంధమైనవిగా భావిస్తారు. ఆపస్తంబుని సూత్రాల్లోనూ సాలగ్రామ అర్చన ప్రాశస్త్యం కనిపిస్తుంది. అంతేకాదు సాలగ్రామ దానం ఎంతో పుణ్యప్రదమని నిర్ణయసింధు లాంటి ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మాండ, అగ్ని, బ్రహ్మవైవర్తాది పురాణాల్లోనూ, దేవీ భాగవతంలోనూ సాలగ్రామాల ప్రాశస్త్యం కనిపిస్తుంది. ఈ విషయాలను సంగ్రహించి సాలగ్రామ లక్షణం, సాలగ్రామ సమీక్ష తదితర గ్రంథాల్లో ప్రస్తావించారు.


రూపాలను బట్టి సాలగ్రామాలను వాసుదేవ, కేశవ, నారాయణ, నృసింహ మొదలైన పేర్లతో పిలుస్తారు. గోలోకంలోని తులసి, సుదాములు రాధాదేవి శాపానికి గురై భూమిమీద తులసి, శంఖచూడులుగా జన్మిస్తారు. కాలక్రమంలో వీళ్లిద్దరికీ వివాహం జరుగుతుంది. తర్వాత తులసి దేహం నుంచి హిమగిరికి దక్షిణంగా ఉన్న గండకీ నది, కేశాల నుంచి తులసి మొక్కలు పుట్టాయని దేవీభాగవతం చెబుతున్నది. గండకీ నదిలో లభించే సాలగ్రామాలను దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. హిమగిరిలో పుట్టిన సాలగ్రామాన్ని, సముద్రంలో పుట్టిన శంఖాన్ని ఒకేచోట ఉంచి పూజించడం సనాతన ధర్మంలోని సమైక్య భావాన్ని సూచిస్తుంది.


సాలగ్రామాలు ఇంట్లో ఉంటే ఆచార వ్యవహారాలు విధిగా పాటించాలని పెద్దలు చెబుతారు. ఇంట్లో మైల కలపొద్దు. సాలగ్రామాలకు నిత్యం అభిషేకం, అర్చన విధిగా చేయాలి. నైవేద్యం తప్పనిసరి...


తులసి మొక్కకు  అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. 


దీని చెక్కతో చేసిన తులసిమాల కూడా అంటే ప్రాముఖ్యత ఉంది. 


ఈ హారానికి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతారు. ఈరోజు తులసిమాల గురించి దానికి సంబంధించిన ప్రత్యేక నియమాలను గురించి తెలుసుకుందాం. 


తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన,  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  తులసి విష్ణువుకు అత్యంత పవిత్రమైనది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. తులసి మొక్క  ఉన్న ఇంట్లో వాస్తు దోషం ప్రభావం చూపదని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం . తులసి మొక్క విష్ణువు, లక్ష్మిలకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. ఇరువురు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి..  ప్రజలు ఇంట్లో  తులసిని పూజిస్తారు. తులసి ఆకులు లేని విష్ణువు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుందని గ్రంథాల్లో చెప్పబడింది. అంతే కాకుండా హనుమంతుని పూజలో కూడా తులసి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది.


తులసి మొక్కను పూజించడమే కాదు దాని చెక్కతో చేసిన దండను తులసిమాలగా ధరిస్తారు. ఈ తులసిమాల కి సంబంధించిన ప్రత్యేక నియమాల గురించి తెలుసుకుందాం..


తులసి మొక్క కథ

పురాణాల ప్రకారంహిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు ఒక యువరాణి. అమె మహావిష్ణువు పరమభక్తురాలు. పరమశివుని మూడో కన్ను లోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అపారశక్తి వంతుడు. ఇతడు అందమైన యువరాణి వృందను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. రాక్షసుడైన జలందరుడి మరణానికి శ్రీ విష్ణువు కారణమవుతాడు. దీంతో కోపోద్రిక్తురాలైన బృందా విష్ణువును శపించింది. దీంతో తాను శాలిగ్రామం అంటే శిల రూపంలో జీవిస్తానని విష్ణువు చెప్పాడు. గండకి నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. తులసికి లక్ష్మీ దేవి , విష్ణువుతో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు.


తులసి మాల ధరించడానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకోండి.


1. ఈ మాల ధరించాలనుకునే వ్యక్తి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది. వెల్లుల్లి , ఉల్లిపాయలను ఉపయోగించిన ఆహారాన్ని తినరాదు.


2. తులసి మాల ధరించిన వ్యక్తి ఎల్లప్పుడూ మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. వీటిని ఆహారంగా తీసుకోవడం చాలా హానికరమని పెద్దల కథనం


3. తులసి మాల వేసుకునే ముందు గంగాజలంతో శుభ్రం చేసి పూజ చేసిన తర్వాతే ధరించాలి.


4. తులసి మాలను చేతితో చేసిన మాల ధరించాలి.


5. తులసి మాలను ధరించిన భక్తులు ప్రతి రోజు విష్ణు సహస్రనామాలు..


సర్వేజనాసుఖినోభవంతు.



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat