గురువు పెట్టే పరీక్ష :-

P Madhav Kumar


ఒక గురువు తన శిష్యుడిని ఒక పరీక్ష చేయాలి అనే బుద్ది కలుగుతుంది. ఆ సాధకుడిని తన దగ్గరకు వచ్చిన రోజే తన భార్యకు ఏమని చెబుతాడు అంటే శిష్యుడికి చేసే వంటకాలలో ఏ మాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు. 

అలాగే చేస్తోంది గురుపత్ని! ఈ శిష్యుడు కూడా అలాగే తింటున్నాడు శిష్యుడు. అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కోటి నేర్పుతున్నాడు . 

కొంత కాలం ఇలా క్రమంగా జరిగింది. ఒక రోజు శిష్యుడు ఒక్కడే ఉన్నాడు బోర్ కొట్టి వీది బయటకి వెళ్ళీ అన్నీ చూస్తూ చల్లగాలికి దారిలో ఒక ఆలోచన వచ్చింది...

 అది ఏంటి అంటే...ఈ గురువు గారు నాకు ఇంకా ఏం చెబుతాడు!? నాకు అన్ని వచ్చేశాయి కదా!? ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి నాకు చాలా మంది తెలుసు కదా!!!! అని అనుకున్నాడు. 

కానీ ఈ విషయం గురించి గురువుతో చర్చించే సాహసం చేయలేదు. 

రెగ్యులర్ గా మర్నాడు భోజనానికి వచ్చాడు శిష్యుడు. కూర్చున్నాడు. భోజనం గురుపత్ని వడ్డించారు. భోజనం ప్రారంబించాడు. 

మొదటి రౌండ్ లో ఉప్పు తక్కువగా అయింది! "వెంటనే శిష్యుడు...'అమ్మగారు, దీంట్లో ఉప్పు మర్చిపోయారు ' అన్నాడు. అలాగే అన్నింట్లో కూడా ఉప్పు లేదు అన్నాడు. భోజనం అయిపోయింది. శిష్యుడిని గురువు గారు పిలిచారు... అబ్బాయి!!! ఇంక నీకు నా దగ్గర విద్య రాదు,! ఆ అర్హత నువ్వు కోల్పోయావు! మరో చోటికి వెళ్ళి నేర్చుకో! అన్నారు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు.. 

ఎలా తెలిసింది అని... ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భోజనం లో ఉప్పు లేకుండా పెడుతూ ఉన్నా రుచి తెలుసుకోలేని శ్రద్ద నీకు విద్య మీద ఉండేది!!! కానీ ఈ రోజు నీకు విద్య మీద కంటే రుచి మీద శ్రద్ధ పెరిగి, విద్య మీద శ్రద్ధ తగ్గిపోయింది. అందుకే నీకు ఉప్పు లేదు అన్న విషయం ఈ రోజు మాట్లాడావు! ఇంక నీకు విద్య రాదు పో అన్నాడు గురువు. ...

ఈ కథ యొక్క గాఢమైన అర్థం ఏంటి అంటే...మనకి శ్రద్ద ఉన్నప్పుడు ఈ రుచులు, షోకులు, పనికి మాలిన కోరికలు, ఆర్భాటాలు, స్త్రీ వ్యామోహం లాంటి అనవసరమైన విషయాలు నీ మనసులోకి రానే రావు. ఆ శ్రద్ద ఎప్పుడైతే తగ్గుతుందో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా అవలక్షణాలు చాలా తేలికగా వచ్చేస్తాయి...ఈ విద్య కరెక్ట్ గా పని చేస్తుందా! మంత్రం కరెక్ట్ గా ఉందా? ఇలా చాలా చాలా ఆలోచన, అనుమానం, సందేహాలు వచ్చి ఉంటాయి. అందుకే సాధకుడు చాలా జాగ్రత్తగా సాధన చేయాలి. బ్రహ్మచర్య వ్రతం తప్పకుండా పాటించాలి. ఆహర నియమం తప్పకుండా ఉండాలి. ఎంతటి చలి కాలం అయినా 3:30 కే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సాధన మొదలు పెట్టాలి. కింద నిద్ర పోవాలి. మాంసం, మధ్యం, మత్తు పదార్థాలు పూర్తిగా విడిచి పెట్టాలి. సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. సమయాన్ని వృదా చేయకూడదు. గురువును, దైవాన్ని సేవించాలి. ఇంకా చెప్పాలంటే కలలో కూడా స్త్రీ వ్యామోహం ఉండకూడదు. అంటే అంత సున్నితంగా...మనసు శుద్ది అవ్వాలి. ఇవి అన్ని సక్రమంగా సాధన చేస్తే మంత్ర తంత్ర సాధనలో బలం పెరుగుతుంది.. అధికారం వస్తుంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat