వేంకటశ్వరుడు అంటే? శ్రీ వేంకటశ్వరుడు వెంట్రుకలే ఎందుకు అడుగుతాడు?..

P Madhav Kumar
🎻🌹🙏 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌷వేం - పాపము
🌷కట - తీసేయడం
🌷శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

🌿కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. 

🌸మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

🌿ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

🌷కృత యుగం - నరసింహావతారం,

🌷త్రేతా యుగం - శ్రీరాముడుగా,

🌷ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

🌸మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. 

🌿ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

🌸కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. 

🌿ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.

🌸కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. 

🌿యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

🌸మనకి పాపాలు అన్ని ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకుల మొదళ్ళుని ఆశ్రయించి ఉంటాయ్. ఆ పాపాలు తీసేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు.

🌿 కలియుగంలో ఏది ఇవ్వాలన్న అందరికి కక్కుర్తి. మన ప్రమేయం లేనిది, మనం పెంచాల్సిన అవసరం లేని దానిని, తనంతట తాను పెరిగేది, భగవంతుని కృప చేత ఉండేది మాత్ర మే ఆయన తీసుకుంటాడు.

🌸 కాబట్టి తిరుమల వెళ్ళండి, మీ తల వెంట్రుకలు ఇవ్వండి & మీ పాపాలు తొలగిపోతాయ్.

🌿వేంకటాచలం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి అడుగు పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు 9రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయ్.... 🚩🌞🌹🙏🎻

🌹🙏ఓం నమో వెంకటేశాయ..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat