మూలతత్త్వం
నాలుగు యోగాలు
హిందూధర్మము జీవిత లక్ష్యంగా పేర్కొనేది ఒక్కటే -అది భగవత్సాక్షాత్కారం. కాని మానవుల మనస్సులు విభఖిన్నాలు; ఒకడి చింతనాసరళి మరొకడి చింతనా సరళిలా ఉండదు. యావన్మందికీ ఒకే మార్గం చూపడం ధర్మం కాదు; అది గందరగోళానికి దారి తీస్తుంది. అందుకే హిందూధర్మము అనేక మార్గాలు చూపిస్తూన్నది.
లక్ష్యాలు, జీవిత విధానం, అనుష్టానం మొదలైన వాటిలో మనిషికీ మనిషికీ తేడా ఉంటుంది. అతడి పురోగతికైన ఏ మార్గమైనా ఈ మూలసత్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకొన్నదై ఉండాలి. తన మనస్తత్వానికి అనుగుణం కాని ఒక మార్తాన్ని ఎంపిక చేసుకొన్న వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టం. దీన్ని గురించి చింతన చేసిన స్వామి వివేకానంద అందుకు తగినట్లు మార్గాలను వర్గీకరించారు.
సామాన్యంగా మనుష్యులను నాలుగు విస్తృత కోవల క్రింద విభజింపవచ్చు. కొందరు బహిర్ముఖులు, కొందరు అంతర్ముఖులు, కొందరు ఉద్వేగపూరితులు, కొందరు వివేచనాపరులు. ఈ నాలుగు వరాల వారిని పరిగణనలో తీసుకొని స్వామీజీ చూపించిన నాలుగు మార్గాలే కర్మయోగం, రాజయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. “అనేక మార్గాల ద్వారా ఒక గమ్యాన్ని చేరగలమనేది వేదాంతమతంలోని మహోదాత్తాశయం; కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా నాలుగని నిర్దేశించాను. ఐనా ఈ మార్గాలు ఒకదానితో ఒకటి చేరువకానంత వేరైనవి కావని గుర్తుంచుకోండి. ఒక యోగం మరో యోగంలో కలిసిపోతుంది. కాని ఎందులో ఏది ప్రధానమై ఉందో దానికి ఆ పేరు పెడతారు.
ఈ నాలుగు యోగాలలో కర్మయోగాన్ని కాలాను గుణమైన మార్గంగా రూపొందించారు స్వామీజీ. అందుకు హేతువులను పరికిద్దాం:
1. పని అనివార్యమైనది
త్రోవలు విభిన్నంగా ఉండవచ్చు. పయనించే రీతులు వేర్వేరు కావచ్చు. కాని ఎవరివల్లా పని చేయ్యకుండా ఉండడం సాధ్యంకాదు. ప్రతి ఒక్కరూ పనిచేసే తీరాలి. అలాటి అనివార్యమైన ఒక దానిని మనకు ఉప యుక్తంగా మలచుకోవడం శ్రేయోదాయకమే కదా! కనుక చేస్తూన్న పనులనే ఒక యోగంగా మార్చి మనలను ఉన్నత జీవితానికి కొనిపోయే కర్మయోగం మనకు అతిసహజమైన మార్గం అవుతోంది.
2. జీవితానికి సౌభాగ్యం చేకూర్చేది
పని చేసి డబ్బు సముపార్టిస్తేనే బ్రతకగలం. కాని ధనం సంపాదించడంలో మాత్రమే మనిషి తృప్తిచెంది ఆగిపోడు. కూడు గుడ్డ మాత్రమే కాక కొన్ని లోతైన విషయాలూ అతడికి అవసరమై ఉన్నాయి. సత్యం గ్రహించాలి, మంచిని అన్వేషించాలి, సౌందర్యాన్ని ఆరాధించాలనే ఆసక్తి జన్మతః అతడిలో ఉంది. సత్యాన్ని గ్రహించేది బుద్ధి, మంచిని అన్వేషించేది ప్రేమ, సౌందర్యాన్ని ఆరాధించేది కళ. బుద్ధిని ఉపయోగించాలనీ, ప్రేమను పంచుకోవాలనీ, కళను అభివ్యక్తం చేయాలనీ మనలో ప్రతి ఒక్కరం తహతహలాడతాం. అలా అభివ్యక్తం చేయాలనే మనలో ప్రతి ఒక్కరం తహతహ లాడతాం. అలా అభివ్యక్తం చేయడానికి అనువుగా పని కుదిరినప్పుడు, ఆ పని సంతోషదాయకం అవుతుంది, అర్ధవంతమౌతుంది. తన అనుభూతులను అఖభీవ్యక్తం చేయడానికి, అంటే. తనను అభివ్యక్తం చేసుకోవడానికి అనుకూలంగా ఒక పని కుదిరినప్పుడు ఆ పని విశ్రాంతినిస్తుంది, ప్రశాంతతను ఒసగుతుంది.
ఇలా తనను అభివ్యక్తం చేసుకోవడం ద్వారా, అందుకు తగిన పనులలో నిమగ్నమవడం వల్ల మనిషి నిజానికి తనను, తన నానావిధ పరిమాణాలను అవగతం చేసుకోగలడు. ఇందు నిమిత్తం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది కర్మయోగం.
3. కాలానికి అనుగుణమైనది
నేటి జీవిత వేగం గురించి చెప్పి మనం తెలుసు కోవలసింది లేదు. ఆ వేగం నుండి విడివడి దేన్నీ చేయవలసింది లేకుండా, ఆ వేగంతో బాటే సాధించదగ్గ ఒక మార్గం కాలానికి అనుగుణంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
4. కర్మయోగం కఠినమైనది
అనివార్యమైనది, కాలానికి అనుగుణమైనది అని మనం చెప్పినందున కర్మయోగం ఏదో సులభ సాధ్యమైనదని భావించరాదు. “కర్మయోగం, కలియుగంలో ఎంతో "కఠినమైన మార్గం” అన్న శ్రీరామకృష్ణుల వాక్కులు జ్జప్తిలో ఉంచుకోవడం అత్యావశ్యకం. పైపైకి కర్మయోగం ఎంతో సులభమైనదిగా కనిపిస్తుంది. కాని అలా కాదు. కర్మయోగ మార్గాన్ని, దాని ఆచరణను పరికించినప్పుడే దాని నిజమైన లోతులు మనకు తెలియవస్తాయి.