గణపతిని నిమజ్జనం చేస్తారు ఎందుకు ?

P Madhav Kumar

 

మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో ‘మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు ?’ అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.

చెపుతాను వినండి మట్టితో వినాయకుని చేస్తాం  ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం  పూజ చేస్తాం  అంతవరకు బాగానే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే  కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే…. అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా ? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం.

అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి , స్థితి , లయల చక్రభ్రమణం  ఇదే పరబ్రహ్మతత్వం అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి ఈ విగ్రహాన్ని సముద్ర జలమందు గానీ , నదీ , తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి , అంటే వ్యాపిస్తూ , పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ , భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే” అని వివరించారు సూతమహర్షి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat