చతుర్వేదములు | Chaturvedamulu

P Madhav Kumar

 

వేదాలు నాలుగు

ఋగ్వేదం,  యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.

1. ఋగ్వేదం

దేవతల గుణగణాలు ఇందిలో ప్రత్యేకం. అగ్నిదేవుడి ప్రార్ధనతో ఈ వేదం ప్రారంభమవుతుంది. ఇందులో 1017 సూక్లా, 10,580 మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 43,200 అక్షరాలు ఉన్నాయి. ఋగ్వేదంలొ ఉండే మంత్రాలను రుక్కులు అని కూడా అంటారు. ఇవి ఛందోబద్ధాలు.

2. యజుర్వేదం

ఇది యజ్ఞయాగాదులు గురించి వివరిస్తుంది. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. 
అవి:
  • శుక్ల యజుర్వేదం (యాజ్ఞ వల్క్య మహర్షి). ఇందులో 1975 పద్యగద్యాలున్నాయి.
  • యజుర్వేదం (త్తెత్తరీయ మహర్షి). ఇందులో 2198 మంత్రాలు, 19,200 పదాలు ఉన్నాయి.

3. సామవేదం

ఇది అతి చిన్నది. సమం అంటె గ్రామం. ఇందుల్రో మంత్రాలు 1875 ఉన్నాయి. వీతిలో 1504 ఋగ్వేద మంత్రాలే. 99 మాత్రమే కొత్తవి. 272 పునరుక్తాలు. భారతీయ సంగీత శాస్త్రానికి సామవేదమే మూలం. ఇది శాంతి వేదం.

4. అధర్వణ వేదం

లౌకిక విష్యాలను ఇది వర్ణిస్తుంది. 5977 మంత్రాలు ఉన్నాయి. అనేక చికిత్సావిధానాలు ఉన్నాయి. మూలికా చికిత్స కొడా ఇందులో వర్ణించి ఉంది. రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థల గురించి వివరంగా వర్ణనలు ఉన్నాయి. దీనినే బ్రహ్మ వేదమని కూడా అంటారు. రాజ్యం, రాజకీయాల గురించి వివరించినందుకు క్షత్ర వెదమని, చికితల గురించి వివరిస్తుంది కాబట్టి భిషగ్వేదమని కూడా పిలుస్తారు. వేదాలను అర్థం చేసుకోవడం సామాన్యులకు ఒకింత కష్టమే. అందుకే వీటిని చదివి అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పద్ధతిని ఏర్పరిచారు. దీని ప్రకారమే ఆరు వేదాంగాలు, నాలుగు ఉపవేదాలు ఉన్నాయి.
  1. వేదాంగాలు: శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, కల్పం.
  2. ఉపవేదాలు: గాంధర్వ వేదం, ఆయుర్వెదం, ధనుర్వేదం, అర్థవేదం. అథర్వణ వేదమే ఈ నాలుగు ఉప వేదాలకు మూలమని భావిస్తారు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat