సప్త చక్రాలు | Sapta Chakras

P Madhav Kumar

 

వ్యక్తులు చుట్టూ సానుకూల శక్తి ఉండేలా చేయడం ద్వారా వారు నిరంతరం సంతోషంగా ఉండేలా సప్తచక్రాలు దోహదపడతాయి. మీ సప్త చక్రాలు క్రియాత్మకం కావడం ద్వారా మీలో సానుకూల శక్తి ప్రవహించి మీరు మంచి ఆరోగ్యం మరియు మంచి ఆలోచనలతో ముందుకు సాగడానికి దోహదపడుతుంది.

ఈ సప్త చక్రాలు నేరుగా ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి, వీటిని ఎండోక్రైనన్ వ్యవస్థ నిర్వహిస్తుంది, సప్త చక్రాలు కాంతి మండల ప్రాంతం మరియు మెరిడిన్ వ్యవస్థల మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా విభిన్న శక్తి స్థాయిల్ని ఏర్పరుస్తుంది. ఈ శక్తి భౌతికంగా శరీరంలోనికి ప్రవహించడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది

మన శరీరంలోని సప్తచక్రాలు, శరీరంపై వాటి ప్రభావం:

1. సహస్ర చక్రం - Crown Chakra (Sahasrara)

సహస్ర చక్రం - Crown Chakra (Sahasrara)
సహస్ర చక్రం
సహస్ర చక్రాన్ని ఆంగ్లంలో ‘క్రౌన్ చక్రం’ అని అంటారు, ఇది తల మరియు మెదడు పైన ఉంటుంది. ఇది సహస్ర చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే, వ్యాకులత, పార్కిన్సన్ , స్కిజోఫేనియా, మూర్చలు, సినెల్ డిమెంత్రియా, అల్జీమర్ వ్యాధి, మానసిక రుగ్మతలు, గందరగోళం మరియు మగత వంటి వ్యాధులు వస్తాయి.

2. అజ్న చక్రం - Third-Eye Chakra (Ajna)

అజ్న చక్రం - Third-Eye Chakra (Ajna)
అజ్న చక్రం
అజ్న చక్రాన్ని ఆంగ్లంలో ‘ ద బ్రో చక్రా’ అని అంటారు, ఇది నుదిటి మధ్యలో ఉంటుంది. ఇది ఏడు చక్రాల్లో రెండోది. అజ్నా చక్రం క్రియాత్మకం కానట్లయితే, ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్, దృష్టి లోపం, గ్లూకోమా, క్యాటరాక్ట్‌, పొత్తికడుపు, చెవి సమస్యలు వస్తాయి.

3. విశుద్ధ చక్రం - Throat Chakra (Vishuddha)

విశుద్ధ చక్రం - Throat Chakra (Vishuddha)
విశుద్ధ చక్రం
విశుద్ధ చక్రం గొంతు మరియు ఊపిరితిత్తుల ప్రాంతంలో ఉంటుంది. ఇది ఏడు చక్రాల్లో మూడోది. విశుద్ధ చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే థైరాయిడ్ సమస్యలు వస్తాయి, ఎక్కువగా లేదా తక్కువగా చురుగ్గా ఉండటం, ఆతురత ( బహళ చక్ర సమస్య, అయితే ఇది ప్రధానం గొంతు చక్రానికి సంబంధించినది), ఆస్తమా, ఊపిరితిత్తుల్లో నిమ్ము, వినికిడి, ధనుర్వాతం వంటి సమస్యలు ఏర్పడతాయి.. ఇవి అజ్న చక్రానికి సంబంధించిన సమస్యలకు కూడా అనుసంధానం అవుతాయి, దీని వల్ల పై జీర్ణ వ్యవస్థ, నోటిపుండ్లు, గొంతులో పుండు, గొంతులో కాయలు ఏర్పడతాయి.

4. అనాహత చక్రం - Heart Chakra (Anahata)

అనాహత చక్రం - Heart Chakra (Anahata)
అనాహత చక్రం
అనుష్ట చక్రాన్ని ‘ గుండె చక్రం’ అని కూడా అంటారు. ఇది గుండెకు దగ్గర్లో ఉంటుంది. ఇది ఏడు చక్రాల్లో నాలుగోది. అనుహత చక్రం క్రియాత్మకం కానట్లయితే గుండె జబ్బులు, రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులు వస్తాయి: మయాల్జియా, ఎన్‌సిఫాలో మిల్లిటస్- కొన్ని సార్లు దీర్ఘకాలిక అలసటకు దారి తీయడంతోపాటుగా, రోగనిరోధక శక్తి క్షీణించడం, అలర్జీలు, రొమ్ము క్యాన్సర్ రావొచ్చు.

5. మణిపూర చక్రం - Solar Plexus Chakra (Manipura)

మణిపూర చక్రం - Solar Plexus Chakra (Manipura)
మణిపూర చక్రం
మణిపూర చక్రాన్ని ఆంగ్లంలో ‘సోలార్ ప్లెక్సెస్ చక్ర’ అని కూడా అంటారు, ఇది కాలేయం, ప్లీహం మరియు పొట్టకు దగ్గరల్లో ఉంటుంది. ఏడు చక్రాల్లో ఐదోది. మణిపూర చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే మధుమేహం, ప్యాంక్రియాటిస్, కాలేయ వ్యాధి, పెప్టిక్ అలర్స్, పురీష వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు లాంటి సమస్యలు రావొచ్చు.

6. స్వాదిష్టాన చక్రం - Sacral Chakra (Swadhisthana)

స్వాదిష్టాన చక్రం - Sacral Chakra (Swadhisthana)
స్వాదిష్టాన చక్రం
స్వాదిష్టాను చక్రాన్ని ఆంగ్లంలో ‘సాక్రెల్ చక్రం’ అని కూడా అంటారు, ఇది గర్భసంచి, ప్రొస్టేట్, గర్భాశయం మరియు వృషణాలు ఉండే ప్రాంతంలో ఉంటుంది. ఇది ఏడు చక్రాల్లో ఆరోది. స్వాదిష్టాన చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే ముందస్తు రుతుస్రావ సమస్యలు, రుత స్రావంతో సమస్యలు, గర్భాశయంలో తిత్తులు, గర్భసంచిలో తిత్తులు, విరేచనం ఆపుకోలేకపోవడం, ఎండోమెట్రియోసిస్, వృషణాల వ్యాధి, ప్రొస్టేట్ వ్యాధి మొదలైన వ్యాధులు కలుగుతాయి.

7. మూలాధార చక్రం - Root Chakra (Muladhara)

మూలాధార చక్రం - Root Chakra (Muladhara)
మూలాధార చక్రం

మూలాధార చక్రాన్ని ఆంగ్లంలో ‘ ద బేస్ చక్రం’ అని అంటారు, వెన్నుపాము దిగువ ఉంటుంది. ఏడు చక్రాల్లో చిట్టచివరిది, మూలధార చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే మలబద్ధకం, డయేరియా, పైల్స్, కాళ్లు మరియు చేతి వేళ్లు చల్లబడటం, తరచుగా మూత్రానికి వెళ్లడం, హైపర్ టెన్షన్(అధికంగా రక్తపోటు) మూత్రంలో రాళ్లు, లైంగిక పటుత్వం లేకపోవడం, పిరుదులకు సంబంధించిన సమస్యలు మొదలైనవి ఏర్పడతాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat