తెలంగాణా లోని చిన్న తిరుపతి వట్టెం వెంకన్న కొండ

P Madhav Kumar

*వట్టెం వెంకన్న కొండ* 

తెలంగాణా రాష్ట్రం లోని నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లిమండలంలోని వట్టెం గ్రామంలో 'వెంకన్నకొండ' పైన కొలువయ్యాడు కోనేటిరాయడు. బిజినేపల్లినుండీ 6 కిలోమీటర్లు, వనపర్తి నుండీ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కలియుగ దైవం నెలకొన్న కొండ. ఈ కొండని తొలుత అడ్డగట్టు గా పిలిచేవారు. శ్రీవారి ప్రభావంతో, ఆవిర్భావం తో ప్రభవించిన వెలుగులతో ఈ అడ్డగుట్ట నేడు వెంకన్న కొండగా మారి అడుగడుగు దండాలు అందుకొంటోంది.తెలంగాణా చిన తిరుపతిగా సుప్రసిద్ధమైన ఈ క్షేత్రానికి ప్రయాణం భక్తులకు ఒక మరపురాని ఆధ్యాత్మికానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహంలేదు. దారంతా. పరుచుకున్న పచ్చదనం, మెలికలు తురుగుతూ ఆదిశేషున్ని గుర్తు తెచ్చే మలుపులు | మెలికల నడుమన స్వచ్ఛంగా ఒదిగిపోయిన పల్లె సోయగం %. ఉరుకుల పరుగులు జీవనసరళికి ఆటవిడుపులా అనిపిస్తుంది. అక్కడి ప్రకృతిలో ప్రతి అణువునా గోవింద నామం నిండిఉందేమో అనిపిస్తుంది...విష్ణుసేవకుల్లో అగ్రగణ్యులనదగిన వారు ముగ్గురు శేషతల్పమైన ఆదిశేషుడు, వాహనమైన గరుక్మంతుడు, దాసానుదాసుడైన హనుమంతుడు. శ్రీనివాసుడు వెంకటేశునిగా అవతరించే శుభ ముహూర్తంలో, స్వామి ఆదేశానుసారం గరుక్మంతుడు, హనుమంతుడు చెరో పాదరక్షనూ ఇద్దరు చర్మకారుల వద్ద చేయించి తెచ్చారని శృతి వచనం. అలా వేంకటేశుని దూతలై ఆయన భక్తులను బ్రోచే పనిలో వీరిద్దరూ ముందు వరుసలో నిలుస్తారు. అందికే కాబోలు తానెక్కడ ఉన్నా తనతో పాటే వీరిని వెంట తీసుకు వెళతారు స్వామి. అడ్డగుట్టకు వెళ్ళే దారిలో, మలుపుల మెలికల రూపంలో ఆదిశేషుడే భక్తులను వెంటతీసుకొని వేంకటేశుని గుట్టవైపుగా ముందుకు సాగితే, నిలువెత్తు గరుక్మంతుడు, హనుమంతుడు బాటకు ఇరువైపులా నిలిచి స్వామిసన్నిధికి స్వాగతిస్తారు.పరమాత్మ అభివ్యక్తిని తన ఆనందంతో వెల్లడిచేస్తుంటుంది ప్రకృతిమాత. ఈ వెంకన్న కొండను చూస్తే ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. ఈ కొండ వనమూలికలకు నిండైన అండ. విలువైన వృక్ష జాతులతో పచ్చగా కనిపిస్తుంటుంది. ఆచార్యద్వారాన్ని దాటుకొని కొండపైకి చేరుకుంటే, ఇరువైపులా తీర్చిన మెట్ల తో చెంతకు ఆహ్వానిస్తూ కనిపిస్తుంది. స్వామి కోనేరు మానవ నిర్మితమే అయినా ఈ కోనేటిలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉ నిలయాలు దర్శనీయాలు.. ంటాయి . ఈ ఆలయ ధ్వజస్తంభం పైన అలా ఆయన దాల్చిన దశావతారాల విశేషాలు చూడొచ్చు.సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ముఖమండపంలోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకరంగా అనిపిస్తూ వుంటుంది. జయ విజయులు ద్వారానికి ఇరువైపులా కావలి నిలువగా ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరుడు ప్రసన్న వదనంతో నిలిచి ఉంటారు. చక్కని రూపు

చల్లని చూపు వేంకటేశ్వరస్వామి సొంతం. అచ్యుతుడు అలంకార ప్రియుడు కదా, ఏ అవతారంలో ఉన్నా సౌందర్య దీప్తితో ప్రకాశిస్తూనే ఉంటాడు. శ్రీవారు శంఖ, చక్ర, గదా, హస్తాలతో చతుర్భుజునిగా దర్శనమిస్తారు. వెంకటేశునిగా స్వామి భక్తుల పాపాలను నాశనం చేస్తారని ప్రతీతి. అందుకే ఆయన ప్రాంగణంలోకి ప్రవేశించగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వామి నీలమేఘశ్యాముడై, తులసీ మాలలతో, పుష్పమాలా శుశోభితంగా దర్శనమిస్తారు . ఈ ఆలయ వైశిష్ట్యం అపారమని, ఈ కొండపైని స్వామి కరుణాసముద్రుడని స్థానికుల విశ్వాసం.

శ్రీవారి తోపాటు ఇక్కడ దేవేరులు పద్మావతి, గోదామాత నెలకొని ఉన్నారు. నిరుపేదగా ఉన్న వెంకటవిభుని పతిగా వలచి వలపించిన రాకుమారి పద్మావతి. మధుర భక్తిలో తననే శ్రీ రంగనాధునిగా భావించి, ఆయన కోసం ఎంచి, అల్లిన మాలలను తాను ధరించి, అటుతర్వాత స్వామికి ధరింపజేసిన రంగనాయకి గోదాదేవి. ఈ ఇరువురూ స్వామికి సర్వస్య శరణాగతి చేసి, పరమాత్మ ప్రేమకి వశుడని నిరూపించారు. మధురమైన భక్తి మార్గాన్ని ప్రబోధించారు. అలా స్వామిని చేరిన గోదామాత ఆత్మ. పరమాత్మల నడుమ భేదం లేదని, సర్వం పరమాత్మ స్వరూపమేనని తన చిరునగవుల మాటున పురుషోత్తముని చేరే దారిని చూపిస్తుంటుంది. ఇక ఈ పరతత్వాన్ని గ్రహించి అనంతుని చేరి అమృత ఆనందాన్ని అనుభవించమని పద్మావతి ప్రబోధిస్తుంటుంది.

వెంకటేశ్వరాలయం చారిత్రిక వైభవం సుప్రసిద్ధమైనది. సత్యం ఉ న్న స్వామని ఇక్కడి ప్రజలు శ్రీవారి గురించి చెప్పుకునే కథలు మనకి తెలియజేస్తాయి. చుట్టుపక్కలున్న ఉపాలయాలు, గోసేవా వెంకటాచలపతి ఆవిర్భావం పుట్టలోనుండే జరిగిందని ఆయన చరిత్ర చెబుతుంది. పుట్టనుండీ బయటకొచ్చిన స్వామిని పొరపాటున గొడ్డలితో కొట్టిన గొల్లవాని చరిత సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే, ఇక్కడ వట్టెం వేంకటేశుడు కూడా పుట్టనుండే ఆవిర్భవించడం ఒక అద్భుతంగా ఇక్కడి స్థానికులు చెప్పుకుంటారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat