వేద వ్యాసుడు - వేద వ్యాసునికి గురు పౌర్ణమికి సంబంధం ఏమిటి? వ్యాసుడు ఆది గురువు ఎలా అయ్యాడు?

P Madhav Kumar

 సప్త చిరంజీవుల్లో 

ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. 


వేదాలను నాలుగు భాగాలుగా విభజించి 

వేద వ్యాసుడయ్యాడు. 

వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు.




ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. 


వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు.


మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు

అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు జన్మించింది ఓ మత్స్య కన్యకి. 


పడవనడుపుకునే దాశరాజు కుమార్తె పేరు మత్స్య గంధి. ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. యుక్త వయస్సు వచ్చాక తండ్రికి సాయంగా యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది. 

ఆదిత్యనారాయణ..

ఒక రోజు వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనం చేసేందుకు కూర్చుంటాడు. మహర్షిని ఆవతలి ఒడ్డుకి తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు దాశరాజు. 


సరేనన్న మత్స్యగంధి 


పరాశర మహర్షిని ఎక్కించుకుని ఆవలి ఒడ్డుకి తీసుకెళుతుంటుంది. ఆ సమయంలో మత్స్య గ్రంధిని చూసి పరాశమ మహర్షి మనసు చలించింది.తన మనసులో కోర్కెను ఆమెకు చెప్పాడు పరాశర మహర్షి. అంతటి మహర్షి అలా అడిగేసరికి మత్స్య గంధి తను ఏమనుకుందో చెబుతుంది.


మత్స్య గంధి: ఇంతటి మహానుభావులు , కాలజ్ఞానులైన మీరు ఇలా ఎలా ఆలోచిస్తారు. పైగా పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని మీకు తెలియదా

పరాశర మహర్షి: అందుకు సమాధానంగా పడవ చుట్టూ ఓ మాయా తిమిరం ( చీకటిని) సృష్టించాడు.

మత్స్య గంధి: మీ కోరిక తీరిస్తే నా కన్యత్వం భంగమవతుంది తిరిగి నా తండ్రికి ముఖం ఎలా చూపించాలి

పరాశర మహర్షి: నాతో సంగమించిన తరువాత కూడా కన్యత్వం చెడదు అని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు

మత్స్య గంధి: నా శరీరం నుంచి వస్తున్న ఈ మస్త్యగంధం( చేపలకంపు) నచ్చలేదు, దాన్నుంచి విముక్తి చేయండి మహర్షి

పరాశర మహర్షి: ఆ వరంతో పాటూ ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజనదూరం వరకూ వ్యాప్తిచెందుతుందని వరమిస్తాడు. అప్పటి నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారిపోయింది. అప్పుడు వారిద్దరి కలయికతో జన్మించిన పుత్రుడే వ్యాసుడు


సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు

సూర్యసమాన తేజస్సుతో, సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు తపస్సుకి వెళుతున్నా అని తల్లితో చెబుతాడు. అయితే ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. చిన్నప్పుడే ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు. 


మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతకథలో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు.

ఆదిత్యాయోగీ..

భరత వంశాన్ని నిలిపినది వ్యాసుడే

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత యోజనగంధి అయిన సత్యవతి…భీష్ముడి తండ్రి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. 


సత్యవతి తండ్రి దాశరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందుతారు. 


ఇక భరతవంశాన్ని నిలిపేందుకు సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. 


ఆతర్వాత కూడా భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు.


వ్యాసుడు జన్మించిన రోజే గురు పూర్ణిమ

మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి అందించారు. వేదాలను నాలుగు బాగాలుగా చేశాడు కాబట్టే వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసుని పుట్టిన రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. కాబట్టి దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు...


అశాంతికి కారణం 

సరియైన వివేకం లేకపోవడమే. 


ఈ కోరిక మెులకగా ఉన్నప్పుడే 

దానిని త్రుంచి వేయాలి. లేకపోతే అది పెరిగి పెద్దదై మహావృక్షమై మనస్సుని పాడుచేస్తుంది.

దీనివలన జ్ఞాపకశక్తి కూడా నశిస్తుంది. కనుక మానవుడు తన మనస్సును కోరికల మీదకు పోనీయకుండా దృష్టిని దైవం మీదకు త్రిప్పినట్లయితే కోరిక నశించి మోక్షం కలుగుతుంది. ఈ అశాంతికి ఒక తార్కాణం ఏమిటో ఓ కథ ద్వారా తెలుసుకుందాం.


ఒక ఊరిలో పార్వతీశ్వర వర్మ అనే రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ అశాంతికి గురి అవుతూ ఉండేవాడు. అతను తన అశాంతికి కారణం తెలుసుకోవాలని ఒకరోజు గ్రామంలో దండోరా వేయించి తన అశాంతికి కారణం తెలిపిన వారికి మూడు గ్రామాలతో పాటు ధనం ఇస్తానని ప్రకటించాడు. అది విని ఎందరో పండితులు, బహుభాషాకోవిదులు రాజుగారి కొలువుకి వచ్చారు. ఎన్నో నిర్వచనాలు చెప్పి, శాస్త్రాలన్నింటిని రాజు ముందు ఉంచారు. ఇవేవి రాజుగారిని తృప్తి పరచలేకపోయాయి. ఇంతలో సుదాముడు అనే ఒక యువకుడు వచ్చాడు. అతడిని చూసి ఆశ్చర్యపడుతూ మహారాజు ఇలా అన్నాడు.


మీరేమో అల్పవయస్కులు, అనుభవం కూడా అంతంతమాత్రంగానే ఉండే పరువం.. అంత పెద్ద వృద్ధ పండిత శిఖామణులే తీర్చలేని మా అనుమానాన్ని మీరెలా నివృత్తి చేయగలరు అని ప్రశ్నించాడు. ఆ సుదాముడు అనే యువకుడు సన్యాసం పుచ్చుకొని దండకారణ్య అడవులలో పుష్కరకాలం పాటు తపస్సు చేసి, సత్యాన్ని గ్రహించి, అంబ కృప చేత జ్ఞాననేత్రాన్ని పొందాడు. అతడి గంభీర కంఠస్వరం విని కొలువుతీరిన జ్ఞాన సంపన్నులు, రాజ నీతిజ్ఞులు అందరూ ఆశ్చర్యపోయారు.


అప్పుడు మహారాజు మనిషిని అల్లాడిస్తున్న ఆశల మూలస్థానం ఏమిటని అడిగాడు. సుదాముడు ఇలా చెప్పాడు. కొన్ని సత్యాలు బాహ్యదృష్టికి కనిపించవు. అవి అంతర్దృష్టితో గోచరిస్తాయి. అటువంటి అంతర్దృష్టి కలగాలంటే అంతరాత్మను మేల్కొల్పాలి. ఆ కోణాన చూస్తే అశాంతి సుడిగుండానికి అత్యాశే మూలకారణం. అది అశాంతికి తోబుట్టువు. అన్యాయ, అక్రమాలకు కేంద్రబిందువు. అది మీలోనూ ఉంది. అందుకే మీకు అశాంతి కలుగుతుంది అని చెప్పాడు. అది విన్న మహారాజు కోపంతో ఊగిపోతూ నిరూపించమని అడుగగా సుదాముడు మీకిప్పుడు ఇద్దరు సతీమణులు. అందులో మెుదటి సతీమణేమో మధురానగర చక్రవర్తి కూతురు.


ఆయన కుమార్తెతో బాటు ఆమె తండ్రిగారి అర్థరాజ్యాన్ని పొందారు. రెండవ భార్య తండ్రేమో కోసలరాజ్య దేశాధిపతి. ఆయనకు ఒక్కగానొక్క కూతురు తప్ప మరెవరూ లేరనే కారణం చేత ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసి ఆయన రాజ్యాన్ని మీ రాజ్యంతో కలుపుకున్నారు. అంతటితో మీ ఆశల దాహం తీరక పొరుగూరి వజ్ర వ్యాపారి జ్యేష్ఠ పుత్రికను పెళ్లాడి ఆయన సర్వ సంపదనూ దోచుకున్నారు. దీని పేరే ఆశ. అని చెప్పగా మహారాజు సిగ్గుతో తలవంచుకున్నాడు. పశ్చాత్తాపం చెందిన రాజు సుదాముడికి ధనం బహుకరించాలని ఇవ్వబోగా సుదాముడు నవ్వుతూ... నేనుగానీ వీటిని స్వీకరించినట్లయితే మీకూ నాకూ వ్యత్యాసమేముంటుంది మహారాజా అంటూ రాజసభలో నుంచి వెళ్లిపోయాడు. కాబట్టి మనం కూడా ఆశ అనే దాన్ని ఆదిలోనే తుంచి మనకు ఉన్నదానితో తృప్తిగా జీవనం సాగించాలి. అప్పుడే అశాంతి మన దగ్గరకు రాదు...

.


తృప్తిని మించిన సంపద లేదు!


"మనిషికి కోరికలు అనంతం. 

జీవితం నీటి బుడగ వంటిదని తెలిసీ కలకాలం" బతకాలనుకొంటాడు. 


నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. 


భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు. భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్ధనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. 


నిస్వార్ధంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు.


కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోష పెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. 


తనకు మరణం లేని వరం _ప్రసాదించమంటాడు. 

అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. 


మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు. రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.


కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. 


సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిదుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు 

కమలాసనుడు.. 

విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో

తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు. 

ఆదిత్యనారాయణ..

ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు. విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.


"భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి. తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు' అన్న రమణ మహర్షి బోధను అర్ధం చేసుకున్నవారికి భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది.


తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat