వివిధ రకముల హారతులు - విశిష్టత

P Madhav Kumar


ఏకహారతి – మహేశ్వరుడు
ద్విహారతి – ఉమా మహేశ్వరులు
త్రిహారతి – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి – పంచభూతాలు
సప్తహారతి – సప్త ఋషులు
అష్టహారతి – అష్టమూర్తులు
నవహారతి – తొమ్మిది గ్రహాలు
దశహారతి – దిశానాయకులు
నాగదీపహారతి  – వాసుకి
రథదీపహారతి – సదాశివుడు
మేరుదీపహారతి – బ్రహ్మ
వృషభదీపహారతి – నంది
పురుషదీప హారతి – శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి – పంచముఖశివుడు

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.
పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.
కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.
రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.

చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.
నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.
కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.
ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.
కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో  దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ‘ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి’ అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

రచయత: సేకరణ : జంపని శ్రీనివాస మూర్తి గారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat