శాంతి మంత్రము - Shanthi Mantramu

P Madhav Kumar

 శాంతి మంత్రము - Shanthi Mantramu

ఓం భద్రం కర్ణేభిః  శృణుయామ దేవాః  భద్రం పశ్యేమా క్షభిర్యజత్రాః
స్థిరై రంగై స్తుష్టువాగ్ం సస్తనూభిర్వ్య శేమ దేవహితం యదాయుః
స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః  స్వస్తినః  పూషా విశ్వవేదాః |
స్వస్తి న స్తార్చ్వో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు ||
ఓంశాంతిః శాంతిః శాంతిః

ఓ దేవతలారా! మా చెవులతో శుభప్రదమైన మాటలనే వినెదము గాక ఓ పూజనీయులారా! మా నేత్రములతో శుభకరమగు వానినే దర్శించెదము గాక! మిమ్ములను స్తుతించుచు మా ఆయుష్కాలమును సంపూర్ణ ఆరో గ్యముతో, శక్తితో జీవించెదముగాక! సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక! సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలుగ జేయు గాక! ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక! మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః
    అధర్వణవేదంలోని ఈ శాంతి మంత్రమును శిష్టాచార సంప్రదాయములో గురుశిష్యులిరువురు కలిసి ఈ శాంతి మంత్రమును పఠించిన తరువాతనే శాస్త్రాధ్యయనమును ప్రారంభించెడివారు.  ఏ విధమైన ఉపద్రవములు గాని, విఘ్నములుగాని సంభవించకుండా శాస్త్రాధ్యయనము నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగుటకు చేయు ప్రయత్నమే ఈ శాంతిమంత్రము.

      ఒక కార్యము ఫలప్రదము కావలెననిన మానవ ప్రయత్నమొక్కటియే చాలదు, కాలము దైవము అనుకూలించవలెను. ఈ మూడు విషయములు పుష్కలముగా సహకరించవలయు ననెడి దివ్యభావమును ఆంతర్యములో ఆవిష్కరించుకొనుటయే ఈ శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశము.

రచన: గాజుల సత్యనారాయణ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat