శ్రీ గంగాదశహరా స్తోత్రమ్‌, Sree Ganga Stotram

P Madhav Kumar


 త్రికరణములతో చేసిన పదిరకముల పాపములను నశింపజేసే ‘శ్రీ గంగాదశహరా స్తోత్రమ్‌’

పదిరకముల పాపములు అనగా...
  • 1. అపాత్రులకు దానము చేయుట, హింసించుట, పరస్త్రీయందు కామనాబుద్ధి అనబడే శారీరక పాపములు. 
  • 2. కఠినముగా మాటలాడుట, అసత్యము, చాడీలు చెప్పుట, అనవసరపు మాటలాడుట అనే వాక్కుకి సంబంధించిన పాపములు 
  • 3. పరుల ధనాదులయందు ఆసక్తి, ఇతరులకు కీడు తలపెట్టుట, పాపకార్యములయందు ఆసక్తి కలిగియుండుట అనబడే మానసిక పాపములు. పశ్చాత్తాపముతో ఈ స్తోత్రమును చదివినవానియొక్క ఈ పదిరకముల పాపములను (ఏజన్మలో చేసినవైనప్పటికీ) ఈ స్తోత్రపఠనము నశింపజేయును.
బ్రహ వాచ:
నమఃశివాయై గంగాయై శివదాయై నమో నమః

నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమో నమః।। 1
నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యె నమో నమః ।

సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే ।। 2
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్‌ - శ్రేష్ఠై్య నమో-స్తుతే ।

స్థాణుజంగమసమ్భూత విషహంత్య్రై నమోనమః।। 3
భోగోపభోగదాయిన్యై భగవత్యై నమోనమః।

మందాకిన్యై నమస్తే-స్తు స్వర్గదాయై నమోనమః।। 4
నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్య్రై నమోనమః।

నమస్త్రిశుక్లసంస్థాయై తేజోవత్యై నమోనమః।। 5
నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమోనమః।

నమస్తే విశ్వముఖాయై రేవత్యై తే నమోనమః।। 6
బృహత్యైతే నమస్తే-స్తు లోకధాత్య్రై నమోనమః।

నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః।। 7
పృథ్వ్యై శివామృతాయై చ సువృషాయై నమోనమః।

శాంతాయై చ వరిష్ఠాయై వరదాయై నమోనమః।। 8
ఉగ్రాయై సుఖదోగ్ద్యె చ సంజీవిన్యై నమోనమః।

బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః।। 9
ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమో-స్తుతే ।

సర్వాపత్‌ ప్రతిపక్షాయై మంగలాయై నమోనమః।। 10
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే ।

సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమో-స్తుతే ।। 11
నిర్లేపాయై దుర్గహంత్య్రై దక్షాయైతే నమోనమః।

పరాత్పరతరే తుభ్యం నమస్తే మోక్షదే సదా ।। 12
గంగే మమాగ్రతో భూయాత్‌ గంగే మే దేవి పృష్ఠతః ।

గంగే మే పార్శ్వయోరేహి త్వయి గంగే-స్తు మే స్థితిః।। 13
ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వం త్వం గాంగ తే శివే ।

త్వమేవ మూలప్రకృతిస్త్వం హి నారాయణః పరః।। 14
గంగేత్వం పరమాత్మాచ శివస్తుభ్యం నమః శివే ।

య ఇదం పఠతి స్తోత్రం భక్త్యా నిత్యం నరో-పి యః।। 15
శ్రుణుయాత్‌ శ్రద్ధయా యుక్తః కాయవాక్చిత్తసంభవైః ।

దశధాసంస్థితైర్దోషైః సర్వైరేవ ప్రముచ్యతే ।। 16
సర్వాన్కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లియతే ।

జ్యేష్ఠేమాసి సితే పక్షే దశమీ హస్తసంయుతా ।। 17
తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలే స్థితః।

యః పఠేద్దశకృత్వస్తు దరిద్రో వాపి చాక్షమః।। 18
సో-పి తత్ఫలమాప్నోతి గంగాం సమ్పూజ్య యత్నతః।

అదత్తానాముపాదానం హింసా చైవావిధానతః।। 19
పరదారోపసేవా చ కాయికం త్రివిధం స్మ మీతమ్‌।

పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః।। 20
అసమ్బద్ధ ప్రలాపశ్చ వాఙ్మయం స్యాచ్చతుర్విధమ్‌ ।

పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచిన్తనమ్‌ ।। 21
వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మ మీతమ్‌ ।

ఏతాని దశపాపాని హర త్వం మమ జాహ్నవి।। 22
దశపాపహరా యస్మాత్తస్మాద్దశహరా స్మ మీతా ।

త్రయస్త్రింశచ్ఛతం పూర్వాన్‌ పితౄనథ పితామహాన్‌ ।। 23
ఉద్ధరత్యేవ సంసారాన్మన్త్రేణానేన పూజితా । 24

నమో భగవత్యై దశపాపహరాయై గఙ్గాయై నారాయణ్యైరేవత్యై।
శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నన్దిన్యై తే నమోనమః।।25

గంగా అవతరణం
గంగావతరణం అనగా ఇంద్రలోకం లో ఉండే గంగ భూమి మీదికి దిగిరావడం. తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేసి గంగను భూమిపైకి తెస్తాడు.

యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిగిగ రాకపోవడం తో యాగ పరిసమాప్తి కాక మధనపడుతున్న సగరుని తో అసమంజసుని మనవడు ఆంశుమంతుని కొడుకు సగర కుల్భవుడు అయిన భగీరధుడు తన ప్ర పితామహుని అనుమతి, ఆదేశాల మేరకు యాగాశ్వమును వెతుకుతూ పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షి కి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును గైకొని, అక్కడ పడివున్న బూడిద కుప్పలు తన పితామహులవని మరియు మహర్షి కోపాని బలియైనందున వారికి వారికి ఉత్తమగతులు కలుగక ప్రేతములై అకలి దప్పుల చే పీడింపబడుచున్నారని తెలుసుకున్న వాడై తన పూర్వీకులకు ఉత్తమగతులు లభించాలంటే దివిజలోకం లో ఉండే సూరగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుత్తరని కపిల మహర్షి ద్వారా తెలుసున్న వాడై తన పితామహులకు జల తర్పణలు విడిచి యగాశ్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించెను.

కానీ భగీరధుడు కి తన పూర్వీకులు ఉత్తమగతులు కలుగలేదని చింతించుచూ,రాజ్య పరిపాలన భాద్యతలను తన వంశజులకు అప్పగించి తాను సురగంగను భువి పైకి తెచ్చుటకు గాను 10000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విరించి భధీరదునికి ప్రత్యక్ష్యమై ఏ వరము కావలెనో కోరుకొనమనగా భగీరధుడు చతుర్ముఖను ప్రణమిల్లి తన పితామహులకు ఉత్తమగతులను కల్పించుటకు గాను అమరలోకవాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించడం ద్వారా పాతాళలోకంలో వున్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరగలరని ప్రార్థన చేయగా అందులకు సృష్టికర్త గంగ భువికేగే వరమునొసగెను అందులకు సంతోషించిన భగీరధుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై తాను వాణీవిభుని సూచన మేరకు తను ఇలకేతెంచుటకు సిద్దమేనని కానీ తను ఆకాశం నుండి క్రిందకి దూకితే ఆ ఉదృతి భూమి రెండుగా బ్రద్దలవునని చెప్పి తనను భరించగలిగే నాధుడెవరని చిరునవ్వు నవ్వి అదృశ్యురాలయ్యెను.

అంతట భగీరధుడు మరలా బ్రహ్మ గురించి 10000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సు కు మెచ్చిన విధాత పునఃదర్శనమొసగి ఏమి వరము కావలెనో అదడిగెను అంతట భగీరధుడు సురగంగను భరించగలిగే నాధుడెవరని ప్రశ్నించగా అందులకు విధాత ఈ పదునాలుగు భువనభాండమ్ములలో సురగంగను వహించగలిగే వాడు ఆమె అహమును అదుపుచేయగలిగిన వాడు ముక్కంటి ఒక్కడే నని సమాధానమిచ్చి అదృశ్యుడాయెను.

అంతట భగీరధుడు పట్టువిడవక మరింత ఇనుమడించిన దీక్షతో మరియెక 10000 సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు భగీరధుని తపస్సుకు మెచ్చినవాడై మహేశ్వరుడు దర్శనమొసగి వరమడుగమనగా భగీరధుడు సురగంగను వహించమని ప్రార్థన చేయగా అతని ప్రార్థనను మన్నించిన వాడైన చంద్రశేఖరుడు హిమత్ పర్వతాగ్రమున నిలచి తన ముడివైచి వున్న తన జటాజుటమును విదల్చి, ఓరకంట దివి నుండి భువిని బ్రద్దలుచేయగలనన్న అహముతొ వున్న గంగను చూచి చిరుమందహాసం చేసి తన నడుముపై చేతులను వుంచి నిలచిన శంకరుని పరిహాస దృష్టి తో చూచినదై ఉత్తుంగ తరంగాలతో, వడితిరుగుతున్న సుడులతో, మహోగ్రధృతి తో తనలోని మకరాలు, మీనాలు, కూర్మాలతో జలచరములన్నింటి తో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కాలన్న తన తిక్కతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగం తో శివుని పైకి ఉరికింది గంగ అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించివేసినాడు గంగ ఆకాశం నుండి పడుతునే ఉంది శివుని జటలో తిరుగుతూనే వుంది వేల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క చుక్క గంగాజలమైనా ధరిత్రి పై చిందలేదు అప్పుడు కానీ అర్ధమవలేదు గంగకు తాను ఎంత అన్నది సదాశివుడు ఎవరన్నది అంతట సిగ్గుతో గంగ శశిధరుని శిరస్సుపై బందీఅయిపోయినది.

తన ఇంతటి పరిశ్రమ చేసినాకూడా సురగంగ భువిని చేరకుండా జటాధరుని జటలలో బందీఅవడాన్ని చూచిన భగీరధుడు కడు చింతించి గంగను విడుచి,కరుణించమని కపర్దిని ప్రార్థించగా భక్తవరదుడైన భవుడు గంగను ఒక సన్ననిపాయ గా తన జటాజుటము నుండి విడువగా ధరిత్రి చేరిన గంగను చూచి సంతోషించిన వాడై భగీరధుడు గంగను పెక్కువిధముల స్తుతించెను అంతట గంగామాత భగీరధునితో నీ వెంట వచ్చుటకు ఒక షరుతును అని చెప్పెను అంతట భగీరధుడు తల్లి ఆషరుతేమిటొ ఆదేశించమనగా గంగామాత తాను నీ వెంట నేను వచ్చునపుడు నీవు వెనుతిరిగి చూడరాదు అన్న షరుతు విధించెను.

అతంట మహదానందముతో భగీరధుడు ముందుకు సాగనారంభించెను అతని మకరహాహిని అయిన అనుసరించుచూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తనవేగాన్ని, పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరధుని వెంట సాగెను. ఈక్రమంలో తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమమును చూచినదైననూ కూడా ఉత్తుంగ తరంగాలతో మహర్షి ఆశ్రమమును నందు ప్రవేశించినదై ఆశ్రమమును తనలోనికి తీసుకొనెను ధ్యానసమాధి యందున్న జహ్నుమహర్షి ఇది గమనించిన కుపితుడై తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానది ని తన యోగశక్తి చే త్రాగివేచెను.

ఒక్కసారిగా తనను ఆనుసరిస్తున్న జలధారల గలగల సవ్వడులు వినపడకపోయోసరికి వెనుతిరిగి చూచిన భగీరధుడు నిశ్చేష్టుడై పరికించి చూడగా జహ్నుమహర్షిని చూచిన వాడై మహర్షి ద్వారా జరిగినదానిని తెలుసుకున్న వాడై గంగను విడువమని మహర్షిని పర్పరి విధముల స్తుతించగా శాంతమునొందిన మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టెను తిరిగి మరలా భువి చేరినదైన గంగ భగీరధుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat