1. తప్పులెన్నువారు తండోప తండంబు:
తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము - ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల
నుంచి పెద్ద పిల్లలవరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది ఇతరుల
తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో వున్న ప్రజలందరు సులభంగా
చేసే తప్పులను మాత్రం తమకుతాము గ్రహించలేరు.
2. పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు:
పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయు
పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము - పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని
మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని
మొదలుపెడితే... సాధ్యం కాకపోయినప్పటికీ చివరివరకు పట్టుదలతో దానిని
పూర్తిచేయాలి. పట్టుదలను వదలడం కంటే.. ప్రాణాలను వదలడం మేలు.
3. చంపదగిన యట్టి శత్రువు తనచేత :
చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం
వచ్చినప్పుడు.. అతనిని ఎటువంటి కీడు చేయకూడదు. అవసరమైతే తగినంత మేలు,
మంచిమాటలు, గౌరవమర్యాదలు చేసి పొమ్మనడమే ఎంతో మేలు. (మనిషిలో మార్పును
రాబట్టడానికే వేమనగారు ఈ పద్యాన్ని రచించారు) .
4. చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ:
చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ !
తాత్పర్యము - చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో
నలుసు పడటం, కాలిలోకి ముల్లు గుచ్చుకోవడం వంటి బాధలు ఎంత బాధాకరంగా
అనిపిస్తాయో.. అదేవిధంగా ఇళ్లల్లో నిత్యంగ తగువు ఏర్పడం వల్ల కలిగే బాధ
చెప్పలేనిది కాదు.
5. చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె:
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీటబడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ !
తాత్పర్యము - ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా
మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి
వుంటే.. ఏ కార్యంలోనైనా తప్పకుండా లాభం కలుగుతుంది.
6. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న :
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటికాదె
భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ !
తాత్పర్యము - కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు
కలిగి వుంటాయి. ఎలా అంటే.. కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము వంటి
పదాలు పలకడానికి వేరేవిగా వున్నా.. వాటి అర్థాలు మాత్రం ఒక్కటే! అదేవిధంగా
మన సంస్కృతిలో భాషలు ఎన్ని వున్నప్పటికీ వారందరికీ పరతత్త్వం మాత్రం
ఒక్కటే!
7. ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన:
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - ఎలుకతోలును ఎన్నిసార్లు ఉతికి, కడిగినా దానికున్న
సహజసిద్ధమయిన నలుపు రంగే వుంటుందే తప్ప.. తెలుపు రంగుగా మారదు. అదేవిధంగా
చెక్కబొమ్మను తెచ్చుకుని ఎన్నిసార్లు కొట్టినా అది మాట్లాడదు, చలించదు.
(ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సహజసిద్ధంగా వున్న వస్తువులను,
విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాటిని మార్చలేము).
8. చిక్కియున్న వేళ సింహంబునైనను:
చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - అడవికి మృగరాజు అయిన సింహం కూడా చిక్కిపోయి
వున్నపుడు.. వీధిన పోయే బక్క కుక్క ఆ సంహాన్ని బాధపెట్టడం మొదలుపెడుతుంది.
అదేవిధంగా తగిన బలం లేనప్పుడు పౌరుషాన్ని కూడా ప్రదర్శించరాదు.
9. గంగిగోవు పాలు గరిటడైనను చాలు:
గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యం - కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
10. ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు:
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - విరిగిన ఇనుమును రెండు లేదా మూడుసార్లవరకు
అతికించవచ్చు. కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే (ఏదైనా చెడువార్త వల్లగానీ,
విషయం జరగడం వల్లగానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినప్పుడు) మాత్రం..
దానిని మళ్లీ అతికించడానికి ఆ బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు.
11. అనువుగాని చోట నధికుల మనరాదు:
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమయిన నదియు గొదువరాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది
చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని
చెప్పుకోకూడదు. అలా చేయడం వల్ల ఏ నష్టం కలగదు. అటువంటి చోట్లలో తగ్గి
వుండటమే మంచిది.
12. ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు:
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యము - ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి.
కానీ వాటి రుచులు మాత్రం వేరువేరుగా వుంటాయి. అలాగే పురుషులలో
పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
13. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను:
అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ !
తాత్పర్యము - విశ్వానికి నీతిని బోధించే ఓ వేమనా... కంచు వస్తువు
మ్రోగినట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా..! అలాగే నీచుడు ఎంత
ప్రయత్నించినా.. మంచివానిలా మాట్లాడలేడు.. వ్యవహరించలేడు.. ప్రవర్తించలేడు.
14. తనగుణము తనకు నుండగ:
తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరును గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బలిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా...
తాత్పర్యము - మంచివో, చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల
గుణాలను ఎంచుట, తనను తాను గమనించక తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా
చేయువాడు వ్యర్థుడు.
15. కపటి వేషమూని కడగండ్లు పడనేల:
కపటి వేషమూని కడగండ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ
తాత్పర్యము - కపట వేషాలు వేసి కష్టాలు పడటం, అడవులకు వెళ్ళి విసుగు
పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తి ని పొందటానికి ఎన్నో
సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా ముక్తిని కూడా పొందవచ్చని
దీని భావం.
16. మంటికుండవంటి మాయ శరీరంబు:
మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమా..
తాత్పర్యము - మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా
నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. దానికి అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని
దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది.
అందుకు అశాశ్వతమైన దేహం పై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు.
17. మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు :
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - మనిషి ఎన్ని మాటలైనా చెప్పగలడు కానీ, తాను చెప్పినట్లు
నడుచుకోలేదు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో
ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడు కదా అని దీని అర్థం.
18. నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు:
నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బయట మూరెడైన బారలేదు
నెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - నీటిమీద చాలా చక్కగా పోగల ఓడ నేల మీది కొస్తే కొంచెం
కూడా ముందుకు కదలలేదు. అలాగే ఎంత నేర్పుగలవాడైనా తనకు అనుకూలమైన స్థానం
దొరకనప్పుడు ఎందుకూ పనికిరాడు.
19. గంగ పాఱు నెపుడు కదలని గతితోడ:
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోత తోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - గంగా నది గొప్పదైనది . అంత గొప్పనది శద్దము చేయక ఒకే
రీతిలో ప్రవహించును . కానీ చిన్న దైన మురికి కాలువ రోదతో పాఱును . గొప్ప
వారికి అల్పులకు ఈ రకమైన భేదము కలదు సుమా ?
20. అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను:
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము - ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే
ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే
చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
21. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు :
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పు లేనివాడే యధిక సంపన్నుడు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - కూరలో ఉప్పు లేకపోవుట రుచికి లోపము . పప్పులేని తిండి ప్రయోజము లేనిది . అప్పులేని వాడే భాగ్యవంతుడు
22. ఎద్దుకైన యేడాది దెల్పిన :
ఎద్దుకైన యేడాది దెల్పిన
మాట తెలిసి నడచు మర్మ మెఱిఁగి
ముప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకు నైన
విశ్వధాభిరామ వినురమేమ .
తాత్పర్యము - ఒక సంవత్సరము పాటు భోధించిన యెడల యెద్దయినా సంగతి
సందర్భములు తెలిసికొనఁ గలదు. కాని మూఢుడు ఎన్ని సంవత్సరాలు గడిచినను
తెలిసికొనఁ జాలడు.
23. కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి :
కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - కొండముచ్చులన్నియు కలిసి ఒక కోతికి కొత్త గుడ్డలు
కట్టి తమ రాజును జేసి సేవించినట్లుగా, నీతి నియమాలు లేని వానిని తమ
నాయకునిగా చేసికొని నీచులు సేవించుందురు. అంటే బుద్దిలేని వాని దగ్గరకు
వాని స్వభామము కలవారే చేరుకొందురని భావము.
24. మాటలాడు నొకటి మనసులోన నొకటి:
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్లు ముక్తి యీలగు తానుండ
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - తాను పైకి మాటలాడున దొకటి . మనస్సులో నున్నదింకొకటి. .
తన గుణమొకటి, , యోచన వేరొకటి . ఇట్టి వారికి మోక్షము ఎట్లా కలుగును. .
అందుకే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడ
వలెను. అలాగే ప్రార్థించే టప్పుడు మనస్సులో మరో ఆలోచన పెట్టుకొని
ప్రార్థించ కూడదు. . మనం ఏది కోరుకోవాలను కున్నామో అదే ఆలోచనతో ఉండాలి.
25. ఆత్మశుద్ధి లేని యాచారము యేల :
ఆత్మశుద్ధి లేని యాచారము యేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజలేల రా ?
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నిర్మలమైన మనస్సులేని వట్టి ఆచారమెందుకు ? కుండ
పరిశుభ్రముగా వుండని వంట యెందుకు ? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు,
ఇవన్నీ చేసినా వ్యర్థమే కదా ?
26. కానిరాని చేత గాసువీసం బిచ్చి :
కానిరాని చేత గాసువీసం బిచ్చి
వెంట తిరుగువాడు వెర్రి వాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - పినికిమాలిన తుచ్చుని చేతికి డబ్బిచ్చి వెంట తిరుగువాడు వెఱ్టి వాడు. పిల్లి కడుపులో బడిన కోడి మరల పిలిచినచో పలుకునా.
27. అంతరంగము నందు నపరాధములు చేసి:
అంతరంగము నందు నపరాధములు చేసి
మంచి వానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - చాటుమాటున నెన్నో తప్పులు చేసియు , మంచి వానివలె మనుజుఁడు నటించు గాక , ఇతరు లెఱుగనంత మాత్రమున ఈశ్వరుడు ఎఱుఁగక పోడుగదా ?
28. హీనుడెన్ని విద్యలు నేర్చినగాని:
హీనుడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీన జనుఁడెకాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నీచుడెంత చదివినను నీచుడే గానీ, గొప్ప వాడు కాజాలడు , సుంగంధ ద్రవ్యములు మోయగానే గాడిద ఏనుగు కాగలదా ?
29. హీన గుణము వాని నిలుజేర నిచ్చిన:
హీన గుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నీచుని ఇంటజేర్చినచో నెంత మంచి వానికైనను కష్టము కలుగును. ఈగ కడుపులోకి పోయినచో వికారము పెట్టదా ?
30. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుఁ:
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెలుకు రాళ్ళ తట్టెడేల
చాటుపద్య మిలను జాలదా యొక్కటి
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - తళుకు బెళుకుమని మెరిసే రాళ్ళకన్న ఒక్క మంచి జాతి నీలమణి మేలు. అటులనే వ్వర్థపద్యములన్నింటి కంటే ఒక్క చాటు పద్యమే మేలు కదా
31. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు దీయు:
నీళ్ళలో మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నీటిలో నున్నపు డేనుఁగునైనను జయింపగల మొసలి, బయట కుక్క చేత పరాభవింపబడును. ఇది స్థానమహిమయే కాని తన మహిమ కాదు గదా ?
32. చంపదగినయట్టి శ్రతువు తనచేత:
చంపదగినయట్టి శ్రతువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - చంపదగినట్టి పగవాడు చేజిక్కినప్పటికిని వానికి కీడు చేయరాదు. తగినంత మేలు చేసి పొమ్మనుటే వాని మనస్సు మార్చు మార్గము.
33. తప్పులెన్నువారు తండోపతండంబు :
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - తప్పులెంచువారు పలువురు, కాని, లోకమందుగల జనులందఱకును
తప్పుండనే యున్నది. కాని, యితరుల తప్పు లెఱుగునంత సులభముగా తమ తప్పు
గ్రహించలేరు.
34. తనకులే లేనివాడు దైవంబు దూరును :
తనకులే లేనివాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల ?
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - మనిషి యొక్క బుద్ధిని వేమన ఈ పద్యలో చాలా స్పష్టంగా
చెప్పాడు. తనకు అన్ని విధాల లేనప్పుడు దేవుని తిట్టును. అన్ని విధాలుగా
ఉన్నప్పుడు దేవున్ని మఱచును. ఇట్టి మనుష్యునకును దేవునకును సంబంధమేమిటో ?
35. తామసించి చేయఁదగదెట్టి కార్యంబు:
తామసించి చేయఁదగఁదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనె
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - కోపముతో యెట్టి పనియు చేయరాదు. తొందరించినయెడ నది
విరోధమగును. పచ్చి కాయను తెచ్చి ఓ మూల వేసినచో అది పండు కాగలదా ? అందుకే
ఆవేశంతో ఏ పని చేయరాదు.
36, ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి :
ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
వేరెపోవు వాడు వెర్రివాడు
కుక్కతోకబట్టి గోదారీగునా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - భార్య మాటలు నమ్మి అన్నదమ్ములను వదిలిపెట్టి వేరే
కాపురపు పెట్టువాడు వట్టి వెర్రివాడు. కుక్కతోకను ఆధారము చేసుకొని గోదావరి
నదిని ఈదుట సాధ్యమా ?
37. చెట్టుపాలు జనులు చేదందు రిలలోన:
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటింప నిజమయా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - ప్రజలు చెట్టు పాలు చేదుగా ఉన్నాయని అంటారు. అదే
బర్రెపాలు మాత్రం తీయగా ఉన్నాయంటారు. ఎందుకంటే వాటిని రుచిన కలిగి
ఉన్నప్పుడు అవి ఎంత వరకు ఆరోగ్యకరము ? లోకములో పదిమంది చెప్పిన మాటయే
చెల్లును గదా ?
38. విత్తముగలవాని వీపు పుండైనను:
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేదవానియింట బెండ్లయిననెగరు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - అధిక ధనం గలవాని వీపు పైన అయిన పుండు సైతము నలుగురి నోళ్ళలోబడి ప్రచారమగును. కానీ బీదవానింట పెండ్లయిన ఎవ్వరూ చెప్పుకోరు.
39. విద్యలేని వాడు విద్యాధికుల చెంత :
విద్యలేని వాడు విద్యాధికుల చెంత
నుండినంత బండితుండు కాఁడు
కొలని హంసలకడఁ గొక్కెరయున్నట్లు
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యము - హంసలతోగలసిమెలసి యున్నంత మాత్రాన కొంగ మార్పు జెందలేనట్లు, పండితులతో గూడియు మూఢుఁడు మారజాలడు.
40. అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు:
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - అనగా అనగా (అనేక మార్లు ప్రయత్నించుటచే) రాగము
వ్రుద్ధి చెందును. తినగ తినగ వేపాకు తియ్యగానుండును. కాబట్టి ప్రపంచంలో
అన్ని పనులను ప్రయత్నముచే కొనసాగుచున్నవి. ప్రయత్నము చేస్తే ఏ పని అసాధ్యం
కాదు.
41. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ:
అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగగొట్టు
అప్పబుద్ధి వా డధికుల నెఱగునా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యము - తుచ్చునకు గొప్ప సంపద కలిగినచో, పెద్దలను తిరస్కరించి తిరుగును. అలాగే తెలివి తక్కువ మూఢునకు గొప్పవాని గుణములెట్ల తెలియును.
42. తనగుణము తనకు నుండగ:
తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరును గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బలిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా...
తాత్పర్యము - మంచివో, చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల
గుణాలను ఎంచుట, తనను తాను గమనించక తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా
చేయువాడు వ్యర్థుడు.
43. కపటి వేషమూని కడగండ్లు పడనేల:
కపటి వేషమూని కడగండ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ
తాత్పర్యము - కపట వేషాలు వేసి కష్టాలు పడటం, అడవులకు వెళ్ళి విసుగు
పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తి ని పొందటానికి ఎన్నో
సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా ముక్తిని కూడా పొందవచ్చని
దీని భావం.
44. మంటికుండవంటి మాయ శరీరంబు:
మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమా..
తాత్పర్యము - మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా
నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. దానికి అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని
దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది.
అందుకు అశాశ్వతమైన దేహం పై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు.
45. ఛాయననొసగుచెట్లు సాధువు భోదట్టు:
ఛాయననొసగుచెట్లు సాధువు భోదట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వధాభిరామ వినురవేమా...
తాత్పర్యము - నీడనిచ్చే వ్రుక్షం, మంచి భోధనలు చేసే గురువుల వల్ల
అందరికి మేలు జరుగుతుంది. చెంత చేరగానే చెట్టు నీడను, గురువు జ్ణాపకాలను
ఇస్తారు. అదే చెట్టు లేకపోతే నీడ ఉండదు, గురువు లేకపోతే జ్ణానం రాదు.
కాబట్టి చెట్టును, గురువులను ఎప్పటికి మరవరాదు.
46. మంటికుండవంటి మాయ శరీరంబు:
మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమ..
తాత్పర్యము - మనిషి తన శరీరం పైనా అమితమైన ప్రేమను పెంచుకుంటాడు.
అలాంటి దేహాన్ని వేమన మట్టికుండతో పొల్చుతూ ఈ పద్యాన్ని రాశాడు. మట్టి
కుండతో సమానమైన దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశించిపోతుంది. కానీ ఆత్మ
మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ అనేది దానికది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని
దేహాలు నశించి భూమిలో కలిసి పోయినా, ఆకాశం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.
కాబట్టి అశాశ్వతమైన దేహం పై అనసరమైన ప్రేమను పెంచుకోకూడదు అని ఈ పద్యం
ద్వారా తెలియజేశాడు.
47. మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు :
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - మనిషి ఎన్ని మాటలైనా చెప్పగలడు కానీ, తాను చెప్పినట్లు
నడుచుకోలేదు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో
ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడు కదా అని దీని అర్థం.
48. నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు:
నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బయట మూరెడైన బారలేదు
నెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము - నీటిమీద చాలా చక్కగా పోగల ఓడ నేల మీది కొస్తే కొంచెం
కూడా ముందుకు కదలలేదు. అలాగే ఎంత నేర్పుగలవాడైనా తనకు అనుకూలమైన స్థానం
దొరకనప్పుడు ఎందుకూ పనికిరాడు.
49. గంగ పాఱు నెపుడు కదలని గతితోడ:
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోత తోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - గంగా నది గొప్పదైనది . అంత గొప్పనది శద్దము చేయక ఒకే
రీతిలో ప్రవహించును . కానీ చిన్న దైన మురికి కాలువ రోదతో పాఱును . గొప్ప
వారికి అల్పులకు ఈ రకమైన భేదము కలదు సుమా ?
50. అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను:
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము - ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే
ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే
చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
51. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు :
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పు లేనివాడే యధిక సంపన్నుడు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - కూరలో ఉప్పు లేకపోవుట రుచికి లోపము . పప్పులేని తిండి ప్రయోజము లేనిది. అప్పులేని వాడే భాగ్యవంతుడు
52. ఎద్దుకైన యేడాది దెల్పిన :
ఎద్దుకైన యేడాది దెల్పిన
మాట తెలిసి నడచు మర్మ మెఱిఁగి
ముప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకు నైన
విశ్వధాభిరామ వినురమేమ .
తాత్పర్యము - ఒక సంవత్సరము పాటు భోధించిన యెడల యెద్దయినా సంగతి
సందర్భములు తెలిసికొనఁ గలదు. కాని మూఢుడు ఎన్ని సంవత్సరాలు గడిచినను
తెలిసికొనఁ జాలడు.
53. కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి :
కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - కొండముచ్చులన్నియు కలిసి ఒక కోతికి కొత్త గుడ్డలు
కట్టి తమ రాజును జేసి సేవించినట్లుగా, నీతి నియమాలు లేని వానిని తమ
నాయకునిగా చేసికొని నీచులు సేవించుందురు. అంటే బుద్దిలేని వాని దగ్గరకు
వాని స్వభామము కలవారే చేరుకొందురని భావము.
54. కానిరాని చేత గాసువీసం బిచ్చి :
కానిరాని చేత గాసువీసం బిచ్చి
వెంట తిరుగువాడు వెర్రి వాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - పినికిమాలిన తుచ్చుని చేతికి డబ్బిచ్చి వెంట తిరుగువాడు వెఱ్టి వాడు. పిల్లి కడుపులో బడిన కోడి మరల పిలిచినచో పలుకునా.
55. మాటలాడు నొకటి మనసులోన నొకటి
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్లు ముక్తి యీలగు తానుండ
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - తాను పైకి మాటలాడున దొకటి . మనస్సులో నున్నదింకొకటి. .
తన గుణమొకటి, , యోచన వేరొకటి . ఇట్టి వారికి మోక్షము ఎట్లా కలుగును. .
అందుకే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడ
వలెను. అలాగే ప్రార్థించే టప్పుడు మనస్సులో మరో ఆలోచన పెట్టుకొని
ప్రార్థించ కూడదు. . మనం ఏది కోరుకోవాలను కున్నామో అదే ఆలోచనతో ఉండాలి.
56. ఆత్మశుద్ధి లేని యాచారము యేల :
ఆత్మశుద్ధి లేని యాచారము యేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజలేల రా ?
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము -నిర్మలమైన మనస్సులేని వట్టి ఆచారమెందుకు ? కుండ
పరిశుభ్రముగా వుండని వంట యెందుకు ? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు,
ఇవన్నీ చేసినా వ్యర్థమే కదా ?
57. అంతరంగము నందు నపరాధములు చేసి:
అంతరంగము నందు నపరాధములు చేసి
మంచి వానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - చాటుమాటున నెన్నో తప్పులు చేసియు , మంచి వానివలె మనుజుఁడు నటించు గాక , ఇతరు లెఱుగనంత మాత్రమున ఈశ్వరుడు ఎఱుఁగక పోడుగదా ?
58. హీనుడెన్ని విద్యలు నేర్చినగాని:
హీనుడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీన జనుఁడెకాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నీచుడెంత చదివినను నీచుడే గానీ, గొప్ప వాడు కాజాలడు , సుంగంధ ద్రవ్యములు మోయగానే గాడిద ఏనుగు కాగలదా ?
59. హీన గుణము వాని నిలుజేర నిచ్చిన:
హీన గుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - నీచుని ఇంటజేర్చినచో నెంత మంచి వానికైనను కష్టము కలుగును. ఈగ కడుపులోకి పోయినచో వికారము పెట్టదా ?
60. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుఁ:
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుఁ
తళుకు బెలుకు రాళ్ళ తట్టెడేల
చాటుపద్య మిలను జాలదా యొక్కటి
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యము - తళుకు బెళుకుమని మెరిసే రాళ్ళకన్న ఒక్క మంచి జాతి నీలమణి మేలు. అటులనే వ్వర్థపద్యములన్నింటి కంటే ఒక్క చాటు పద్యమే మేలు కదా
61. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన :
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు వట్టిదెపుడు
యముని లెక్కరీతి అరుగుచు నుందురు
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యము - పుట్టినవాళ్ళంతా భూమ్మీదనే ఉంటానంటే కుదురుతుందా? అసలు
సరిపోతుందా అందరికీ? అందుకే యముడి ఖాతాలో రాసున్న కాలాన్నిబట్టి
చనిపోతుంటారు.
దగ్గరివారు పోయినప్పుడు దుఖపడటం సహజం. కొందరు మరీ నీరసపడిపోతారు. కానీ మన
చేతిలో లేనిదాని గురించి బాధ పడి, జీవితంలో నీరుగారిపోవటం దండుగ కదూ! ఈ
విషయం వారికి ఇలా చెప్పినంత మాత్రాన వారి దుఖం పోదు, శోకం ఆగదు. అందుకే
తార్కికంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదే మార్గం. వచ్చేవారు వస్తుంటే
పోయేవారు పోతుండాలి. అప్పుడే ఈ భూమి సరిపోతుంది కానీ వచ్చినవారు వచ్చినట్టే
ఉండిపోతానంటే ఎలా? ఇలా పోతుంటేనే జనాభా సమస్య జాతీయ సమస్యగా మారితే, అసలు
చనిపోకపోతే ఎలావుంటుంది? పుట్టిన తర్వాత కొన్ని బంధాలు ఏర్పడటం జరుగుతుంది.
అది అవసరం కూడా. లేకపోతే జీవన ప్రణాళికే ఉండదు. జీవితంలో లక్ష్యం ఉండదు.
నిస్సారమైపోతుంది. కాబట్టి బంధాలు అవసరమే కానీ అవి పురోగతికి
ప్రతిబంధాలవగూడదు. ఒక సెల్ ఫోన్ పోతేనే ఎంతో బాధ అనిపిస్తుంది కదా అలాంటిది
సజీవంగా మనముందు తిరుగాడిన ఒక సాటి మానవుడు, అందులోనూ మనతో అత్యంత
సన్నిహితంగా మెలిగినవారు, రక్త సంబంధీకులు పోయినప్పుడు విచారం కలుగటం
స్వాభావికం. కానీ ఆ భావన మన జీవనయానంలో అడ్డు పడగూడదు!
62. ఆత్మ శుద్దిలేని యాచార మదియేల :
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
తాత్పర్యము - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం
ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే
శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)