🔰 *దేవాంగ పురాణము* 🔰 13వ భాగం

P Madhav Kumar


 *13.భాగం* 

సూతుడు తరువాతను దేవలుడు ఆమూల్యము లయిన దివ్యవస్త్రములను

బట్టుకొని వెంటనే పరమేశ్వరుని జూచుటకై కైలాసమునకు బోయెను. వర్ణనాతీతమయిన యాకైలాసపర్వతమును జూచి చాలసంతోషించి క్రమముగా

బంగారు ప్రాకారములు గలదియు, రత్నములతో గట్టబడినగోపురములుగలదియు,ఆకాశమునంటుచు జంద్రకాంతమణినిర్మిత మయిన మేడలుగలదియు, ధూపాదుల పరిమళముతో నిండియున్నదియు, కస్తూరిపూతలుగలదియు, సూర్యచంద్రాదుల

కాంతుల దిరస్కరించు కాంతులుగలదియు, నగునాశంకరుని దివ్యభవనమును

జూచెను. ఆ మందిరములోనున్న దేవాలయములో నదివఱకే యష్టదిక్పతులు,

ద్వాదశాదిత్యులు, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, సిద్ధులు, చారణులు,గంధర్వులు, విద్యాధరులు, ఉరగులు, కిన్నరులు, గరుడులు, యక్షులు,సనకాదిమునులు, సాధ్యులు, కింపురుషులు, అప్సరస్సంఘములు, కశ్యపుడు, అత్రి,భరద్వాజుడు, జాబాలి, జమదగ్ని, వసిష్ఠుడు, శుకుడు, హారీతుడు, వామదేవుడు,పరాశరుడు, కణ్వ కుత్స శతానందులు, శైబ్యగౌతమశక్తులు శాండిల్యుడు,చ్యవనుడు, ఉద్దాలకుడు, భృగువు, అగస్త్యుడు, పులస్త్యుడు, పులహుడు,మార్కిండేయుడు, ఔర్వుడు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు మొదలగువారిచే

సేవింపబడుచు పార్వతితో గూడ రత్నసింహాసనముపై గూర్చుండి నిండుకొలువున్న

వెండి కొండదొరను శంకరుని చూచెను. కుమారస్వామియు, విఘ్నేశ్వరుడు,వీరభద్రుడు, అనేకులు ప్రమధులు, నేత్రహస్తుడై నంది యాసభలోనుండి

శంకరునియాజ్ఞను బరిపాలించుచుండిరి. ఇటువంటి శంకరభగవానునిజూచి

దేవాంగుడగు దేవలుడు హర్షపులకాంచిత

శరీరుడై సాష్టాంగ

నమస్కారము చేసి

యనేకవిధములుగా స్తుతిచేయ మొదలిడెను. దేవలుడు భక్తిపారవశ్యముచే

ననేకవిధములుగా స్తుతిచేసియిట్లనెయె. మహాదేవా ! జగన్నాధా ! నీయనుగ్రహమున

వస్త్రములను నేసితిని. అని చెప్పి విచిత్రములైన యనేకవస్త్రములు శంకరునికి

 సమర్పించెను.ఆవస్త్రములను జూచి శివుడు చాలసంతోషించి యాదేవాంగమునిని

బ్రీతిగా నలంకరించి తరువాతను పార్వతియు దానును వస్త్రములను గట్టుకొనిరి.ఇట్లు వస్త్రములను ధరించి పార్వతీపరమేశ్వరులు మిక్కిలిని సంతోషించి మరల నాదేవలమునిని భూషించిరి. తరువాతను గణపతిదగ్గఱ కేగి యాతనికి దివ్యమయిన

వస్త్రముల నిచ్చెను. భృంగిమొదలగువారికి వారు వారు కోరిన ప్రకారము

దివ్యాంబరము లిచ్చెను. పిదప నామోదపురాధిపతియగు దేవాంగరాజు విలువగల

వస్త్రముల స్వీకరించి శంకరునియాజ్జాప్రకార మంతఃపురములోనికి బోయి

మహాదేవియగు భద్రకాళికి రక్తాంబరము నిచ్చెను. కుమారస్వామి భార్యయగు

దేవసేనకు తెల్లవస్త్రము నిచ్చెను. తరువాతను తన యిష్టదేవతయగు చౌడేశ్వరికి

దివ్యాంబరములీయనుత్సుకుడై యామెను భక్తిపూర్వకముగా స్మరించెను.

ఆయంబయు భక్తపరాధీనురాలు గావున వెంటనే యతనికి బ్రత్యక్షమయినది. ఇట్లు

ప్రత్యక్షమయిన యాదేవి ననేక విధములుగా స్తుతిచేసి చేతులు జోడించుకొని

వినయముగా నిట్లనియె. అంబా ! చౌడేశ్వరీ ! శివా ! శంకరీ ! నీయనుగ్రహమువలన

నేననేక విధములయిన వస్త్రములను సిద్ధము చేయ గలిగితిని. భక్తవత్సల వగునో

దేవీ !మూడులోకములవారికిని యధేష్టముగా వస్త్రముల నిచ్చితిని. తల్లీ ! దాసుడు

నేసినవస్త్రములను నీవు ధరింపదగినదానవు. అని యాయంబకు దివ్యమయిన

వస్త్రములిచ్చెను. ఆదేవాంగుని యందలి ప్రీతిచే జౌడేశ్వరి వస్త్రములను ధరించి దేవలుడు నోదార్చి యచ్చటనే యంతర్ధాన మయినది.మునులు - సూతా ! మేము పార్వతియే చౌడేశ్వరి యనితలంచుచున్నాము.

బుద్ధిమంతుడగుదేవలు డీశ్వరసన్నిధిలోనే యామెకు వస్త్రముల నిచ్చినవాడుగదా

మరల నేల యిప్పడిచ్చెనో ? పార్వతికిని జాడేశ్వరికిని భేదమని యిపుడు

మరలనిచ్చెనో లేక యామెయందు దనకున్నభక్తిచే నిచ్చెనో మాకుసందియము

గలుగుచున్నది గనుక నీవు యథార్ధమును జెప్పుము. అనవిని సూతు డిట్లనియె

మునులారా ! మీరన్నది నిజమే. దుర్గాచౌడేశ్వరులకు భేదమే లేదు దేవాంగుడు తనకు వరములనిచ్చెనని భక్తిచేతను మరల నామెకు వేఱుగా వస్త్రములనిచ్చెను. కాని యామె వేటైన దనుబుద్ధిచే నీయలేదు. శంకరునికి భార్యగనుక శంకరియనిపించుకొన్నది. పార్వతియే చౌడేశ్వరి. చౌడేశ్వరియే పార్వతి. యథార్థ మాలోచింపగా

వారియిద్దఱకును భేదమేలేదు. తరువాత నాదేవాంగుడా పర్వతమునందున్న

కన్నియలకందఱకును యధేష్టముగా వస్త్రముల నిచ్చెను. మఱియు శివునిద్వార పాలకులగు చండప్రచండులకు రక్తాంబరమును శ్వేతాంబరమునునిచ్చి శివుని

ధ్యానించి యాయనయనుమతిపై నిగొలువుకూటమునం బ్రవేశించెను. అప్పుడచ్చట గృతస్థల, ఉర్వశి, రంభ, మేనక, పుంజికస్థల, తిలోత్తమ మొదలయిన యప్సరసలు నాట్యముచేయుచుండిరి. వాండ్రు నాట్యముచేతను. అంగవిక్షేపములచేతను, భావబోధకములయిన పాటలచేతను, అభినయాదులచేతను శివుని

సంతోషపచిరి. శివుడు వాండ్ర విషయమై ప్రసన్నుడయి దివ్యాంబరము లీయదలచి

దేవలుని మొగము వైపు చూడగానే యతడాయన యభిప్రాయమును దెలిసికొని


దివ్యములయిన వస్త్రముల నంతలోనే సిద్ధముచేసియిచ్చెను. అట్టియద్భుత మైన

పనిచూచి యింద్రాదులగు దేవతలందఱలును మిక్కలి యాశ్చర్యమును బొందిరి.

మహాదేవు డావస్త్రములనుదీసి యింద్రాది దేవతలకును, ఋషులకును, గంధర్వులకును సిద్ధులకును నిచ్చి తరువాత నాసభలోనున్న సర్వాప్సరసలకును నిచ్చి

సంతోష పెట్టెను. తరువాతను శివభగవానుడు సుచంద్రకమను ఖడ్గమును

వృషభధ్వజమును దేవలునికీయగా భక్తిచే బరిగ్రహించిన యతనితో నిట్లనియె దేవాంగా ! సర్వశత్రువులను సంహరింపగల యీధ్వజముచే ముల్లోకములయందును జయమును బొందుము. మఱియు నెల్లప్పుడు సుఖివై యుండుము. అప్పుడు

దేవాంగముని స్వామిపలుకును శిరసావహించెను. తరువాతను శంకరుడు సూర్యునిజూచి యిట్లనియె. సూర్యుడా ! నీతో బుట్టువు దేవదత్తయను కన్య నీదేవాంగ రాజున కిమ్మనగా సూర్యుడు సంతోషించి దేవా ! మాకును నట్లే కోరికయున్నది.

ఆమెను దగినవరు డీతడేయని మేమును నిర్ణయించుకొంటిమి. తమదయవలన

మాకోరిన కోరిక పూర్తియగును. అని యిట్లు సూర్యుడు చెప్పగానే యాసభలోని

వారందఱును సాధు ! సాధు ! అని యుగ్గడించిరి. తర్వాతను పార్వతియునట్లే చేయుమని సూర్యున కాజ్ఞాపించినది. సూర్యుడునట్లేయనెను. తనమాట నెరవేణి చినందులకు శివుడును సంతోషించెను. ఇంద్రాది దేవతలును సంతోషించిరి.

ఇట్లు శివుడు రాక్షసులకుదక్క దక్కినవారికెల్లరకును వస్త్రములిచ్చి సభచాలించి

పార్వతితో గూడ నంతఃపురములోనికిబోయెను. తరువాత శివుని సేవింప వచ్చిన యీంద్రాదులందఱుకు దమతమయిండ్లకుబోయిరి. దేవాంగుడును దనయామోద

పట్టణమువైపుబయలుదేజెను.


 *సశేషం.......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat