🔰 *శ్రీ గణేశ పురాణం*🔰 19 వ భాగం

P Madhav Kumar


 *19.భాగం* 


*ఉపాసనా ఖండము*

*మొదటి భాగము*

*కమలాపుత్ర వర్ణనం*


అప్పుడు బృగు మహర్షి ఆ తరువాత కథాక్రమాన్ని సోమ కాంతుడితో ఇలా కొనసాగించాడు ఓ రాజా బ్రహ్మ వద్ద నుండి పై కథా వృత్తాంతాన్ని అంతా విన్న వ్యాసుడు ఇంకా ఇలా పరి ప్రశ్న చేశాడు ఓ సృష్టికర్త పరమ శుభదాయకములు మంగళప్రదములు అయిన గణేశ భగవానుని లీలలను మహత్యమును ఎంత విన్నా తనివి తీరడం లేదు. పాప హరము సకల అభీష్ట ప్రధము అయిన గణేశుని గాధను ఇంకా వినగోరుతున్నాను అన్న కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసమునేంద్రునితో బ్రహ్మ ఇలా అన్నాడు...



ఓ వ్యాస మునీంద్ర దేవతలందరి పూజలను ప్రథముడిగా అందుకునే పరమ శుభకరములైన వరద వినాయకుడి లీలా విశేషాలను మీ అభీష్టం మేరకు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించు పూర్వం విదర్భదేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు అనేక మంది రాజులను తన శౌర్య పరాక్రమముల చేత వశం చేసుకొని వారిని సామంతులుగా చేసి వారు చెల్లించే కప్పం స్వీకరిస్తూ కౌండిన్యమనే పేరు గల నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు ఆ రాజుకు బ్రహ్మాండమైన సైన్యం సర్వసన్నద్ధమై ఉండేది...



దానధర్మముల యందు వితరణ కలిగి అడిగినవారికి లేదనకుండా ఇచ్చే ఆయనను ఆశ్రయించి అనేకమంది వేద పండితులైన బ్రాహ్మణులు జీవించేవారు ఆ రాజుకు చారుహాసిని అన్న పేరు గల సకల సౌందర్య సద్గుణ శోభితురాలు మహా పతివ్రత అయిన భార్య ఉండేది ఏ లోటు లేకుండా సకల సంపదలు అనుభవిస్తున్న ఆ రాజ దంపతులకు రాజ్య భోగాలు ఎన్ని అనుభవిస్తున్న సంతానయోగం మాత్రం కలుగలేదు ఆ రాజు పుత్ర సంతానాన్ని కోరి అనేక పూజలు వ్రతాలు దానధర్మాలు ఆచరించిన ఏమాత్రం ఫలితం లేకపోయింది....



ఎంత కాలం నిరీక్షించిన తమకు సంతానం కలిగే సూచనలేమి కనిపించక దిగులుతో కృషించసాగాడు చివరికి తన మంత్రులైన మనోరంజనుడు సుమంతులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులను తీసుకొని స్వస్తి పుణ్యాహవాచనాపూర్వకంగా అనేక దానధర్మాలు నిర్వర్తించి అరణ్యాలకు బయలుదేరాడు ఒక క్రోసు దూరం వరకు సకల పరివారమును తన వెంట రానిచ్చి ఆ తర్వాత వారిని వీడుకొని పత్నీసహితుడై అరణ్యం లోకి వెళ్లిపోయాడు అలా చాలా దూరం నడిచాక అక్కడ ఒక చోట పెద్ద సరోవరాన్ని చూశాడు రమణీయంగా ఉన్న ఆ ప్రకృతి సోయగం ఎంతో నయనానందకరంగా ఆహ్లాద జనకంగా ఉండటము ఆ సరస్సుకు సమీపంలోనే ఒక రుషి యొక్క ఆశ్రమం ఉండటాన్ని చూచాడు...



రాజు ఆశ్రమంలోనికి ప్రవేశించి దర్భాసనం పై ఆసీనుడై శిష్య గణములు వేదాధ్యయనం చేస్తుండగా దివ్య తేజస్సుతో వెలగొందుతున్న విశ్వామిత్ర మహర్షిని దర్శించాడు భయవినాయలతో ఆ మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారము ఆచరించి ఆ దంపతులు ఎదుట నిలిచారు ఆ మహర్షి భూత భవిష్యత్ వర్తమానమును అన్నీ తెలిసిన త్రికాలజ్ఞుడు సర్వజ్ఞుడై ఉన్నప్పటికీ ఏమీ తెలియని వాణి లాగా ఆ రాజునిలా ఆశీర్వదించాడు శుభమస్తు సద్గుణ సంపన్నుడైన సత్పుత్రుడు నీకు చిరకాలంలో కలుగ గలడు నీవెవరో నీ యొక్క వివరాలను నాకు తెలియజేయి నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు నీ నివాసం ఎక్కడ ఎందుకని ఇలా అరణ్యంలో సంచరిస్తున్నావు ఈ వివరాలు ముందు నాకు చెప్పు.....



నీ బాధ నివారణకు పాప నాశనమునకు మార్గం తెలుపుతాను అంటూ మందహాసం చేశాడు అప్పుడు భీముడు అనే ఆ రాజు తన యావత్ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు ఓ మునివర్యా విదర్భదేశంలోని కౌండిన్య నగరానికి ప్రభువునై పరిపాలిస్తున్న నా పేరు భీముడు ఈ మన భార్య చారుహాసిని పుత్ర సంతానం నిమిత్తం ఎన్ని పూజలు వ్రతాలు చేసిన ఆమె కడుపు పండలేదు పూర్వజన్మలో ఏమి పాపం చేసినందు వల్లనో మా ఇంట పాపాయి పారాడలేదు ఆ చింత మమ్మల్ని ఎంతగానో కృంగదీసింది అందుకని విరక్తులమై రాజ్యాన్ని వీడే అరణ్యాలలో తిరుగుతూ మీ ఆశ్రమానికి రావడం జరిగింది...



మహిమాన్వితమైన మహాత్ముల దర్శనం అనంతపలప్రదము సద్యఃఫలాన్నిచ్చేదీను తమ అమోగా ఆశీస్సులు తప్పక ఫలిస్తాయి అయినా నా పూర్వజన్మ దుష్కర్మ ఎలాంటిది? దానికి పరిహార త్రికాల దర్శి కూడా మేమేటి కృపాసిందువైనా తమరు సర్వజ్ఞులే కాదు నాయందు దయవుంచి ఆ వివరాలు ప్రాయశ్చిత్త విధానము తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయండి అంటూ ప్రాధేయపడ్డాడు ఓ వ్యాసము ఏందిరా ఆ మాటలకు విశ్వామిత్రుడిచ్చిన ప్రతి వచనం ఏమిటో శ్రద్ధగా ఆలకించు అంటూ చతుర్ముఖుడు భీముడు అనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పినది యావత్తు వ్యాస మునీంద్రునికి ఇలా వివరించసాగాడు....



*భీముడనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించడం*



విశ్వామిత్రుడిలా చెప్పసాగాడు ఓ రాజా నీవు పూర్వజన్మలో ధన గర్వం ఐశ్వర్య మదం చేత తరతరాలుగా మీ వంశంలో కులదేవతగా అర్చించబడుతున్న ఆ గజాననుడి పూజను గర్జించి నీ కుల ధర్మమును విడిచి వేశావు మీ పెద్దలు మాత్రం సదాచారులై వేద శాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మములన్ని చక్కగా తెలుసుకొని అనుష్టించిన వారే వారు శ్రద్ధ భక్తులతో ఆ గజాననున్ని నిత్యం ఆరాధించేవారు అటువంటి వంశపారంపర్యమైన సాంప్రదాయాన్ని వీడటం వల్లనే నీవు ఈ జన్మలో సంతానహీనుడవైనావు.....



ఇంకో ముఖ్య విషయం కూడా చెబుతాను విను నీకు ఏడూ తరాలకు ముందు మీ వంశంలో వలభుడనే పేరు గలవాడు రాజుగా ఉండేవాడు అతడు సౌందర్యొపేతుడు సద్గుణవంతుడు ధనవంతుడైన అతనికి చాలా కాలానికి ఒక శిశువు జన్మించాడు ఆ పిల్లవాడికి పుట్టు గ్రుడ్డి మూగ చెవిటి అయి శరీరం అంతా వ్రాణాలతోనూ దుర్గంధ భూయిష్టమై ఉండేది. మరుగుజ్జులా ఉన్న ఆ వికృత శిశువును చూసి అతని తల్లి అయినా కమల యొక్క దుఃఖానికి అంతే లేకుండా పోయింది ఇటువంటి సకల దోష యూతుడైన తనయుడు ఉండటం కన్నా నిస్సంతుగా ఉండటమే శ్రేష్టం ఈ వికృతుడైనట్టి పిల్లవాని వల్ల సంతాపమే కానీ సంతోషం ఎక్కడిది?...



ఇక ఇటువంటి వికృత రూపుడైన శిశువును లోకులకెలా చూపించగలను దైవమా నాకు ఇతడికి చావైనా రావటం లేదే అంటూ గుండెలు అవిసిపోయేలా ఏడవ సాగింది ఆ రోదనను విని సూతిక గృహం వద్దకు పరుగెత్తి వచ్చిన ఆమె భర్త అయినా మహారాజు ఆమెను ఇలా ఓదార్చేసాగాడు ఓ దేవి నీవు ఇలా దుఃఖింపవద్దు కష్టములైన సుఖాలైన కర్మను అనుసరించే సంప్రాప్తిస్తాయి మనిషి యొక్క భవిష్యత్తు అంతా వాడు గతంలో సమపర్జించుకున్న సుకృత దుష్క్రుతాలను అనుసరించే ఉంటుంది కనుక ఓ ప్రియా నీవు ఈ పిల్లవాడి గురించి దుఃఖించవద్దు....



వీడే దుష్కర్మ అనుభవించడం పూర్తవగానే వీడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడు దుష్కర్మ నివారణకై చేయవలసిన దేవతా పూజలు తీర్థయాత్రలు చేయవలసిన మంత్రానుష్టానము వాడవలసిన ఔషధాలను వాడి మన ప్రయత్నం మనం శక్తివంచన లేకుండా కృషి చేద్దాం కనుక ఓ దేవి ఈ శిశువుకి ప్రస్తుతం చేయవలసిన పరిచర్యలన్నీ చేయి ఇలా భర్త చేత సముదాయించబడిన ఆ రాణి దుఃఖాన్ని అనుచుకొని ఇష్టసకులతో కూడి ఆ బాలుడికి స్నానాధికాలు చేయించి శుభ్రపరిచింది ఆ రాజు కూడా శిశువు పుట్టినప్పుడు చేయవలసిన జాతకర్మను నిర్వర్తించి బ్రాహ్మణులందరికీ పూరి దానధర్మాలను ఇచ్చి పూజించి ఆ భూసురుల ఆశీస్సులను పొందాడు...



ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని 'కమలాపుత్ర వర్ణనం' అనే  అధ్యాయం సంపూర్ణం...


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat