*6.భాగం*
బ్రహ్మ - తరువాతను వస్త్రనిర్మాణ విశారదుడగు దేవలుడు మంత్రులను
బిలచియిట్లనియె మంత్రులారా ! నేను శీఘ్రముగా వస్త్రములు నేయవలసియున్నది.
కావున నేతసామానులు సిద్ధముచేయదగియున్నది. నేనిపుడు మేరుపర్వతమునకు
బోయి వచ్చెదను. అచ్చటను ద్వష్టకుమారుడు మయుడున్నాడు. అతనియొద్దకు
బోయి నేతకుపయోగించు సామగ్రిదీసికొనివచ్చెదను. అను దేవలునిమాటలువిని
మంత్రు లిట్లనిరి. మహారాజా ! నీవొక్కరుడవును నచ్చటికి వెళ్ళవలదు. మేము గూడ
జతురంగ బలముతో వచ్చెదము. ఈ విషయమై యేయభ్యంతరమును జేయదగదు.అను మంత్రుల మాటలు విని దేవలుడిట్లనియె. మంత్రులారా ! మీరట్లు చెప్పకుడు నేను జెప్పునది. వినుడు. నీతిగా మీరీరాజ్యమును బాలించుచునుండుడు.
మీరుగూడ నాతో వచ్చినయెడల నిక్కడ బాలించువారెవరు ? కావున మీరాక నాకిష్టములేదు. అమయమహాప్రభుదగ్గఱనుండి నేతసామగ్రిదీసికొని వేగమ
వచ్చెదను. అని చెప్పి సపరివారముగా మంత్రులను మరలించి తానొక్కరుడే
పోవనుద్యుక్తుడాయెను. ధనుర్బాణములు పట్టుకొని యామేరుపర్వతమునకు
బోయెను. పోవుచు నతడు దారిలో గార్య మహాముని యాశ్రమమును జూచెను.
నిర్మలజ్ఞానవంతుడును, మునిశ్రేష్ఠుడునునగు గార్యుని దర్శనమునకై యాశ్రమము
లోనికి బోయెను. అతడును దేవలునిరాక విని యెదుర్కొని పూజించి యిట్లనియె.
గార్డ్యు - మహాభాగా ! నీకు స్వాగతము దేవలా ! నీవు గుశలమేకదా !నీరాజ్యములో సుభిక్షముగదా ! నీప్రజలందఱును క్షేమముగా నున్నారా ? అనునతని
మాటలు విని దేవలు డిట్లనియె. తపోధనా ! మీయనుగ్రహమువలన మేమందఱమును క్షేమముగానే యున్నారము. మారాజ్యమునంతటను సుభిక్షమే. అని చెప్పగానే
గార్యుడు చాల సంతోషించెను. దేవలునిచేగూడ గుశలాదు లడుగబడి యధాన్యాయ
ముగ జెప్పెను. తరువాత నెచ్చటికి వెళ్లుచున్నాననియు నిచ్చటికీ రాక గారణమే
మనియు నడుగగా సంగతియంతయు జెప్పెను. తరువాత నాగార్జ్యుదా తిథ్యమిచ్చి గౌరవించెను. దేవలు డిష్టాలాపములతో నారాత్రి యచ్చటనే కడపి మఱునాటి యుదయమున కాల్యకృత్యములు నెఱువేర్చుకొని గార్యునియొద్ద సెలవు పుచ్చుకొని
బయలుదేటి దారిలో ఆనేకములయిన దేశములను నదులను గొండలను
వనములను దుర్గమప్రదేశములను దాటి నిర్మానుష్యము సింహశార్దూల భేరుండ
ఖడ్గగోమృగసంకులము, లులాయద్విపభూయిష్టము, భల్లూకశరభాకులము వరాహగవయాకీర్ణము, చమరీ సంచార సంకులము, కురంగయూధసంబాధము
మఱియు నితరములయిన వన్యజంతువులచేనిండి నానావృక్షల తాగుల్మ పరివృతమునగు ఘోరమయిన యరణ్యమునుజూచెను. ఇట్టి మహాఘోరమును దుస్తరమునునగు
నాయడవిలోబడి పోవుచుండగా నొకసింహము దేవలునివాసనపట్టి జడలు జాడించుచు నెగిరి తోకయాడించుచు నోరుదెఱచుకొని గర్జించుచు నతనిజంపుటకై
పరుగెత్తుకొనివచ్చుచుండెను. దానిరాకను దేవలుడుచూచి పరాక్రమవంతుడు గనుక
ధనుస్సెక్కు పెట్టి యగ్నిజ్వాలలవంటి బాణములచే దానిని
మర్దించెను. మఱియు
రెండుభల్లములచే ఫాలమునగొట్టెను. దెబ్బలు లెస్సగాదగులుటచే నాసింహము వ్యాకులపడి ప్రళయకాలపు మేఘగర్జనలవలె నందఱకును భయము గలుగునట్లుగా
గర్జించినది. తరువాతను దేవలుడు మణింతకోపించి దానినోటినిండ బాణములు
పడునట్లుగా గొట్టెను. మఱియొక బాణముచే గంఠము గుణిచేసి కొట్టెను. ఆదెబ్బతో సింహము రక్తముకక్కు కొనుచు గ్రిందబడిచచ్చెను. తరువాతను దివ్యగంధమలం
దుకొని దివ్య పుష్పములమాలలు దివ్యాభరణములు ధరించి యొక మహాపురుషుడు
విమానముమీద నుండి యగపడెను. అతనినిజూచి దేవలుడాశ్చర్యపడి “పురుష
వ్యాఘ్ర ! నీవెవరు ? నీ వృత్తాంతమెట్టిది ? నీసంగతినాకు జాలనాశ్చర్యమును
గలిగించుచున్నది." కావున జెప్పుము. అనియడుగగానే యాపురుషుడు “రాజేంద్రా !
సాధు ! నీవలన బవీత్రుడనై శాపమను సముద్రమును దాటితిని. పావనా !
నీవలననేను గృతార్థుండను ధన్యుడను నయితిని. రాజోత్తమా !నావృత్తాంతమును
జెప్పెదనాలింపుము. నేను జిరకాలము నుండి దుస్తరమగు నీశాపసముద్రములో
మునిగియున్నాను. పుణ్యమూర్తివగు నీవు వచ్చినన్నొడ్డుచేర్చితివి. అని యాపురుషుడు చెప్పుచుండగా దేవలుడు మరల నిట్లనియె. పురుషశ్రేష్టా ! నీవెవరోచెప్పుము.
నామనస్సు మిక్కిలి విస్మయానిష్టముయియున్నది. వేగముగా నీ వృత్తాంతమునుజెప్పి
నా యాశ్చర్యమున దొలగింపుము. అని మాటిమాటికి నడుగుచున్న
దేవలునిమాటలు విని యక్షు డిట్లనియె.యక్షు - రాజేంద్రా ! నాకథ యంతయు జెప్పెదను వినుము. నేను గుబేరుని
యనుచరుడను. నా పేరు కపింజలుడు. నేనొకసారి వేటాడు కోరికతో బెక్కురు
యక్షులతో గూడి యొకవనములో బ్రవేశించి యనేకములగు దుష్టమృగములను
జంపుచు నాయడవిలో దిరుగుచుండగా నాదగ్గఱనుండిపోవుచు నొకలేడియగ పడినది. నన్ను జూచి భయపడి పాఱిపోమొదలిడినది. నేనును దైవ ప్రేరణచే దానివెంట బరుగిడితిని. అది యెటు పరుగు పెట్టుచున్నదో నేనును నట్లేపరుగెత్తితిని.ఎంత గురిగా గొట్టినను నాబాణముదానికి దగిలినదే కాదు. ఇట్లెంత సేపటికిని గురి
కందకపోవుటచే నాకు మిక్కిలి కోపము వచ్చినది. గొప్పబాణమును బ్రయోగించితిని.
అది దానిపృష్ఠదేశమునందు నాటినది. అయినను లేడి పాఱిపోవుచునే యున్నది.
అట్లు పరుగెత్తి తిన్నగా గౌతమాశ్రమములో బ్రవేశించినది. ఇంతలో గౌతముడచ్చటికివచ్చెను. రక్తముస్రవిం చుచుండగా భయపడి పరుగున వచ్చిన లేడిని వెంటధనుర్బాణములు చేతబట్టుకొని పరుగునవచ్చుచున్న నన్నును గౌతముడు చూచెను.
దయాళుడగు నాముని నా పై గోపించి యిట్లనెను.
గౌత-దుర్మార్గుడా ! మాయాశ్రమమృగమును జంపవచ్చితివిగా ! పాపాత్మా !
మాయాశ్రమములోనికి వచ్చియున్న యీలేడిపిల్లను జంపుటకు వెంట బరుగెత్తివచ్చి
తివంటరా ! ఓరిదురాత్మా ! యీ కారణమున ఘోరారణ్యములో సింహమవయి ఘోరముగా జంతువులను భక్షించుచు బాపము సంపాదించుకొనుచు నుండుము.అని యిట్లు ముని శపింపగానే నేను మిక్కిలి భయపడి యతనిని "మునీంద్రా !
నాయపరాధమును మన్నించి శాపాంతమును దయచేసిచెప్పు” మని యనేకవిధములుగా బ్రార్థింపగా “శివుని మానసపుత్రుడగు దేవలుడు దేవాంగుడని పేరుపడినవాడు
సకలలోకములకును మానమును గాపాడువాడు వచ్చి నీశాపమును దొలగించును.అంతవరకును నీవరణ్యములోనుండుము. అని చెప్పి యాగౌతము డెందేని
బోయెను. నేను వెంటనే సింహమునయితిని. మహాత్మా ! చిరకాలమునుండి
శాపదగుడనయి యీయడవిలో బడియుండి యిపుడు నీదయవలన ముక్తకలుషుడనయి పవిత్రమయితిని. ఇది నావృత్తాంతము. ఇచ్చట కుత్తరముగా వామదేవాశ్రమము గలదు. అది మిక్కిలి మనోహరమయినది. అచ్చటికి బోయి
యామహానుభావుని జాడగలవు. అని దేవలునితో జెప్పి క్షేమముగా నుండుమని
పరమానందము నొందుచు నాయక్షడుతనయింటికి బోయెను.
*సశేషం......*