💠బీహార్ రాష్ట్రమందు మధుబని జిల్లాలో ఇండో నేపాల్ సరిహద్దు వద్ద గల మిథిలా నగరము జనక చక్రవర్తి రాజధాని.
💠 ఈ ఆలయం దాని వైభవం, ప్రాచీనత మరియు చరిత్రకు ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఈ ఆలయాన్ని జనక మహారాజు స్థాపించాడు
💠 జనక మహారాజు మహాశివభక్తుడై తీవ్ర తపమాచరించుటచే జనకుని తపస్సుకు సంతోషించిన శివుడు స్వయంగా కల్యాణేశ్వరుడుగా , గిరిజగా పార్వతి ప్రత్యక్షమై అందరికి క్షేమాన్ని అనుగ్రహించారు. అప్పుడే ఈ గ్రామంలో కల్యాణేశ్వర్ మహాదేవ్ అనే పేరుతో మహాదేవుడు స్థాపించబడ్డాడు
💠 అంత శివుని వారి కులదైవముగా అచటనే ఉండమని కోరినాడు.జనక మహారాజు కోరిక మన్నించిన పరమశివుడు , అతని భక్తికి మెచ్చి తన శివ ధనుష్ ని ఇచ్చి అనుగ్రహించాడు.
ఆ శివధనషు ని ఎక్కుపెటినవాడే తనకి అల్లుడు కాగలిగినవాడు అని, తన కూతురు కల్యాణం లోక కల్యాణం కాగలదు అని వరం ప్రసాదించాడు శివుడు.
💠 ఇక్కడ జనకుడు నగరము నలువైపుల నాలుగు శివాలయములు నిర్మించెను.
దేవశిల్పి విశ్వకర్మ ఈ ఆలయమును నిర్మించెనందురు .
💠 జనక మహారాజు మిథాలకు రాజు, అందుకే అతన్ని మిథిలేష్ అని కూడా పిలుస్తారు మరియు జనక్ పురి ఆ రాజ్యానికి రాజధాని.
మహాదేవ్ ఆలయాన్ని నిర్మించిన తర్వాత, జనకమహారాజు మిథాలా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి పూజలు చేయడానికి ప్రతిరోజూ జనక్‌పూర్ నుండి వచ్చేవాడు అంటారు.
💠 ఈ పట్టణమున కల్నాబాబా లేక కల్నా పరమహంస అను ప్రముఖ బాబా కల్యాణేశ్వర్ ఆలయమందు ఉంటు తనను వేడిన జనుల సమస్యలు తీర్చుతూ ఉండేవాడు.
💠 ఈ ఆలయం రామాయణ కాలానికి సంబంధించినది కాబట్టి బీహార్ ప్రభుత్వం దీనిని బీహార్‌లో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది.
💠 తులసీదాస్ ఈ ఆలయాన్ని తన రామచరితమానస్ అనే పుస్తకంలో వర్ణించారు, ఈ ఆలయాన్ని మిథాల ప్రాంతానికి ద్వారం అని పిలుస్తారు
💠 ఈ ఆలయ ప్రాంగణంలో అనేక దేవతల ఆలయాలు నిర్మించబడ్డాయి, ముఖ్యంగా శివుని కుటుంబానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
బాబా భోలేనాథ్ కుటుంబంలో పార్వతీ , వినాయకుడి మరియు కార్తికేయుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
💠 ఈ ఆలయం మధుబని జిల్లా పరిధిలోని కల్నా గ్రామంలో ఉంది. మధుబని జిల్లా కేంద్రం నుండి దీని దూరం కేవలం 30 కి.మీ.
© Santosh Kumar
⚜ శ్రీ కల్యాణేశ్వర్ నాద్ మందిర్ - ⚜ బీహార్ : మిథిలా
August 12, 2023
Tags