🔱 *కుమారచరిత్ర* - *27* 🔱

P Madhav Kumar

 

*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 




*కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం*


సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం , దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉన్నది.

ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు.


గరుడునికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి మరియు ఇతర సర్పాలుసుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.
 
కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.
 
ఈ సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.
 
తన దిగ్విజయధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆది శంకరాచార్యూలవారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్టు "శంకర విజయం" చెప్తున్నది.
 
శంకరాచార్యుల "సుబ్రమణ్య భుజంగప్రయత స్తోత్రం" లో ఈ ప్రదేశాన్ని "భజే కుక్కే లింగం"గా ప్రస్తావించారు.
 
స్కంధ పురాణ  సనాతకుమార సంహిత లోని సాహ్యద్రఖండ తీర్తక్షేత్ర మహమనిపురణ అధ్యాయంలో శ్రీ సుబ్రమణ్య క్షేత్రం గురించి అద్భుతంగా అభివర్ణించారు.

కుమార పర్వత శ్రేణి నుండి ఉద్బవించు ధారా నది ఒడ్డున శ్రీ క్షేత్రం కొలువై ఉంది.

స్థలపురాణం :

పూర్వం తారకుడు, సూర పద్మాసురుడు అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు.
 
తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు
.
ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.
 
ఇది ఇలా ఉంటె స్వామివారు నాగులకి రక్షకుడిగా ఎందుకు మారాడు అంటే, నాగులలో శ్రేష్టుడు వాసుకి.
ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు.గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు.
 
అప్పుడు తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకికి అండగా మరియు తోడుగా  ఉండమని చెపుతాడు.
 
దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు.

దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది.ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. 
ఇంకా ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు కూడా వుంటాయి.

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు.

అందుకే , వాసుకికి కానీ నాగరాజుకు కానీ చెయ్యబడే పూజలు సుబ్రమణ్య స్వామి వారికి చేసినట్టే. 
సర్పదోషం పోవాలనుకొనే భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
 
శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. అంతేకాకుండా స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
 
ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
 
ఆశ్లేష బలి పూజ:

శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ.

సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము మరియు కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు.


ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. 

సర్ప సంస్కార / సర్ప దోష పూజలు : 

సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణనుసారం, ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ , తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష భాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. 
సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి  మార్గంగా సూచిస్తారు.
ఈ పుజను ఒక వ్యక్తి కానీ, తన కుటుంభంతో కానీ, లేక పూజారి గారి ఆద్వర్యంలో కానీ చెయ్యవచ్చును.

స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ.

 
నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు 'మాడే స్నాన' జరుపుతారు.


కుక్కే సుబ్రమణ్య లో చూడవలసిన మరిన్ని సందర్శన స్థలాలు బిలద్వార గుహ, సుబ్రమణ్య మఠం , వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం, ఆది సుబ్రమణ్య దేవాలయం, అభయ మహాగణపతి దేవాలయం, హరిహరేశ్వర్ దేవాలయం, మత్స్య పంచమి తీర్థాలు మొదలైనవి.

శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...

  🔱   *ఓం శరవణ భవ* 🔱

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat