*గురు మహిమను తెలిపే కొన్ని శ్లోకములు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ధ్యానమూలం గురో మూర్తిః పూజామూలం గురోః పదం | మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా ||*
ధ్యానస్పదమైన గుర్తుస్వరూపమగును. పూజార్పణమైనచో గురుపదములు కావాలి. మూలమంత్రమైనది గురు వాక్యములే అట్టివారికి గురుకృపయే మోక్ష కారణ మగును.
*గురురాదినాధిశ్చ గురూః పరమదై వతం |*
*గురోః పరతరంనాస్తి తస్మైశ్రీ గురువే నమః ॥*
ఆదియు , అనాదియు గురువేయగును. గురువుకన్నా శ్రేష్ఠమైన పరమ దైవం మరొకటి లేదు. కావున గురుదేవుని నమస్కరించు చున్నాను.
*సప్త సాగర పర్యంత తీర్థస్నానాధికంఫలం |* *గురోరంఘ్ పయోబిందు సహస్రాంశేన దుర్లభం ॥*
సప్తసాగర పర్యంతం గల పుణ్యతీర్ధములన్నిటి యందు స్నానం చేసి వచ్చినపుణ్య ఫలం , గురువుగారి పాదం కడిగిన జల బిందువును ప్రోక్షించు కొన్నప్పుడు లభించు పుణ్యఫలమునకు సాటికాదు.
*హశౌరుష్టే గురుస్తత్ర గురౌరుష్టే నకశ్చన|*
*తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రీ గురుం శరణంవ్రజేత్ ॥*
సర్వశక్తి సంపన్నుడు , లయకారుడు - త్రినేత్రుడు అయిన పరమేశ్వరుడు మనమీద అగ్రహిస్తే గురువు మనకొరకు సిపార్సు చేస్తే ఈశ్వరుడు శాంతిస్తాడు. మన్నిస్తాడు. కాని గురువు మనమీద అలిగి ఆగ్రహిస్తే రక్షించేవారే లేరు. సకల దేవతలు ఆ గురువు వద్దకే వెళ్ళ మంటారు. కావున గురువుగారి మనస్సు నొప్పించక జాగ్రత్త వహిస్తూ సర్వదా వారిని శరణం పొందవలెను.
*గురురేవ జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం |* *గురోః పరదరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం ॥*
సృష్ఠి - స్థితి - లయకారుకులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు సైతం సర్వప్రపంచమును గురుబ్రహ్మమే యగును. గురువు కన్న మిన్నయైనది మరొకటిలేదు. వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనియు , గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం , నిధయే సర్వ విద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః ॥ అనియు హరిహరులు సైతం తమలను గురు బ్రహ్మంగానే వ్యక్తబరచుకొనియున్నారు. కావున గురుపూజ సదా చేస్తూనే యుండవలెను.
*జ్ఞాన విజ్ఞాన సహితం లభ్యతే గురుభక్తితః |*
*గురోః పరతరం నాస్తి ద్యేయోసాగురు మార్గిభిః||*
గురుభక్తి మూలముగానే జ్ఞాన విజ్ఞానములు ( అత్మజ్ఞాన లోకజ్ఞానాదులు) సిద్ధించును. గురుదేవుని కన్నా శ్రేష్ఠమైనది మరొకటి లేదు. కావున గురుమార్గానుచారులు సదా గురువును ధ్యానిస్తూ యుండవలెను. శబరిమల యాత్రకు గూడ గురువే మార్గదర్శి - మార్గానుచారి , మార్గబంధువు కూడాను. అందువలన సద్గురు నాధునితో మాలవేయించుకొని ఆయన గారి అడుగు జాడలో నడిచి శబరిమల యాత్ర చేయాలి యని ఆదేశించి యున్నారు. *అందరి గురువు ఆదిగురువు - గురువిన్ గురువైన ఆ అయ్యప్పస్వామి వారే* కనుక మనకు లభ్యమైన గురుస్వామిలో సాక్షాత్ ఆదిగురువైన అయ్యప్పను దర్శించి , భక్తి చూపవలెను.
*యస్మాత్పరదరం నాస్తి నేతినే తీతిపై శ్రుతిః |* *మనసావచసా చైవ నిత్యమారాధయేత్ గురుం ||*
ఇది కాదు - ఇదికాదు (నేతి నేతి) అని చెప్పు చున్నది శ్రుతి (వేదం) సర్వము పరిచయం చేస్తున్న గురుదేవునికన్నా శ్రేష్ఠమైనది మరొకటి లేదు. కావున గురుబ్రహ్మను మనసా వాచా ఆరాధించవలెను.
*గురోః కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు సదాశివాః |సమర్థాః ప్రభువాదేవ కేవలం గురు సేవయా ॥*
త్రిమూర్తులకు సైతం (తమకర్తవ్యమును) సృష్టి స్థితి సంహారములకు గాను ప్రభావితం (సామర్థ్యం) లభించునది గురు సేవ మూలముగా కలిగిన గురు కృపయగు ప్రసాదం మూలముగానే యనునది త్రికాల సత్యం.
*దేవకిన్నర గంధర్వాః పితరోయక్ష చారణాః | మునయోపి నజానంతి గురుశిశ్రూషణే విధిః ॥*
దేవదానవ కిన్నరులు , చారణులు , గంధర్వులు , యక్షులు , దేవులు , మునిపుంగవులు , యోగులు , యతీశ్వరులు వీరెవరికిను గురుసేవావిధి గూర్చి సరిగ్గా తెలియదు.
*మహాహంకార గర్వేన తపోవిద్యాబలాన్వితః | సంసార కుహరావర్తే ఘటయంత్రే యథా ఘటాః ॥*
తపము విద్యవీటిలో బలాఢ్యులైనవారు , అహంకార సహితులై సంసార సాగరమున మునిగితేలుతూ , ఆవర్త చక్రమున బడి (కుమ్మరివాని ఘటయంత్రమున (ఘటం - కుండ) తిరుగులాడు చూయుండినట్లు జీవింతురు.
*నముక్తాదేవ గన్ధర్వాః పితరోయక్ష కిన్నరాః |*
*ఋషయః సర్వసిద్ధాశ్చ గురుసేవాపరాంగ్ ముఖాః ||*
దేవతలుకాని , గంధర్వులుకాని , పితృదేవతలు గాని , యక్షకిన్నర కింపురుషులుగాని సర్వశక్తి సంపన్నులైన ఋషి శ్రేష్ఠులైనాకాని వారు గురుసేవాపరాయణులు కాని వారైనచో మోక్షప్రాప్తి కలుగదు.
*ధ్యానం శృణు మహాదేవీ సర్వానందప్రదాయకం సర్వసౌఖ్య కరం నిత్యం భక్తి ముక్తి విదాయకం ॥*
శ్రీ పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఇట్లనెను 'హే మహాదేవీ ! గురుధ్యానం సర్వానంద దాయకం. సర్వసుఖప్రదం. భక్తి ముక్తి విదాయకము. గురుధ్యానం చేస్తూ గురుసేవ చేయుచుండు వారికి సర్వం సులభముగా సిద్ధించును.
*శ్రీ మదపరబ్రహ్మగురుంస్మరామి శ్రీమద్ పరబ్రహ్మగురుం వదామి।*
*శ్రీ మదపరబ్రహ్మ గురుంనమామి శ్రీమదపరబ్రహ్మగురుం భజామి॥*
వరబ్రహ్మ మయమైన శ్రీమద్ గురునాథుని నేను సదా స్మరిస్తున్నాను. సదా ధ్యానిస్తున్నాను. సదానమస్కరిస్తున్నాను. సదా భజించుటయు (స్తోత్రించుటయు) చేయు చున్నాను.
*బ్రహ్మనందం పరమసుఖదం కేవలంజ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం*
*ఏకంనిత్యం విమలమచలం సర్వధీసాక్షి భూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తంనమామి ॥*
ఆశ్రితులకుపరమ సుఖ ప్రదమైన బ్రహ్మానందమును ప్రసాదించ గలవాడును. జ్ఞాన స్వరూపుడును సుఖదుఃఖాదులనబడు ద్వంద్యములకతీతుడును , ఆకాశమంత విశాల విమల మనోభావం గలవాడును, 'తత్వమసి' 'అహంబ్రహ్మాస్మి' 'అహమాత్మా బ్రహ్మ' యను మహావాక్యములకు నిదర్శనగా యుండువాడును , ఏకస్వరూపుడు , - నిత్యుడు , అచలుడు , విమలుడు , సర్వ జాతిజంతువుల యందునూ సాక్షిరూపుడై యుండువాడును , భావాతీతుడును త్రిగుణరహితుడు అగు సద్గురునాథునికి నేను నమస్కరిస్తున్నాను.
*నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం |*
*నిత్యబోధం చిదానందం గురుబ్రహ్మ నమామ్యహం ॥*
నిత్యుడు , శుద్ధుడు , నిరాభాసుడు , రూపరహితుడు , నిష్కళంకుడు , నిత్యబోధకుడు , చిదానందస్వరూపుడు అయిన గురు - బ్రహ్మమును నేను నమస్కరించెదను.
*హృదయంబుజే కర్ణికమధ్య సంస్థేసింహాసనే సంస్థిత దివ్యమూర్తిం| ధ్యాయేద్గురుం చంద్రకళా ప్రకాశం చిత్పుస్తకాభీష్టవరం దధానం ॥*
నా హృదయకమల మధ్యభాగాన సింహాసనం వేసి అందున తిష్ఠ ' వేసి కూర్చొని యుండు దివ్య స్వరూపుడును , చంద్రకళా ప్రకాశతుల్య తేజోరూపుడును , జ్ఞాన గ్రంథమునే ముద్రలై ధరించి యుండు వాడు యగు గురునాథుని నేను ధ్యానిస్తున్నాను.
*శ్వేతాంబరం శ్వేత విలేపపుష్పం ముక్తావిభూషం ముదితం ద్వినేత్రం వామాంగ పీఠ స్థిత దివ్యశక్తిం మందస్మితం సాంద్ర కృపానిధానం ॥*
*ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞాన స్వరూపం నిజబోధయుక్తం । యోగీంద్ర మీఢ్యం భవరోగ వైద్యం*
*శ్రీమద్గురుం నిత్యమహం నమామి ||*
*శ్వేతాంబర ధారియు , పుష్పమాల , ముత్యాల మాలలతో అలంకృతుడును , ఎడమ భాగాన అమరియుండు శక్తి స్వరూపిణితో గూడియుండు వాడును. మందహాస భరిత ముఖవర్చస్సు గలవాడును , సాంద్రకృపా పూరితుడును , పరమానంద దాయకుడును , ప్రసన్నుడును , జ్ఞాన స్వరూపుడును , తత్వబోధ సహితుడును , యోగివర్యులచే సన్నుతించువాడును సంసార మగుభవరోగమునకు దివ్యఔషదము వంటి వాడును అగు నాయొక్క గురునాథుని నేను నమస్కరించు చున్నాను.
*యస్మిన్ సృష్టి స్థితిధ్వంస నిగ్రాను గ్రహాత్మకం |*
*కృత్యం పంచ విధం శశ్వత్ భాసతే తంనమామ్యహం ॥*
ఎవ్వరి మూలాన (ప్రేరణతో) సృష్టి - స్థితి- సంహారం - నిగ్రహం - అనుగ్రహం అనబడు పంచవిధ శాశ్వత కర్మములు నిరాటంకముగా జరుగుచున్నదో జరుపబడుచున్నదో ఆ గురునాథుని నేను నమస్కరించు చున్నాను.
*ప్రతః సిరస్సి శుక్లాబే ద్వినేత్రం ద్విభుజం గురుం |*
*వరాభయయుతం శాంతం స్మరేత్తం నామపూర్వకం ॥*
ప్రభాత సమయమున నాయొక్క శిరస్సగు శ్వేతాబ్దమున నెలకొనియుండువాడును, రెండు కన్నులు , రెండు కరములు గలవాడును , వరం అభయం అను ముద్రలను దాల్చియుండు వాడును అగు గురునాథుని నేను నామోచ్చారణం చేయుచున్నాను.
*నగురోరధికం నగురోరధికం నగురోరధికం నగురోరధికం శివశాసనతః శివశాసనతః శివశాసనతః శివశాసనతః త్వదమేవ శివం త్విదమేవశివం ద్విదమేవ శివం త్వదమేవ శివం మమశాసనతో మమశాసనతో మమశాసనతో మమశాసనతో ॥*
("హేదేవి") గురువుకు అధికమైనది ఇంకేమియులేదు. ఇది నాయొక్క శాసనమే. (గురుభూతుడే) శివమయమైనది. మంగళ మైనది. ఇది నా ఆజ్ఞయగును.
*ఏవం విధం గురుంధ్యాత్వా జ్ఞానము దృత్యతే స్వయం తత్ సద్గురు ప్రసాదేన ముక్తోహమితి భవయేత్ ॥*
ఈ విధముగా గురుస్తోత్రం చేయుటచే పరజ్ఞానం సద్గురు ప్రసాదముచే ముగ్ధుడైతినను భావనయు కలుగును.
*గురుదర్శితమార్గేణ మనఃశుద్ధింతుకారయేత్ ।*
*అనిత్యం ఖండయేత్సర్వం యత్కించిదాత్మ గోచరం ॥*
గురువుచూపిన బాటలో (జ్ఞానముచే) అంతః కరణశుద్ధి కలిగించుకొనవలెను. ఆత్మగోచరములైన సర్వనశ్వర వస్తువులను (ఆమార్గం ఖండించు చుండును.
*జ్ఞేయం సర్వస్వరూపంచ జ్ఞానం చ మనఃఉచ్యతే | జ్ఞానంజ్ఞేయ సమంకుర్యాన్ నాన్యఃపంథా ద్వితీయకః ॥*
జ్ఞేయమైనది సర్వస్వరూప జ్ఞానమగును. (జ్ఞేయం - తెలుసు కోదగినది) జ్ఞానం మనస్సగును. జ్ఞానసమమే జ్ఞేయం కావున (జ్ఞానముగాక) మరియొక పంథా (సత్య జ్ఞానము యొక్క) లేదని గ్రహించవలయును.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌺🙏