💠 ఉమామహేశ్వరం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామపంచాయతీలో నల్లమల అడవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం.
ఈ ఉమా మహేశ్వర క్షేత్రంలో మల్లికార్జున స్వామి ప్రధాన దైవము .
💠 త్రిపురాంతకం, సిద్దావతం, అలంపుర, ఉమామహేశ్వరం ఈ నాలుగు దేవాలయాల్ని శ్రీశైలానికి నాలుగు ప్రధాన ముఖ ద్వారాలుగా పరిగణిస్తారు...
💠 శ్రీశెైలం ఉత్తర ముఖ ద్వారంగా, రెండవ శ్రీశెైలంగా భాసిల్లు తోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతిదేవి శివుడి కోసం తపస్సు చేసిందట.
అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాలపాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వర మని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది.
ఇక్కడి కొండపెై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువెై ఉన్నాడు.
కాకతీయుల కాలం నాటి "పండితారాధ్య చరిత్ర"లో ఈ క్షేత్రం గురించి వివరించబడింది.
నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది ఉమామహేశ్వరం.
💠 ఈ ఆలయం శ్రీశైల క్షేత్రం కి ఉత్తర ద్వారం గా బాసిల్లుతుంది . అందువల్ల ఇది శివపురం గా పిలవబడుతుంది .
ఇక్కడ నుండే శ్రీ శైలంకి పర్వతారోహణం ప్రారంభ౦అవుతుంది . శ్రీ శైలం వెళ్ళే వాళ్ళే వారంతా విధిగా శ్రీ ఉమా మహేశ్వర స్వామిని దర్శిస్తారు .
పురాణాలలో కూడా ఈ క్షేత్ర మహిమ ప్రస్తావన ఉంది .
💠 ఈ కొండ మొత్తం కూడా అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకేచోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగ మహేశ్వరం అని అంటారు.
అమ్మవారికి, స్వామివారికి ఐదు గుడులలో ఐదు లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి.
💠 ఉమా మహేశ్వర క్షేత్రంలోని ప్రధానాలయం ఉత్తరముఖముగా ఉంది . ఒక కొండచరియకు మధ్య భాగం లో స్వయంభువు గా వెలసి ఉన్న ఈ స్వామికి సహజం గానే కొండచెరియ భాగం ఆలయ పై కప్పు గా ఇరువైపులా గోడలు ఏర్పరిచి ముంధు భాగంలో ద్వారాన్ని ఉంచి గర్భలయాన్ని నిర్మి౦చారు . స్వామివారికి కుడి వైపున ఉమాదేవి ఆలయాన్ని , ఎడమ వైపున మహిషాసుర మర్ధిని ఆలయాన్ని ఏర్పరిచారు . గర్భాలయ౦ లోని ఉమా మహేశ్వర స్వామి సుమారు ఒక అడుగు ఎత్తు కలిగి వర్తులాకారం లో కాక దీర్ఘచతురస్రాకారంగా స్వామి భక్తులకు కనిపిస్తారు . స్వామి వారు పానపట్ట౦ పై నుండి తొడగబడినట్లు ఉంటుంది . దీనిని ఒక విశేషం గా భక్తులు భావిస్తారు .
💠 కొండల్లో నుంచి నిరంతరం నీరు కారుతుంది. అక్కడ ఉన్న చిన్న గుంతలో ఎంత నీరు తీస్తే అంత వస్తుంది. ఆలయానికి వెళ్లే దారిలో 2వ మైలు రాయి వద్ద కారు ను నిలిపితే వెనక్కి వెళ్ళిపోతుంది. రోడ్డు మాత్రం సమాంతరంగా ఉంటుంది.
💠 ఈ ఆలయం లో చతుర్భుజ దుర్గాదేవి , చతుర్భుజ గణపతి మొదలగు దేవతల మూర్తులు కొలువై ఉన్నారు . ఉమా మహేశ్వర౦ వెళ్ళే దారిలో గల కోనేరు ప్రాంతాన్ని దిగువ ఉమామహేశ్వరం గా పిలుస్తారు .
ఇక్కడి రుద్ర ధారలో స్నానం చేసి ఉమా మహేశ్వర స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని శ్రీశైల ఖండంలో వుంది .
💠 ఇక్కడ అయిదు తీర్దాలున్నాయి కనుక మహా తీర్ధం అనే పేరు వచ్చింది ..
🔅రుద్ర ధార ,
🔅విష్ణుదార ,
🔅బ్రహ్మ ధార,
🔅ఇంద్ర ధార ,
🔅దేవ ధార .
💠 పాల్కురికి సోమనాధుడు పండితా రాధ్య చరిత్ర లో ఇక్కడ
🔅 మహేశ్వరం ,
🔅గుప్త మహేశ్వరం ,
🔅చరుకేశ్వరం ,
🔅సంధ్యేశ్వరం ,
🔅గరుదేశ్వరం ,
🔅కాలహ్రదేశ్వరం ,
🔅పాపవినాశం ,
🔅గనేశ్వరం ,
🔅దేవహ్రదేశ్వరం ,
🔅సిద్దేశ్వరం,
🔅నీలహ్రదం అనే పద కొండు తీర్దాలున్నట్లు రాశారు .
కొండ పై నుంచి దూకే జలధారలను
🔅రుద్రదార
🔅భస్మధార
🔅గౌరీ కుండం
🔅పాప నాశనంగా చెప్పాడు .
💠 ఉమామహేశ్వరలింగం స్వయంభు లింగం .కింది నుండి ,సుమారు 500 అడుగుల ఎత్తున కొండ చివర ఒక మహా శీలా బయటికి వచ్చింది .దానికిందనే ఉమా మహేశ్వరుడు వెలిశారు .
💠 ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడ బ్రహ్మొత్సవాలు ఘనంగా జరుగుతాయి . స్వామి వారికి ఆషాఢ శుద్ద ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . తొలి ఏకాదశి , మహా శివారాత్రి పండుగల సంధర్భముగా ప్రత్యేక పూజాకార్యక్రమాలు ప్రత్యేక౦గా నిర్వహిస్తారు .
💠 హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారిపై హైదరాబాదు నుంచి 140 కిమీ దూరంలో ఉంది. మండలకేంద్రం అచ్చంపేట నుంచి 12 కిమీ దూరంలో ఉంది.