🌸🌸🌸🌸🌸🌸🌸
🌸ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది...
ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస్తుంటాయి...
🌿అందుకే ఆరాధించడానికి తిథి, వార, నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు, తుదిలేని పుణ్యరాశి లభ్యమౌతుందట.
🌸అందుకే సజ్జనులందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వెయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని 'దేవీభాగవతం' చెబుతోంది...
🌿ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు.
🌸🌿ఈ తల్లి శక్తి అనంతం , అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లిని తొమ్మిది
(9) రకాలుగా అర్చించి పూజిస్తారు.
🌿మూడు కన్నులతో, పదహారు చేతులతో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది.
🌸1. పాముల కంకణాలతో , నల్లని కంఠంతో, నల్లని వర్ణంతో కనిపించే తల్లిని షోడశ భుజ దుర్గాదేవిగా,
🌿2. ఎనిమిది చేతులతో మహిషి (ఎద్దు) తలమీద ఎక్కి బంగారు వర్ణంతో కనిపించే అమ్మను వనదుర్గాదేవిగా,
🌸3. రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణంతో సర్వభూషణ శోభితంగా దర్శనం ఇచ్చే తల్లి నిరుద్రాంశ దుర్గాదేవిగాను,
🌿4. వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కిన త్రిశూలినీ దుర్గాదేవి స్వరూపంగా,
🌸5. అష్టభుజాలతో, చంద్రరేఖను ధరించిన శిరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపంగా ,
🌿6. సింహ వాహనంతో జయ దుర్గాదేవిగా ,
🌸7. మెరుపు తీగ లాంటి స్వర్ణ వర్ణ మేని ఛాయతో, స్వర్ణ కమలం మీద ఆశీనురాలై, ఇంద్రాది దేవతలందరిచేత స్తుతించబడే వింధ్యావాసిని దుర్గాదేవి స్వరూపంగా,
🌿8. ఎర్రని శరీర వర్ణంతో కూడి చేత తర్జనీముద్రని , ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపంతో రిపుమారిణి దుర్గాదేవి స్వరూపంగా,
🌸9. తెల్లని శరీర వర్ణంతో , మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తుంది. కుడివైపు చేతుల్లో అభయముద్ర చక్రాలను ఎడమవైపు నడుంమీద ఒకచేతిని , మరో చేత శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగానూ జగన్మాతను కొలుస్తారు.
🌿ఇలా శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయి. ఇలా తొమ్మిదిరోజుల వ్రతం పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.
🌸ఇంకొందరు అమ్మ వ్రతంలో భాగంగా బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్ని పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్ళు , ముతైదువులకు పసుపుకుంకుమలతో పండ్లు, తాంబూలాలు పంచుకొంటారు...
🌿నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనులపండువను , భక్తులను ఆనందపరవశులను చేస్తాయి.
🌸అష్టమిని.. అంటే, దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు.
ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి, అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు.
🌿ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో , కుంకుమార్చనలతోనూ అర్చిస్తే , సత్సంతాన భాగ్యం కలుగుతుంది.
ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవని చెపుతారు
🌸నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు.
నవమి రోజున మహార్నవమి అంటూ పూజ చేస్తారు, పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు , చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు.
🌿అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది, కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం.
🌸దశమి రోజున శమీ పూజ చేస్తారు, దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి చెట్టు, ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు.
🌿పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట.
🌸తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడన లేకుండా చేస్తుంది..స్వస్తి...🚩
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸