*గురు ఉపదేశం పొందినవారి మాలాధారణ పద్ధతి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*సద్గురువులు తిరువనంతపురం బ్రహ్మశ్రీ నీలకంఠ అయ్యర్ పెద్ద గురుస్వాముల వారి ఆదేశాలను అనుసరించి ఈ వివరణ సమకూర్చబడినది.*
*విఘ్నేశ్వరపూజ*
మాల ధరించుటకు ముందు దినమే మాలను శుభ్రపరచి యుంచుకొని , మర్నాడు ఉదయం బ్రహ్మీముహూర్తమునే లేచి నిత్య కర్మానుష్టానములను ముగించుకొని మాలధరించు కొనుటకు సిద్ధముకావలెను. మొదట ఆచమనముచేసి చేతిలో పుష్పాక్షింతలు తీసుకొని
*శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|* *ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ॥*
*తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ|* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి ॥*
అని ధ్యానిస్తూ ప్రాణాయామము చేయవలెను.
*ప్రాణాయామము*
ఓం భూః |
ఓం భువః |
ఓగ్ం సువః |
ఓం మహః |
ఓం జనః |
ఓం తపః |
ఓగ్ం సత్యం |
ఓం తత్సవితుర్వ రేణ్యం|
భర్గోదేవస్య ధీమహి| ధియో యోనః ప్రచోదయాత్|
ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం|
*ఘంటా నాదము*
ఆగమార్ధంతు దేవా నాం గమనార్ధంతు రక్షసాం | కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం ॥ అని గంటను మ్రోగించవలెను.
*సంకల్పము*
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం , కరిష్యమాణస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం , ఆదౌ శ్రీ విఘ్నేశ్వర పూజాం కరిష్యే ॥
అని జపించి పుష్పాక్షింతలను ఉత్తర దిశగా వేసి పసుపుతో వినాయకుని తయారుచేసి పూజ చేయవలెను.
*ధ్యానం*
*గణానాంత్వాం గణపతి గంహవామహే కవింకవీనా ముపమస్రవస్తమం || జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత ఆనః శృణ్వన్నూతిభిః సీదసాధనం |*
అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ధ్యాయామి |
ఆవాహ యామి|| శ్రీమహాగణపతయే నమః ఆసనం సమర్పయామి | శ్రీ మహాగణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి | శ్రీ మహాగణ పతయే నమః పాద్యం సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః ఔపచారికస్నానం సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి। శ్రీమహాగణపతయే నమః గంధాన్ ధారయామి। మహాగణపతయే నమః గంధస్సోపరి అక్షతాన్ సమర్పయామి। శ్రీమహా గణపతయే నమః హరిద్రా కుంకుమాం సమర్పయామి | శ్రీమహాగణపతయే నమః పుష్పమాల్యాం సమర్పయామి। శ్రీమహాగణపతయే నమః పుష్పైః పూజయామి | వసువు విఘేశ్వరుని తెల్లని పుష్పములతో అర్చించేది*
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః | కపిలాయ నమః | గజకర్ణకాయ నమః | లంబోదరాయ నమః | వికటాయ నమః | విఘ్నరాజాయ నమః | గణాధిపాయ నమః | ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః | ఫాల చంద్రాయ నమః 1 గజాననాయ నమః | వక్రతుండాయ నమః | శూర్పకర్ణాయ నమః | హేరంబాయ నమః | స్కందపూర్వజాయ నమః |
ఓం శ్రీమహా గణపతయే నమః |
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి ॥
ఓం శ్రీ మహాగణపతయే నమః |
ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి ||
*నైవేద్యం*
అరటిపండ్లు , కొబ్బరికాయ , అటుకులు , బెల్లం వీటిని విఘ్నేశ్వరునికి నైవేద్యం చేయవలెను.
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | దేవసవితః ప్రసువ , సత్యంత్వర్తేన పరిషించామి। అమృతమస్తు | అమృతోపస్తరణమసి | స్వాహా |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓం బ్రహ్మణే స్వాహా ॥ ఓం శ్రీ మహాగణపతయే నమః కదలీఫలం , గృతకుళం , నారీకేళ ఖండ ధ్వయం నివేదయామి। నివేదనానంతరం ఆచమనీయం సమర్పయామి | తాంబూలం సమర్పయామి |
కర్పూర నీరాజనం సందర్శయామి।
*ప్రార్థన*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ|| అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥*
శ్రీ మహాగణపతయేనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।
సమస్త రాజోపచార , దేవోపచార , భక్త్యుపచార , శక్త్యుపచార పూజాం సమర్పయామి। మహాగణపతి ప్రసాదం శిరసాగృష్ణమి ||
యని పసుపు విఘ్నేశ్వరునిపై పూజించిన పుష్పములుతీసి శిరస్సుపై ధరించుకొనవలెను.
*శ్రీ హరిహరపుత్ర మాల పూజ*
మాలను ఆవుపాలు నీళ్ళతో కడిగి ముద్రను చందన కుంకుమాదులతో అలంకరించి , మాలను చందనములో తడిపి , పళ్ళెము లేక అరిటాకుపై నుంచవలెను. మాలను ఎట్టి కారణముచేతను నేలపై యుంచరాదు.
*మాలాధారణ సంకల్పము*
శుక్లాం...........శాంతయే ॥
ఓం భూః.............సువరోం ॥
మమోపాత్త సమస్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం
శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధ శ్వేతవరాహకల్పే , వైవశ్వత మన్వంతరే , అష్టావింశతితమే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , మేరోః దక్షిణే పార్శ్వే , దండకారణ్యే , సహాబ్దే , అస్మిన్ వర్తమానే , వ్యావహారికే , ప్రభవాదీనాం , షష్ట్యధీనాం సంవత్సరాణాం మధ్యే......... నామ సంవత్సరే..... ఆయనే...... ఋతౌ......... మాసే పక్షే........ శుభతిధౌ...... వానరః....... వానర యుక్తాయాం........ నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర , శుభయోగ , శుభకరణ , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం.......... శుభతిధౌ శబరిగిరి తీర్దాటన ఉద్యిశ్య మాలాధారణార్థం మాలా పూజాం కరిష్యే || తదంగత్వేన కలశ , శంఖ , ఆత్మ , పీఠ , పూజాంచ కరిష్యే ॥
*కలశపూజ*
కలశమును గంధపుష్పాక్షత కుంకుమలతో అలంకరించి కుడిహస్తముతో మూసి
*కలశ లఖేవిష్ణుః కంఠేరుద్రః సమాశ్రితః । మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాఃస్మృతాః ॥ కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |*
*ఋగ్వేదోధ యజుర్వేద స్సామ వేదోర్వధర్వణః ॥ అంగైశ్చ సహితా స్సర్వేకలశాంబు సమాశ్రితాః | ఆయాంతు దేవపూజార్ధ దురితక్షయ కారకాః ॥ గంగేచ యమునే కృష్ణా గోదావరి సరస్వతీ | నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ॥*
అని జపించి కలశ జలముతో మాలను , తనను , పూజా ద్రవ్యములను ప్రోక్షించ వలెను.
*శంఖ పూజ*
(శంఖములేనిచో ఈ పూజ చేయనవసరము లేదు)
*కలశ జలేన శంఖం ప్రక్షాళ్య | పునః కలశజలేన శంఖం గాయత్ర్యాప్ర పూర్య | పాంచజన్యాయ నమః దివ్యగంధాన్ ధారయామి। శంఖమూలే బ్రహ్మణేనమః | శంఖ మధ్యే జనార్దనాయనమః శంఖాగ్రే చంద్రశేఖరాయనమః ।*
*శంఖం చంద్రార్క దైవత్వం మధ్యే వరుణ సంయుతం | పృష్టే ప్రజాపతిశ్చైవ అగ్రేగంగా సరస్వతీ | త్రైలోక్యే యానితీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా | శంఖేతిష్ఠంత్యు పేంద్రాః తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥ త్వంపురాసాగరోత్పన్నః విష్ణునా విదృతః కరే ॥ పూజిత స్సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తుతే ॥ ఓం పాంచ జన్యాయ విద్మహే పవమానాయధీమహి | తన్నో శంఖ ప్రచోదయాత్ II*
*ఇతి శంఖగాయత్రీం ఉచ్చార్య | శంఖ దేవతాభ్యోనమః | గంధపుష్పాక్షతాన్ సమర్పయామి | ఇతి సంపూజ్య ॥ త్వంపురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే | దేవైశ్చపూజతః సర్వైః పంచజన్య నమోస్తుతే"* అని జపించి పూజాద్రవ్యములను తనను శంఖ జలముతో ప్రోక్షించవలెను. పిదప గాయత్రీ మంత్రముతో శంఖములో జలము నింపి యుంచవలెను.
*ఆత్మపూజ*
*ఆత్మనేనమః దివ్యగంధాన్ ధారయామి।*
*ఆత్మనే నమః | అంతరాత్మనే నమః | యోగాత్మనే నమః | జీవాత్మనే నమః | పరమాత్మనే నమః | జ్ఞానాత్మనే నమః | సమస్తోపచారాన్ సమర్పయామి ॥*
అని పుష్పాక్షింతలతో తమ శిరస్సుపై వేసుకొనవలెను.సుబ్బారెడ్డి
*పీఠపూజ*
*మాలను ఉంచియున్న పీఠముపై పూలతో పూజించేది.*
*ఓం ఆధారశక్యై నమః | మూల ప్రకృత్యై నమః । ఆది కూర్మాయైనమః । ఆది వరాహాయై నమః | ఆనందాయై నమః । పృథ్వివ్యై నమః | రత్నమండపాయై నమః | రత్నవేదికాయై నమః |*
*స్వరస్థంబాయై నమః | శ్వేతా శ్చత్రాయై నమః | కల్పవృక్షాయై నమః | క్షీరసముద్రాయై నమః | సితచామరాభ్యాం నమః| యోగ పీఠాసనాయై నమః | సమస్తోపచారాన్ సమర్పయామి ॥*
*ధ్యానం*
*ఆశ్యామ కోమలతనుం విచిత్ర వాసోవసాన మరుణోత్సల వామహస్తం । ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే ॥*
అని శ్రీ అయ్యప్పస్వామివారిని తలుస్తూ , మాలను స్పర్శిస్తూ
ఓం నమః |
ఓం నమః |
ఓం నమః |
ఓం ఘ్రాం నమః | ఓం ఘ్రాం నమః | ఓం ఘ్రాం నమః |
ఓం ఘ్రూం నమః పరాయ గోప్తే (ముమ్మార్లు) *ఇదియే శ్రీ అయ్యప్పస్వామి వారి దీక్ష మాల మంత్రము*
*శ్రీ భూతనాథ గాయత్రీ*
*ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ ॥(ముమ్మార్లు)*
*ఏహి ఏహి భగవన్ ! శబరిగిరీశ్వరం ధ్యాయామి | అస్యాం మాలాయాం ఆవాహయామి ॥* (అని ప్రాణప్రతిష్ఠ గావించవలెను)
*ప్రాణ ప్రతిష్టా*
*ఓం అస్యశ్రీ ప్రాణప్రతిష్ఠా మహామంత్రస్య | బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయ | ఋగ్యజు స్సామాథర్వాణి ఛందాంసి | సకల జగత్ సృష్టిస్థితి సంహారకారణి ప్రాణ శక్తిః | పరాదేవతా | ఆంబీజం | హ్రీం శక్తిః | క్రోం కీలకం | ప్రాణప్రతిష్ఠాపనే వినియోగః | ఆం అంగుష్టాభ్యాం నమః | | హ్రీంతర్జనీభ్యాం నమః | క్రోంమధ్యమాభ్యాం నమః | ఆం అనామికాభ్యాం నమః | హ్రీం కనిష్ఠికాభ్యాం నమః | క్రోం కరతలకర పృష్టాభ్యాం నమః | ఆం హృదయాయ నమః । హ్రీం శిరసే స్వాహా | క్రోం శిఖాయైవషట్ | ఆం కవచాయ హుం | నేత్రత్రయాయ వౌషట్ | క్రోం అస్త్రాయ ఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్ద్బంధః 11*
*ధ్యానం*
*రక్తాంబోతి స్తపోతోల్లసత్ అరుణ సరోజాది రూఢాకరాళై: పాశం కోదండమిక్షుద్భవ మళిగుణ మప్యంకుశంపంచబాణాన్ | బిబ్రాణా స్కృక్కపాలం త్రిణయనలసితా పీన వక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః ॥*
ఆం హ్రీం క్రోం - క్రోం హ్రీం ఆం య-ర-ల-వ- శ ష- స హోం | హంసస్సోహం - సోహం హంసః | అస్యాం మాలాయాం జీవస్తిష్ఠంతు | అస్యాం మాలాయాం సర్వేంద్రియాణి మనస్ 1 త్వక్ చక్షుశోత్ర , జిహ్వాఘ్రాణ వాక్పాణి పాద పాయూపస్తాఖ్యాని
ప్రాణాపాన వ్యానోదాన సమానాశ్చ ఇహాగత్య | స్వస్తి | సుఖం చిరం తిష్టంతు స్వాహా ॥ (అని పుష్పాక్షింతలను జలముతో మాలపై వేయవలెను.)
*అసునీతే పునరస్మాసు చక్షుః | పునః ప్రాణమిహనో దేహి భోగం| జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే స్వస్తిః | ఆవాహితో భవ | స్థాపితో భవ | సన్నిహితోభవ | సన్నిరుద్ధోభవ | అవకుంఠితోభవ| సుప్రీతోభవ| సుప్రసన్నో భవ | సుముఖో భవ | వరదోభవ| ప్రసీద ప్రసీద| స్వామిన్ సర్వజగన్నాధ యావద్ యాత్రావసానకం తావత్వం ప్రీతిభావేన మాలాయాం సన్నిధిం కురు ॥* మాలకు సహస్రారం హుం ఫట్ అను అఘోర అస్త్రముచో ఎనిమిది దిక్కులు , పైనా కింద దిగ్భందనము చేసి , పంచోప చారములు చేసి , శక్తికొలది 108 సంఖ్యకు తగ్గకుండా మూల మంత్ర జపం చేసి మాలను ధరింపజేయ వలెను.
*మాలాధారణ మంత్రము*
జ్ఞాన ముద్రాం శాస్త్ర ముద్రాం గురు ముద్రాం నమామ్యహం
వన ముద్రాం శ్రద్ద ముద్రాం రుద్ర ముద్రాం నమామ్యహం
శాంత ముద్రాం సత్య ముద్రాం వ్రత ముద్రాం నమామ్యహం
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే గురుదక్షిణ పూర్వం తస్యానుగ్రహ కారిణే శరణాగత ముద్రాఖ్యం తన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్ర ముద్రాం నమామ్యహం
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః అష్టాదశం మహాసారం శాస్తుదర్శన కారణం విధితం శుద్ధ ముత్కృష్టం సన్నిధానం నమామ్యహం ఊరుజం వాపురం చైవ భైరవ ద్వన్నసేవితం విష్ణుమాయాన్వితం శాస్త్రృ పరివారం నమామ్యహం ||
*స్వామియే శరణం............. శరణమయ్యప్ప*
అని పై మంత్రమును జపించి , శరణఘోష చేస్తు తమ గురుస్వామిని తలుస్తూ మనసులో అయప్పను ధ్యానిస్తూ గురుస్వాములు మాల ధరించుకొనవవలెను. పైన సూచించిన రీత్యా బృందములను శబరిమలకు యాత్ర గావించే గురుస్వాములు మాత్రము , ముఖ్యముగా గురూపదేశం పొందిన వారు అనుష్ఠించిన తక్కిన వారికి మాలాధారణ మంత్రమును జపింపచేసి , జ్ఞానమును ప్రసాదించి , మోక్షమునకు దారి చూపే శాస్త్రృముద్ర , గురుముద్ర , వనముద్ర , శుద్దముద్ర , రుద్రముద్ర , శాంతముద్ర , సత్యముద్ర , భద్రముద్ర , చిన్ముద , ఖేచరీ ముద్రయగు శబరిమల ముద్రకు నమస్కరించి ఈ మాలను గురుముఖతా ధరించు చున్నాను. ఈ క్షణము నుండి నాదేహమును స్వామి ఆలయముగా తలచి , భయభక్తులతో మసలుకొంటాను. మధుమాంసాదులను ముట్టను , స్త్రీలను తల్లిగాను , సోదరిగాను తలచి వ్యవహరిస్తాను. అసత్యమాడను. స్వామి యని పిలిపించుకొందును. ఆ స్వామివారి కీర్తి ప్రతిష్ఠలకు కళంకము వాటిల్లు రీత్యా ప్రవర్తించనని దైవ సన్నిధిలో సద్గురు సమక్షమున ప్రమాణము చేసి ఈ ముద్రమాలను స్వీకరిస్తున్నాను (వేసుకొను చున్నాను.
*స్వామి నా ఈ మండలకాల దీక్షలో ఎట్టి ఆటంకము కలుగనీయక తోడు నీడగా యుండి మమ్ములను సన్మార్గాన నడిపించేభారం నీదే. మేము సదా నీ శరణ నామము లను జపిస్తూ యుంటాము. స్వామియే శరణమయ్యప్పా యని శరణాలు పలుకుతూ మాల ధరించిన వారందరికి , తల్లిదండ్రులకు , గురుస్వామికి సాష్టాంగ ప్రణామములు చేయవలెను. పిదప గురుస్వామికి శక్తికొలది దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మరల నమస్కరించవలెను.
శబరిమలను ఉద్దేశించి మాలవేసి దీక్షను ప్రసాదించు ప్రతి గురుస్వామి *"జ్ఞానముద్రాం, శాస్త్రు ముద్రాం"* అను మంత్రమును చెప్పించి మాలవేస్తున్నారు. ఈ సంస్కృత శ్లోకము యొక్క సారాంశము తెలియకనే పలువురు యాత్ర చేయుచున్నారు. మాలవేయునవుడే *"జ్ఞానమును ప్రసాదించి , మోక్షమునకు దారిచూపే ఈ ముద్రమాల ను వేసుకొను చున్నాను. ఈ క్షణము నుండి మదిని చెడగొట్టే మధు మాంసములను ముట్టను. దీక్షా కాలములో (భార్యను సైతం) స్త్రీలందరిని సోదరిగాను , తల్లిగాను తలచి మసలు కొంటాను. పెద్దల యెడల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తాను. ఇంకెవరి ప్రేరేపణయు లేక నాకు నేనే ఈ దీక్షలో ప్రవేశించి అందరిచే స్వామి అని పిలిపించుకొనే నేను ఈ దీక్షలోని విధి విధానములను ఉల్లంఘించి శ్రీస్వామి వారికి , ఈ దీక్షకు కళంకము వాటిల్లు రీత్యా వ్యవహరించను. మండలకాలం అనగా 41 దినములు దీక్ష పాటించిన పిమ్మటే ఆ పావన పదునెట్టాంపడిని ఎక్కుతానని సద్గురు సమక్షమున , దైవ సన్నిధిలో , ప్రమాణముచేసి ఈ ముద్రమాలను వేసుకొనుచున్నాను"* అని అందరికి అర్థమయ్యే శైలిలో ఈ మాలాధారణ మంత్రము యొక్క తాత్పర్యమును ఇందులోని పరమార్థ తత్వమును తెలిపి మాలాధారణ గావిస్తే మాలవేసుకొన్న వారు , మాలవేసిన వారు ఇరువర్గీయులు రక్షింపబడుతారు. ఇది ప్రతివారు ఆచరించ దగిన , ఆచరించ వలసిన ప్రధాన సూత్రమగును.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏