రాజా రాజా పందళరాజా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


రాజా రాజా పందళరాజా - నిను పంపానది తీరాన కొలిచెదయ్యా స్వామి అయ్యప్పో - శరణము స్వామి, అన్నదాన ప్రభువా - శరణము స్వామి


1. ఆ పంపా జలములోన తీపివి నీవే అడవిలోని జీవాల ఆటవి నీవే బంగారు కొండపైన వేదము నీవే పంజగిరులు ధ్వనియించే నాదము నీవే ॥స్వామి అయ్యప్పో॥ ||రాజా|| ॥స్వామి అయ్యప్పో॥


2. భూత దయను బోధించే కరుణామూర్తి భూతనాధ సదానంద శాంతామూర్తి ||స్వామి అయ్యవ్వ॥ ఇంద్రియములను జయించిన సుందర మూర్తి ఇరుముడులను స్వీకరించు దివ్యామూర్తి ||స్వామి అయ్యప్పో॥ ॥రాజా॥


3. రావణుని వాల్మీకిగా మలచినావయా వనములోని గణముగా నిలిపినావయా గురుపుత్రుని కరుణించిన శ్రీ గురునాధా మా నయనాల వెలుగులు నీవే కాదా ॥స్వామి అయ్యప్టో ||స్వామి అయ్యపో॥ ॥రాజా॥


4. తల్లిదండ్రులను పూజించు నీ భావమును గురువులను గౌరవించు నీ సేవలను కలియుగమును రక్షించే అభయహస్తము ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ ||స్వామి అయ్యప్పో॥ ||రాజా||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat