శ్రీ షణ్ముఖ స్వామి, నాగేంద్రునిగా కొలిచే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఒకే రూపమా?

P Madhav Kumar


*ప్ర : శివపార్వతీనందనుడైన శ్రీ షణ్ముఖ స్వామి, నాగేంద్రునిగా కొలిచే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఒకే రూపమా? కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?* 

 

 *జ :* కుండలినీ శక్తికి ప్రతీకగా నాగేంద్రుని ఆరాధిస్తున్నాం. యోగ, మంత్ర శాస్త్రాలను పరిశీలిస్తే - శివశక్తాత్మకమైనది కుండలిని. అది ఆరు చక్రాల నుండి ప్రసరించే చైతన్యం. ఇది 'షణ్ముఖస్వామి' గా దీపించే సర్పరూప చైతన్యం. పౌరాణికంగా కుమారస్వామి కొంతకాలం, ఒక 'వల్మీకం' లో సర్పరూపంగా తపస్సు చేసిన గాథ ఉంది. తదాది ఆయనను సర్పంగా ఆరాధించడం సంప్రదాయమయ్యింది.

 'సుష్ఠు బ్రహ్మణ్య' - 

సుబ్రహ్మణ్య వేద మంత్రములన్నిటి చేత సుష్ఠుగా (పరిపూర్ణంగా) తెలియబడే పరతత్వం - 'సుబ్రహ్మణ్యుడు'. వేద, యజ్ఞ, తపో, జ్ఞానాలకు 'బ్రహ్మము' అని పేరు. వాటిని శోభనముగా (చక్కగా) రక్షించువాడు సుబ్రహ్మణ్యుడు అని అర్థం. బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టికర్తననే అహంతో కుమారస్వామిని చులకనగా చూశాడు. ఆ అహాన్ని పోగొట్టేందుకు శివతేజ స్వరూపుడైన స్వామి బ్రహ్మను  బంధించాడు. తిరిగి శివుని మాటపై విడిచిపెట్టాడు. బ్రహ్మ బంధితుడైన కొద్ది కాలం - భూకాలమాన  ప్రకారం కొన్ని యుగాలు కుమారస్వామియే సృష్టిని నిర్వహించాడు. తద్వారా బ్రహ్మలోని అహంకారం శమించింది. దాంతో స్వామిని శరణు వేడి గురువుగా భావించాడు. శివాంకం పై కూర్చొని కుమారస్వామి బ్రహ్మకు ఉపదేశం చేసాడు. ఓంకారమే సుబ్రహ్మణ్యమనీ, 

 శివశక్త్యాత్మక పరబ్రహ్మ  పరబ్రహ్మ స్వరూపమే తాననీ ఈ అర్థమే 'సుబ్రహ్మణ్యనామం'లో ఉందని వివరించాడు. ఈ విషయాన్ని శివుడు కూడా ఉపదేశం పొందాడు. కుమారస్వామి శివునకు అభిన్నుడు.

 శివాంకం సమారుహ్య  

 సత్పీఠకల్పం

విరించాయ మంత్రోపదేశం చ కార॥ - అని ఈ ఘట్టాన్ని వివరించారు.

“ఓంకారార్థం  ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని వేదపాదస్తవనం.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat