Diwali : పర్యావరణ దీపావళి .. ఇలా చేసుకుందాం.. ఆనందాలను ఆస్వాదిద్దాం..

P Madhav Kumar

 


రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి తెలియజేయాలి. అలా చేయాలి అంటే ముందు మనం ఆచరించాలి. పెద్దవాళ్లు చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. పాటిస్తారు. వారికి మంచి చెడులు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది. 

Environmental Diwali : దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. ప్రస్తుతం దీపావళి పండుగ అంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం వాయు కాలుష్యం..శబ్ద కాలుష్యం. ఇప్పటికే భారత్ లో ఢిల్లీ, ముంబై వంటి రాష్ట్రాలు కాలుష్యకారకాలుగా మారిపోయాయి. మరి ముఖ్యంగా శీతాకాలం వచ్చింది అంటే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యకోరాల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంటుంది. దీనికి తోడు దీపావళి బాణసంచా కాల్పులతో మరింతా కాలుష్య కాసారంగా మారిపోతోంది. దీంతో సంతోషంగా…సంబరంగా చేసుకోవాల్సిన ఈ పండుగపై ఆంక్షలు విధించాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షాత్తు న్యాయస్థానాలే కల్పించుకుని దీపావళి పండుగపై ఆంక్షలు విధించాల్సి వస్తోంది.


దీపావళి పండుగ అంటే దీపాలు పెట్టుకోవటం..పిండివంటలు, కొత్త బట్టలు. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది బాణసంచా కాల్చుకోవటం. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. టపాసులు కాల్చుకోవటం వల్ల పర్యావరణానికి హాని..విపరీతమైన శబ్దకాలుష్యం. టపాసులు అంటే ఇప్పుడు ఎన్నో రకాల స్వదేశీ..విదేశీ టపాసులు తారాజువ్వల్లా దూసుకు వచ్చేశాయి. వీటితో పర్యావరణానికి హాని కలుగుతోంది. పర్యావరణానికి హాని కలుగని టపాసులు కూడా ఉన్నాయి.వాటిని వినియోగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉంది. అలా చేయాలి అంటే ముందు మనం ఆచరించాలి. పెద్దవాళ్లు చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. పాటిస్తారు. వారికి మంచి చెడులు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది.


గ్రీన్ క్రాకర్స్ కాల్చటం వల్ల కూడా కొంత కాలుష్యం కలుగుతుంది. కానీ మిగతావాటితో పోలిస్తే వీటి వల్ల కాలుష్యం తక్కువనే చెప్పాలి. గ్రీన్ క్రాకర్స్‌ని తక్కువ కాలుష్యం కలిగించే ముడి పదార్థాలతో తయారు చేస్తారు. గ్రీన్ క్రాకర్లు పేలినప్పుడు, అవి నీటి ఆవిరిని విడుదల చేస్తాయి, ఇవి దుమ్ము పైకి లేవనివ్వవు.


పర్యావరణ దీపాలు..

మట్టి ప్రమిదల్ని వాడితే పర్యావరణానికి హానికలుగదు. నువ్వుల నూనె , కొబ్బరి నూనె, నెయ్యి ఇలా ఏదైనా నూనె పోసి దీపాలు వెలిగించాలి. దీప కాంతులతో ఇంటిని అలంకరిస్తే ఇంట్లో ఆహ్లాదం కలుగుతుంది. శోభాయమానంగా వెలిగే దీపాలను చూస్తే మన మనస్సుకు చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు నూనెతో వెలిగించి దీపాలు చూస్తే కళ్లకు కూడా చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.


ఎలక్ట్రిక్ దీపాల వెలుగులకు, ఆర్టిఫీషియల్ ప్లాస్టిక్ దీపాలకు నో ఎలక్ట్రిక్ బల్బులు , ఎల్ ఈడీ బల్బులకు, డెకరేషన్ బల్బులతో వచ్చే వెలుగులు కళ్లకు హాని కలిగిస్తాయి. మట్టి ప్రమిదలతో నూనె పోసి పత్తితో చేసిన దూదితో చేసిన ఒత్తిలతో గానీ..వస్త్రంతో చేసిన ఒత్తిని గానీ వెలిగించాలి.


ఇంట్లో ఉన్న పిండి,పండ్లతో కూడా చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. గోధుమ పిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, నిమ్మ,బత్తాయి,నారింజ తొక్కలతో ప్రమిదలు,సముద్రపు గవ్వలతోనూ పర్యావరణానికి హాని కలిగించని దీపాలు వెలిగించుకుంటే చక్కటి ఆనందాల పండుగకు న్యాయం చేసినట్లవుతుంది.


వీటివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. చూసే వారికి కూడా ప్రత్యేకంగా..అందంగా కనిపిస్తుంది. పర్యావరణానికీ మేలూ కలుగుతుంది. పండుగ ఏదైనా..మనిషికి ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి తప్ప..మానవాళికి ప్రమాదాన్ని కలిగించేది కాకుడదే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat