కన్నతల్లి కనకదుర్గ కదలి రావమ్మా
నీవులేక నిమిషమైన నిలువలేవమ్మా
1. శాంభవి జగదాంబ శంకరీ
అంబిక అవతార గౌరి
కంబు గందరే అంబు జాక్షి
హిమగిరి పుత్రి కపాల మాల ధరీ
కన్నతల్లి కనకదుర్గ కదలి రావమ్మా
నీవులేక నిమిషమైన నిలువలేవమ్మా
2. పేదవారిని ఆశ్రయించే అక్షయంబగు
అన్నపూర్ణ సాదు జనుల కాచి బ్రోచే
కామ ధేనువుగా కల్పవృక్షముగా
కన్నతల్లి కనకదుర్గ కదలి రావమ్మా
నీవులేక నిమిషమైన నిలువలేవమ్మా
3. కంచిలో కామాక్షి నీవే – మధురలో మీనాక్షి నీవే
విజయవాడ కొండపైన
వెల సినావమ్మా మమ్ముల బ్రోవ రావమ్మా
కన్నతల్లి కనకదుర్గ కదలి రావమ్మా
నీవులేక నిమిషమైన నిలువలేవమ్మా