ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా
ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా
1. అంగజ మద సంహారా – ఆశ్రిత జన మందరా
గంగాధర ముదమారా – గౌరి వరరావేరా
అంగ దృత కురంగ వుషతురంగ, మంగళాధరా
ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా
2. అంజలిదేగైకోరా – ఆర్తిని బాప వదేరా
మంజుల భాష సుదీరా – మామక దోషనివారా
కంజ భవను తంజ దైత్య – భంజనా హరా హర
ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా
3. కుండలి భూష మహేశ – కుంజర ధనుజ వినాశా
చండిక హృదయ నివాసా – ఖండిత కాలుని పాశా
మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా
ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా
4. ఈక్షిత లక్షణ రావూ – ఇలవేల్పుడు వైనావూ
దాక్షిణ్యం బిడ రావూ – దాసుల మది నున్నావూ
ఈ క్షణంబు మోక్షమివ్వ, ప్రేక్ష మోక్ష నివ్వరా
ఓం హరా శంకరా హరహర ఓం హర శంకరా
వందనందిగంబరా వందితా పురంధరా
ఇందు ధర ధురంధరా – హిమాచలాగ్ర మందిరా