సీతారాముల సన్నిధిలో – దశావతారుని చేరువలో
సమాజ మంతా చేరండి – శ్రీరామ నామమే చేయుదుము
1. దశావతారుని కనరండి – దండిగా భజనలు చేయుదుము
పత్రం, పుష్పం, ఫలములతో ఘనముగ పూజలు చేయుదుము
సీతారాముల సన్నిధిలో – దశావతారుని చేరువలో
సమాజ మంతా చేరండి – శ్రీరామ నామమే చేయుదుము
2. ఏకాగ్రతతో పిలువుమురా – శ్రీరామ రామ యని పలుకుమురా
ఈ జగమంతా రామమయమని నిశ్చల మనస్సుతో నమ్ముమురా
సీతారాముల సన్నిధిలో – దశావతారుని చేరువలో
సమాజ మంతా చేరండి – శ్రీరామ నామమే చేయుదుము
3. హరే రామయని పలుకుమురా – శ్రీరామ రామ యని పిలువుమురా
హరియే రామ హరియే కృష్ణా – హరియే నారాయణుడండి
సీతారాముల సన్నిధిలో – దశావతారుని చేరువలో
సమాజ మంతా చేరండి – శ్రీరామ నామమే చేయుదుము
4. మనస్సుని పదిలము పరచండి మనుషులంతా యే ఒక్కటిగా
నమ్మని వారికి నరకమురా – నమ్మిన వారికి మోక్షమురా