_*అయ్యప్ప సర్వస్వం - 89*_ఎరిమేలి ధర్మశాస్తా ఆలయం - 1*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*ఎరిమేలి ధర్మశాస్తా ఆలయం - 1*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*ఎరుమేలి - పేటతుళ్ళల్  అను ఆటవిక నృత్యం*


శబరిమల యాత్ర చేసిన అయ్యప్ప భక్తులకు ఎరుమేలిలో ఆడే ఆటవిక నృత్యం , *"స్వామి ధింధికథోమ్" "అయ్యప్ప థింధికథోమ్"* అంటూ చిందులు త్రొక్కేక్షణాలు జీవితంలో మరుపురాని క్షణాలవి. ఇరుముడి కట్టిన తర్వాత గురుస్వామి వెంట బయలుదేరిన అయ్యప్ప భక్తులు దారిలోని క్షేత్రాలన్నింటినీ దర్శించి చివరగా చేరే స్థలమే *"ఎరుమేలి".* 48 మైళ్ళ కాలినడకను ఎన్నుకునే స్వాములకు ఇక్కడి నుండే వనయాత్ర మొదలవుతుంది. ఒకప్పుడు ఇక్కడి నుంచే నిర్జనమైన , క్రూరమృగాల ఆలవాలమైన అరణ్యం వ్యాపించి వుండేది. కానీ నేడు *"కాళకట్టి"* ఆశ్రమం వరకు జనావాసాన్ని చూడవచ్చు. ఒక రకంగా 'ఎరుమేలి'ని నాగరికతతో తృళ్ళి పడే నవీనతకూ , గంభీరంగా , నిశ్శబ్దంగా ధ్యాన ముద్రలా వుండే ప్రశాంతప్రకృతికీ మధ్యన నిలిచే వంతెనగాను భావించవచ్చు. భగవంతుని పూదోట *(పూంగా వనమ్)*  లోకి ప్రవేశించే *"సింహద్వారం"* గానూ భావించవచ్చు. అందుకే 'ఎరుమేలి'ని ఒకప్పుడు *"కోట్టవాదిల్"* అని పిలిచేవారు.


*"కోట్టవాదిల్"* అంటే మళయాళంలో *"కోటవాకిలి"* లేక *'సింహద్వారం'* అని అర్థం. పాప పుణ్యాలే ఇరుముడిగా దాల్చి తన శిరస్సున మోసుకొస్తున్నజీవుడిని మోక్షపు అంచుకు చేర్చే వనయాత్రలో దాటవలసిన మొదటి మజిలీ *'ఎరుమేలి'* అనే సింహద్వారం. అయ్యప్ప స్వామి శిష్యుడు , స్నేహితుడైన 'వావరు' స్వామి సమాధి స్థితిచెందిన తర్వాత ఒక స్మారక మందిరంగా (దర్గా) రూపం ధరించిన కట్టడం వున్నది ఇక్కడే. ఎరుమేలిలో ప్రవేశించే వారికి మొదటకుడివైపున 'వావర' దర్గా, కొద్దిగా ఎడం వైపున సింహద్వారం. వైపు పులివాహనుడై ధనుర్బాణాలతో నేత్రానందంగా వున్న *"పేట్టలో శాస్తా"* ఆలయమూ వున్నాయి. ఇక్కడి నుంచే మాలధరించిన స్వాములంతా రంగులు పూసుకొని , ఆటవికుల , వేషంతో చిందులు వేస్తూ బయలదేరి 'వావరు' సమాధి చేరుకొందురు. అచ్చట ముమ్మారు ప్రదక్షణం చేసి ఆనందంగా గంతులు వేస్తూ *"స్వామి థింధికథోమ్" "అయ్యప్ప ధింధికధోమ్"* అంటూ పాడుకుంటూ సుమారు ఒక కిలోమీటరు దూరం వున్న *"ఎరుమేలి పేట్టయిల్ శాస్తా"* సన్నిధిని చేరి ముమ్మారు ప్రదక్షణం చేసి , ఆలయానికి ముందున్న ఏటినీళ్ళలో స్నానంచేసేదరు.


తర్వాత ఆలయ ప్రవేశం చేసి ధనుర్బాణాలతో శత్రుసంహారానికి సిద్దపడుతున్న భంగిమతో నున్న అయ్యప్ప స్వామిని దర్శించు కుంటారు. ఇక్కడకు చేరుకున్న అయ్యప్ప భక్తులు మొదటగా చేయవలసిన కార్యక్రమం ఒకటుంది. *"ప్రాయశ్చిత్త కర్మం"* అంటారు. దీన్ని నలభైరోజుల వ్రతములో గానీ , యాత్రలో గానీ తెలిసీ , తెలియక ఎలాంటి తప్పులు చేసి వుండిననూ కరుణామయుడైన స్వామి కరుణించి తమ వనయాత్రలో తోడు వుండి కాపాడమని వేడుకొని తాంబూలంలో రూపాయి పావలా దక్షిణ నుంచి పేట్టలో శాస్తా" కు సమర్పించుకొందురు. అచ్చట యథాశక్తి గురుదక్షిణ చెల్లించు కోవడంతో ప్రారంభమవుతుంది *"పేట్టతుళ్ళల్"* అనే కార్యక్రమం. *"పేటతుళ్ళల్"* అంటే *"పేటలో చిందులు త్రొక్కడం"* అని అర్థం. అయ్యప్ప స్వామివారు మహిషీవధ చేసినది ఎరుమేలిలోనే అన్నది పలువురు విశ్వసిస్తున్న సత్యము. అందుకు "ఎరుమేలి" గ్రామం పేరే ఒక సాక్ష్యం. ఎరుమేలి అసలు పేరు అదికాదు. *"ఎరుమైకొల్లి"* అన్నదే దాని అసలు పురాతన నామం. తిరువనంతపురం గెజిట్లో వున్నది *"ఎరుమైకొల్లి"* అన్నపేరే. కానీ వందల సంవత్సరాల వ్యవహారంలో అది ఎరుమేలిగా రూపాంతరం చెందింది. *"ఎరుమైకొల్లి"* అంటే మలయాళభాషలో *"ఎనుమును చంపిన"* లేక *"ఎనుమును చూపిన స్థలం"* అని అర్థం. ఎనుమును సంస్కృతంలో *"మహిషి"* అంటారు. కాబట్టి మహిషిని చంపిన స్థలం కాబట్టి *"ఎరుమైకొల్లి"* గాను తర్వాత *"ఎరుమేలి"* గానూ రూపాంతరం చెందింది. ఇప్పుడు బస్సులు నిలబడుతున్న హైస్కూల్ గ్రౌండ్ ఒకప్పుడు మహిషావధ జరిగిన చోటు కనుకే అక్కడ ఎవరికీ దుకాణాలు గానీ , వేరే ఎలాంటి వ్యాపారవు ఏర్పాట్లకూ గానీ అనుమతించడం లేదనేది ఒక కారణంగా చెప్తారు. అప్పట్లో ఎరుమేలిలో ఒక్క అయ్యప్ప ఆలయం మాత్రమే వుండేది.


*"పేట్టలో శాస్తా"* ఆలయం (అయ్యప్ప పులివాహనుడై ధనుర్భాణాలతో సింహద్వారం పై వేంచేసి వున్నది) ఈ ఆలయం యొక్క నిర్వహణహక్కు , భాధ్యతలు *"పుత్తన్వీటుక్కారు"* అన్నకుటుంబానికి మాత్రమే వుంది. కారణం అప్పట్లో మహిషియొక్క అక్రమాలకు భయపడి రాత్రిళ్ళు ఎవరూ బైటికి వచ్చేవారు కాదట. పులి పాలకై అరణ్యానికి బయలుదేరిన అయ్యప్ప స్వామి రాత్రి కావడంతో ఇప్పుడు *“హైస్కూల్ గ్రౌండ్"* గా పిలవబడుతున్న స్థలంలోనే విశ్రమించగా , ఆ  రాత్రి మహిషీకి , అయ్యప్పకూ ఘోరపోరాటం జరిగి అయ్యప్ప మహిహిని వధించి ఒక పాడుబడిన బావిలోకి విసిరి వేశారట. ఆ భీకర పోరాట శబ్దాలకూ దగ్గరలోనే వున్న *"పుత్తని వీడు"* కుటుంబంలోని వృద్ధ స్త్రీ ధైర్యం చేసి బైటికి వచ్చి చూడగా మహిషీ వధం చేసిన స్వామిని చూసి ఈయన సాధారణ వ్యక్తిగాదని భావించి తర్వాత ఇంటిని నిర్భంధించి తీసుకెళ్లి పాలలో తడిపిన అటుకులతో ఆతిథ్యమివ్వగా స్వామి సంతసించాడనీ , మహిషీవధనం గుర్తుగా నిర్మించబడే ఆలయంలోని నిర్వహణా భాద్యతలు , ఆదాయంలో కొంతభాగం గ్రహించే హక్తు శాసన రూపకంగా వీరిక్విబడిందనేది చరిత్ర తెలుపుతోంది. ఈరోజుకీ ఈ హక్కు వీరికుంది. శబరిమల సన్నిధానంలో *'మకరసంక్రమణం'* రాత్రిస్వామివారి వీరత్వం గూర్చి పాడే ప్రత్యేక హక్కువీరికే వుంది.


*(సశేషం)*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat