🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శాస్తా యొక్క బాల లీలలు*☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
*బాల శాస్తా యొక్క గుణగణములు అందచందములు అతిశయం*
నూవురములు ధరించిన (అందెలు) కాళ్ళు గంభీర నడక కలిసి , విశాలమైన తొడలుగలిగి ,
దిగ్గజములు సైతం తలదిందుకొనేలా ఉన్నది. స్వామి ధరించిన నీలవర్ణపు వస్త్రంలోని రంగు ముందు కడలిలోని నీలపురంగు , ఆకాశములోని నీలిరంగు వెలవెలబోయినట. నడుముకి చుట్టబడిన
మువ్వలో ఓంకార శబ్దము ప్రతిఫలించెను. ఆ మణిమయఖచితమైన హారములను ధరించిన
కంఠము గంభీరమైన ఎదను , అంచు సయ్యాట ఆడు విధముగా అలంకరింపబడిన యజ్ఞోపవీతము కలిగి అందానికే అందము అను చెప్పు విధముగా శాస్తా గోచరించెను.
ఎదుటివారి ప్రతిబింబమును ప్రతిఫలించునట్లున్న నును లేతబుగ్గలు , ఎర్రని పెదవులు , ముత్యాలవంటి పలువరసను , అందు సూదిలాంటి నాసికను , కమలముల వంటి కన్నులు కలిగి నారాయణనుని జ్ఞప్తికి తెచ్చు విధముగా నుండెను. చంద్రవంక వలె నుండు తీరైన కనుబొమలు , అగ్నిగోళములవలె ప్రకాశించు కన్నులు గలిగియు , తండ్రిని మించిన తనయునిగా గోచరించినవి. దట్టమైన కారుమేఘముల నల్లదనము కలిగియున్న ఉంగరాల పోలు నుండు జీరాడు. కురులు
చూచుటకు రెండు కనులు చాలవు అన్నట్లు నుండెను. ముత్యములు , మాణిక్యములు , రత్న
వైఢూర్యములతో అలరారు స్వామి కిరీట కాంతి కోటి సూర్య ప్రభవవోలె నుండెను.
మరకత పచ్చరంగు గల మేని మెరయుచుండగా , దేవ , అసుర , యక్షగణములు స్తుతించుచుండగా
చేత మధురమైన క్షీరపాత్ర ధరించి , బాలునివోలె చిరునవ్వుతో , అయ్యప్ప అవతరించెను. మహా
తేజోమయమైన ఆ యొక్క దివ్యతేజ స్వరూపము చూసి , ఆ రూపము ఎన్నటికీ తమ కనులముందు నిక్షిప్తమై ఉండు కోరిక కలిగిన వారై అమిత ఆనందముతో స్వామిని స్తుతించినవారైరి.
పరబ్రహ్మ స్వరూపుడై , ముల్లోకములనూ పరిపాలించు నాయకుని వలె ప్రకాశించుచున్న
పరమాత్ముని చూచి , సకల దేవతలు , మునిగణములు కింద చెప్పిన విధంగా వేనోళ్ళ ప్రస్తుతించిరి.
*ఓం నమస్తే సర్వ శక్త్యాయ నిత్యాయ పరమాత్మనే |*
*పురుషా యాది బీజాయ పరేశాయ నమే నమః ||*
*తస్మై నమో నిర్మలాయ బ్రహ్మణే ఆనంద మూర్తయే |*
*నమో కిరాం విదూరాయ పరమాశ్చర్య కర్మణే ||*
*నమో నమస్తే అఖిల పాలకాయ సమస్త లోకాద్భుత కారణాయ |*
*నైష్కర్మ భావాయ సమస్త సాక్షీ భూతాయ భూతావళి నాయకాయ ||*
*ఆనంద రూపిణం శాంతం ఘోర సంసార తారకం |*
*సృష్టి స్థిత్యంత రూపం తం, శాస్తారం ప్రణతోస్యహం ||*
(భూతనాధోపాఖ్యానం)
అంటూ సకల దేవతలందరూ గుమిగూడి దేవాదిదేవుని శరణు గోరి పలువిధములుగా
స్తుతించిరి. సప్తఋషులందరూ వేదఘోష చేయుచుండగా , చతుర్వేదములకు నాయకుడైన బ్రహ్మదేవుడు ,
దేవాదిదేవునకు నామకరణము చేయ సంకల్పించెను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై అనేక రాక్షస సంహారము చేయువారిని కాపాడుటకై అవతరించిన బాలకునకు *'శాస్తా'* (బలిమి కలవాడై) అను నామకరణము గావించెను.
కేవలము ఒక్క నామమునకు మాత్రమే పరిమితుడుగాని పరబ్రహ్మ స్వరూపునకు సకల
లోకములూ పలు నామాలతో స్తుతించుచూ ప్రణమిల్లిరి.
బ్రహ్మ మొదలు దేవేంద్రుని వంటి దేవాది దేవతలచే కొనియాడబడినాడు గావున *'దేవోత్తముడూ'*
అంటూ అఖిల అండ చరాచర జగత్తుకు అధిపతియై , అందు నివసించు సర్వ భూత కోటిని రక్షించు నాయకుడు గావున *'శ్రీ భూతనాధుడు'* గానూ ,
స్థితికారకుడైన హరికి , లయకారకుడైన హరునకు జన్మించిన వాడు గావున హరిహరాత్మజుడు ,
హరిహరపుత్రునిగానూ ,
సకల తత్వ బోధకుడు , తత్వములన్నిటికీ అతీతుడు గావున *'పరాయ గుప్తుడు'* అంటూ అందరిచేతనూ కొనియాడబడినాడు.
శివశక్తుల చింతనను ఆకర్షించిన వాడున్నూ , తన తోబుట్టువులకు ప్రియ నేస్తముగానూ
అలరినాడు. భూతనాధునిగా పిలువబడినాడు కనుక , భూతగణముల భక్తికి పాత్రుడై వారి యొక్క
మన్ననలను అందుకున్నాడు.
మేరు పర్వతమునకు ఉత్తర దిశగా కొలువై యున్నది కైలాస సర్వతము. పలు కోట్ల యోజన దూరం విస్తీర్ణము గల ఆ పర్వతమునందు మణిమయ ఖచితములైన శిఖరములతో అలరారుచూ ,
సకల భూతగణములూ , పరివార దేవతలతోనూ , సదా భక్త జనులతోనూ కొలువబడు పార్వతి
దేవితో సదాశివుడు కొలువైయుండెను.
కైలాసగిరి యందు గల నూటొక్క మంచుకొండలలో అతి ముఖ్యమైన నాలుగు పర్వతలముల యందును గణపతి , కుమారస్వామి , భైరవుడు వంటి మూవురు శివుపుత్రునితో సమానముగా జననీ
జనకులైన ఉమాశంకరులు శాస్త్రాకి కూడా ప్రత్యేక స్థానము నొసంగిరి.
*ఏతాని స్పటికాపాణి రాజంతే శంకరాజ్ఞయా*
*అత్ర విఘ్నేశ్వర స్కంధౌ మహాశాస్తా చ భైరవః*
*వసంతి దేవ దేవస్య కుమారాః*
(స్కాందం)
పార్వతీ , పరమేశ్వరులు దేవాది దేవుడైన శాస్తాని తమ కంటిదీపంలా ఎంతో ప్రేమగా పెంచసాగిరి. శిరస్సు మొదలు పాదములవరకూ ఆభరణములు ధరించి సుతిమెత్తని పాదసవ్వడితో నడియాడు దేవాదిదేవుడు తన తల్లిదండ్రులతో ఎంతో మురిపెముగా పెరగసాగెను.
దినదానాభివృద్ధి నందుతూ తన ఆట పాటలతో అందరినీ ఆనందింపజేసెను. అందరి పిల్లల వలెనే ప్రభువు కూడా ప్రాకడం , నడయాడడడం వంటివి చేయుట చూసి అందరూ ముగ్ధులవసాగిరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*