శ్రీ మహాశాస్తా చరితము - 47 గజారూడుడైన శాస్తా

P Madhav Kumar

*గజారూడుడైన శాస్తా*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

*తన యొక్క మరుస్వరూపముగా ఆవిర్భవించిన తన పుత్రునికి తగిన వాహనము నొక దానిని తయారుచేయమని పరమశివుడు నందీశ్వరుని ఆజ్ఞాపించెను. అతడి ఆజ్ఞను శిరసా వహించిన నందీశ్వరుడు , సాక్షాత్తూ నాలుగు వేదములే రూపుదాల్చిన శ్వేత గజము కాక , మరియొక నలుపు రంగు రూపుదాల్చిన గజమును ఇచ్చెను. ఈశ్వరుని కోరిక ప్రకారము శక్తివంతమైన ఏనుగునొకదానిని వాహనముగా ఇచ్చెను. అండ బ్రహ్మాండములను పరిపాలించు స్వామి యొక్క వాహన పదవి దానికి లభించినది. ప్రణవస్వరూపమైన ఆ గజమును స్వామి తన వాహనముగా చేసికొనెను.*

దేవతలు , త్రిమూర్తులు సైతము స్తుతించు మూర్తి అధిరోహించుటచే ఆ గజము దేవతలు ,
మునులకు సైతము వందనీయమైనది. బ్రహ్మదేవుని సృష్టికాలము నిలచిపోయి , ప్రపంచమునకు చిట్టచివరిదగు ప్రళయము ఏర్పడునపుడు పంచభూతములు అన్నియూ సమసిపోవును. సప్తసముద్రములు పొంగిపొర్లును. అయిననూ లోకనాయకుడైన శాస్తా గంభీరముగా కొలువైయుండగా , అతడు పర్యవేక్షించుచూ వచ్చు వాహనమైన గజము తన తొండముతో ప్రళయకాలమున వెల్లువై
ప్రవహించు జలమును పీల్చుకొనుచూ చిత్తమును స్వామియందుంచి ప్రజలను కాపాడును. ఇంతటి మహిమాన్వితమైనది స్వామియొక్క గజవాహనము.

ఇటువంటి పరిస్థితిలో ఒక సంఘటన జరిగినది. సాహసం అను ద్వీపమును ప్రభాకరుడను
రాజు పరిపాలించసాగెను. అతడికి కుమారులు నలుగురు. వారు పార్వతిదేవిని , స్కందుని , మహాశాస్తాని ఆరాధించు భక్తులు. వారికై తపస్సు చేయుచుండగా బ్రహ్మ , విష్ణు వాహనములైన
హంస , గరుడుడు చేసిన భగ్నము కారణముగా తపస్సు భంగమై , శాపవశమున భూతములై స్వామి నివసించు ఆవరణకు సమీపముననే సంచరించుచుండిరి.

వీరి నలుగురిలో *'తారకుడు'* అనేవాడు మహాశాస్తా యందు అమితభక్తిగలవాడు.

ఒకసారి అమరులకు , అసురులకు మధ్య ఘోరమైన యుద్ధము జరిగెను. అసురుల ధాటికి
తట్టుకొనలేని అమరులు , ఈ భూతముల సాయము కోరెను. ధర్మము కాపాడు నిమిత్తము , ఈశ్వరుని
అనుజ్ఞ తీసికొనకయే దేవతల పక్షమున నిలచి పోరు సలిపి , అసురులను జయించి , అమరావతిని దేవతల కైవసము చేసిరి. అసురేంద్రుడు ఈశ్వరుని వద్దకు పోయి , ఈ భూతములు తమ
కులనాశనము చేసిన విధమును తెలిపెను. తప్పు ఎవరు చేసిననూ దండించు స్వభావముగల
పరమశివుడు ఇది విని మండిపడెను. భూతములను పిలిపించి మా ఆజ్ఞ లేనిదే , అసురులను వధించిన కారణముగా మీరు రక్కస కులమునుండి అమరుల చెంత చేరుదురుగాక అని శపించెను.

*(ఈశ్వరుని అవమానించి దక్షుడు గావించిన హవిర్ భాగమును గ్రహించిన పాపమునకు ఇందుమూలముగా దేవతలకు ఫలము చేకూరినది.)*

ఇందులకు దుఃఖించిన వారు , దీని కంతటికీ కారణము , తమ తపస్సులకు భంగము కావించిన హంస , గరుడులపై కోపముబూని , తమ పగ తీర్చుకొను సమయమునకై వేచి యుండిరి.

ఒకనాడు శివతాండవ సమయమును పరమశివుని చూచుటకై కుమారస్వామి , శాస్తా అచటికి ఏతెంచిరి. భూతరూపమున నున్న నలుగురూ తమ వాహనముల చెంతకు పోయి హంస , గరుడులు
వారిని అపహాస్యము చేయునట్లుగా తెలిపిరి. కోపవశమున ఇంగితము మరచిన వారు  హంస ,
గరుడులను వధించిరి.

కుమారస్వామికి విషయము తెలిసి అచ్చటికి వచ్చెను. *“భూతములారా మీరు
తపము చేయనెంచిన యత్నము ఉన్నతమైనదే , కానీ ఇప్పుడు మీరు చేసిన విధము తప్పైనది. కాబట్టి మీరు అసురులుగా జన్మించి , మా యొక్క అనుగ్రహము వలన ఉన్నత పదవిని పొందుదురుగాక అనెను.

శాస్తాయందు అమితమైన భక్తి కలవాడై భూతరూపమున నున్న తారకాసురుడు ప్రార్థించగా , అసురునిగా జన్మించి , స్కందుని యొక్క వేలాయుధముచే మరణించిన పిదప , ముందుగానే కోరుకున్నట్లుగా తన వాహనముగా ఉండునట్లుగా శాస్తా వరమును ప్రసాదించెను. వాహన ప్రాప్తిని పొందిన అతడు దానిని గ్రహించక , తప్పిదము గావించినందువలన తన వాహనమును , వాహన
పదవి కోల్పోవునట్లుగా స్వామి ఆజ్ఞాపించెను.

మునుపు తన సోదరుని యొక్క తపస్సును భంగము కలిగించిన కారణముగానూ , ప్రస్తుతము దేవలోకమునకు కీడు కలిగించిన కారణమువలనను స్వామి యొక్క గజవాహనము వలెనే స్కందుని కోడిపుంజు , నెమలియూ , దుర్గాదేవి యొక్క సింహమూ , తమ తమ వాహన పదవులను కోల్పోయినవి.
*(తరువాతి కాలమున అవన్నియూ తమ తమ తప్పిదములు గ్రహించి , ఈశ్వరుని ప్రార్థించి నందీశ్వర స్వామి యొక్క సారూప్యముక్తి పొందినవి)*

తరువాత ప్రభాకర మహారాజు పుత్రులు నలుగురూ , కాశ్యప మహాముని , మాయ దంపతులకు పుత్రుడుగా జన్మించిరి. సూరుడు , పద్ముడు సూరపద్ములుగానూ , సింహము సింహముఖాసురునిగానూ
జన్మించిరి. తారకుడు గజవాహనునిగా మారుటకై తారకాసురునిగా జన్మించెను.

అష్టదిక్పాలకులను సైతము పాదాక్రాంతులను చేసికొనుబలము. శక్తిగల తారకుడు చివరకు
సుబ్రహ్మణ్యస్వామి యొక్క వేలాయుధము చేత వధింపబడినాడు. మునుపు పొందిన వరము
కారణముగా గజాకృతి పొంది , మహాశాస్తాని శరణు పొందిన వాడాయెను. స్వామియూ , తాను
వరము అనుగ్రహించినట్లుగానూ , అతడిని తన గజవాహనముగా చేసికొని , మదగజవాహనునిగా
అధిరోహించి ప్రబలమొందెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat