పల్లవి :- ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా.
చరణం:- ఆవుకు రంగులు ఉన్నవిగాని
పాలకు రంగులు ఉన్నాయా
ఆవు వంటిదే నీ ఆత్మ పాలవంటిదే పరమాత్మ.
చరణం:- చెరుకుకు వంకలు వున్నవిగాని
తీపికి వంకలు వున్నాయ
చెరకు వంటిదే నీ ఆత్మ తీపివంటిదే పరమాత్మ.
చరణం:- పూలకు రంగులు ఉన్నవిగాని
పూజకు రంగులు ఉన్నాయా
పూలవంటిదే నీ ఆత్మ పూజవంటిదే పరమాత్మ.
చరణం:- యేటికి వంపులు వున్నవిగాని
నీటికి వంపులు వున్నాయ
నీటివంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ.
చరణం:- భజనకు హంగులు ఉన్నవికాని
భక్తికి హంగులు ఉన్నాయా
భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ.