Diwali Crackers: 400 ఏళ్ల క్రితం టపాకాయలు ఎలా పేల్చేవారో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే చూసేయండి..

P Madhav Kumar


Diwali: ఇప్పుడంటే రసాయనాలతో రకరకాల మోడళ్లలో బాంబులు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశంలో రంగు రంగుల తారలను విరజిమ్మే రాకెట్ బాంబులు,

Diwali Crackers: 400 ఏళ్ల క్రితం టపాకాయలు ఎలా పేల్చేవారో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే చూసేయండి..
Bombs 

Diwali : ఇప్పుడంటే రసాయనాలతో రకరకాల మోడళ్లలో బాంబులు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశంలో రంగు రంగుల తారలను విరజిమ్మే రాకెట్ బాంబులు, ఎలక్ట్రిక్ బాంబులు, రకరకాల తారాజువ్వలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. టెక్నాలజీ, వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. డిఫరెంట్ డిఫరెంట్ క్రాకర్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. ముఖ్యంగా చైనా బాణాసంచా యావత్ ప్రపంచాన్ని ఆవహించింది. ఇప్పుడు ఇలా రకరకాల క్రాకర్స్ అందుబాటులో ఉండగా.. మరి 400 ఏళ్ల క్రితం క్రాకర్స్ ఎలా ఉండేవో తెలుసా? అప్పుడు టపాసులు ఎలా తయారు చేసేవారో తెలుసా? 400 ఏళ్ల క్రితం టపాకాయలు ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం..

మట్టితో 400 ఏళ్ల క్రితం వినియోగంలో ఉన్నటువంటి పటాకులను తయారు చేశారు వడోరదకు చెందిన కొందరు వ్యక్తులు. వడోదర జిల్లాలోని కుమ్హర్‌వాడ, ఫతేపూర్‌లో మట్టిని ఉపయోగించి పటాకులు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న కొంతమంది హస్తకళాకారులు నివసిస్తున్నారు. వీరు మట్టితో సంప్రదాయ పటాకులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీటిని మంకీస్ అని పిలుస్తారు. అయితే, చైనా బాణాసంచా భారతీయ మార్కెట్లను ముంచెత్తిన నేపథ్యంలో.. సుమారు రెండు దశాబ్దాలుగా ఈ సంప్రదాయ బాణాసంచా ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, తాజాగా ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ అనే ఎన్జీవో నాలుగు శతాబ్దాల నాటి ఈ కళ పునరుద్ధరణకు తోడ్పాటునందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’ ను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ యుగయుగాల కళకు మళ్లీ జీవం పోసేందుకు ఎన్జీవో కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం వలన ఈ పురాతన కళారూపాన్ని కొత్త తరానికి తెలియజేయడమే కాకుండా.. ఉపాధిని కూడా అందిస్తుంది.

ప్రముఖ్‌ పరివార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నిటల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఈ బాణసంచా 100 శాతం దేశవాళీ, మట్టితో తయార చేసే పర్యావరణ హిత పటాకులు అని తెలిపారు. ఈ బాంబులను కుమ్మరివారు తయారు చేస్తారని, పేపర్, వెదురును ఉపయోగించి తయారు చేస్తారని చెప్పుకొచ్చారు. ఇవి పూర్తిగా పర్యావరణహితమైన, సురక్షితమైన బాంబులని పేర్కొన్నారు. తమ ఎన్జీవో థీమ్ ‘వోకల్ ఫర్ లోకల్’ అని స్పష్టం చేశారు.

హస్తకళాకారుడు రామన్ ప్రజాపతి మాట్లాడుతూ.. మళ్లీ పూర్వకళకు జీవం పోసేందుకు ప్రయత్నరిస్తున్న ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ వారికి క‌ృతజ్ఞతలు తెలిపారు. ఈ మట్టి బాంబులు చాలా సురక్షితమైన, పర్యావరణ హితమైనవి అని చెప్పారు. 400 ఏళ్ల క్రితం ఈ విధంగా పటాకులు తయారు చేసేవారని చెప్పారు. వనరులు అందుబాటులో ఉంటే సీజన్‌కు 1 నుంచి 5 లక్షల వరకు మంకీ బాంబులను తయారు చేయగలమని రామన్ తెలిపారు. ఏదిఏమైనా.. చైనా బాణాసంచాతో కాలుష్యపూరితమవుతున్న వేళ.. 400 ఏళ్ల నాటి భారతీయ సంప్రదాయ కళ మరోసారి వెలుగులోకి రావడం అనేది గొప్ప విషయమే అని చెప్పాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat