Diwali Special: దీపావళి ఎలా వచ్చింది..? ఏమిటా కథ..?

P Madhav Kumar


దీపావళి పండుగను.. పెద్దలు, చిన్నలు.. అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు.. పెద్దలు పూజలు, నోముల్లో నిమగ్నమైపోతే.. చిన్నారులు మాత్రం.. హుషారుగా టపాసులు కాల్చుతూ.. స్వీట్లు తింటూ.. మూడు రోజుల పాటు.. ఎంతో జోష్‌తో సెలబ్రేట్‌ చేసుకుంటారు.. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే, దీపావళి పండుగ ఎలా వచ్చింది.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ వెనుక ఉన్న కథలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..

నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షసలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి, కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. అయితే, జనకమహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. ఆ తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు.

ఇక, కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు.. తన రాజ్యంలోని ప్రజలందరిని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచాయి.. అయితే, ద్వాపరయుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో పరిచయం అయ్యింది.. అది కాస్తా స్నేహ్నంగా మారింది.. అయితే, బాణాసురుడు.. స్త్రీలను తల్లిలాగ భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు.. ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపేసేస్థాయికి వెళ్లింది.. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు. అలా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను, దేవమాతను అవమానించాడు..

అక్కడే.. అసలు కథ ఆరంభమైంది.. నరకాసురుడు వ్యవహార వైశైలిపై దేవతలు.. విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వివరించారు.. నరకుని సంహరించమని ప్రార్థిస్తారు. ఇక, అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ, ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో వెళ్తారు.. అక్కడ శ్రీ కృష్ణుడికి నరకాసురునికి మధ్య ప్రారంభమైన యుద్ధం.. ఉగ్రరూపం దాల్చుతుంది.. కానీ, విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడదు.. దీంతో, యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్లు నటిస్తాడు.. అయితే, తన కళ్ల ముందే భర్త మూర్ఛపోవడాన్ని చూసి సత్యభామదేవి ఎక్కడలేని కోపాన్ని తెప్పిస్తుంది.. వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణం వేస్తుంది. దీంతో.. నరకాసురుడు తల్లి చేతిలోనే మరణిస్తాడు. అలా నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు.. ఆ రోజు అమావాస్య కావడంతో.. వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని.. అప్పడి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తుంటారు..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat