నైవేద్యం
May 29, 2020
నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధము. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.
ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుడి పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు
సంపుఉర్నంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
Tags