దీపారాధన , Deepaaraadhana , Light worship

P Madhav Kumar




దీపారాధన - ఆనందాలకు ఆహ్వానాలు
'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. దీపావళిలో ఎన్నో జ్యోతిర్లింగాలు!

లక్ష్మీదేవిని దీపజ్యోతిగా, జ్యోతిని లక్ష్మీమూర్తిగా భావించిన ఉపాసనాశాస్త్రం మనకు ఉంది. లక్ష్మి శ్రీ- అనే మాటకు 'కాంతి, శోభ' అని అర్థాలు. అందుకే దీపకళికను లక్ష్మీరూపంగా భావించడం, దీపరాత్రిని లక్ష్మీపూజకు ప్రధానంగా వ్యవహరిస్తారు. అందునా- ఆనందం, ఐశ్వర్యం- అనే భావనకు ఒక దేవతారూపాన్నిస్తే- అదే 'లక్ష్మీదేవి'. ఆ దివ్యభావనను అనుసంధానించడమే దీపోపాసనలోని పరమార్థం. ఐశ్వర్యం, ఆనందం మెండుగా ఉన్నప్పుడు ముఖం 'వెలిగి'పోతుంది. ఈ వెలుగును కొలుచుకోవడమే దీపావళి శోభ. ధనలక్ష్మీ ఆరాధనతో దీపలక్ష్మిని పూజించడం ఈ పండుగనాటి ప్రత్యేకం.

నరక చతుర్దశితో మొదలుపెట్టి క్రమంగా దీప మహోత్సవం కార్తీక పూర్ణిమ వరకు కొనసాగుతుంది. నరకబాధల్ని పోగొట్టే పర్వం- 'నరక చతుర్దశి'. ఈ పేరు కృష్ణావతారానికి ముందు నుంచి ఉన్నదే. నరులను వేదనకు గురిచేసే దురవస్థను 'నరకం'- అంటారు. ఆ దురవస్థను పారదోలే పర్వదినాలు నరక చతుర్దశి, దీపావళి. ఈ రెండు పర్వదినాల్లో ప్రాతఃకాలం అభ్యంగస్నానం చేయాలి- అని శాస్త్ర నిర్దేశం. జలంలో గంగ, తైలంలో లక్ష్మీ- సన్నిహితులై ఈ రెండురోజుల్లో ఉంటారనీ; కనుక తైలాభ్యంగం, ఉష్ణజల స్నానం గంగా పవిత్రతనీ, లక్ష్మీకృపనీ ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాల మాట.

శ్రీకృష్ణపరమాత్మ నరకాసుర సంహారం చేసిన తరవాత, ఈ 'నరక చతుర్దశి' మరొక నామసార్థక్యాన్ని పొందింది. ఇంకొక ప్రశస్తి జత అయింది. కానీ దానికి పూర్వమే 'నరక చతుర్దశి' నామం ఉందని గ్రహించాలి.

దీపావళినాడు 'యమతర్పణం' వంటి విధులనూ చెప్పారు. జ్యోతిర్విజ్ఞానం ప్రకారంగా అమావాస్యకు పితృదేవతలు అధిపతులు. విశేషించి ఆశ్వయుజ అమావాస్య వారికి ప్రీతి. 'ఈ పితృదేవతలు 31 గణాలుగా ఉంటాయి. మన పూర్వీకులను భక్తితో ఆరాధిస్తే ఈ పితృ దేవతలు సంతోషించి- పూర్వీకులు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా వారిని ఆనందపరచడమే కాక, తనవారిని తలచుకున్న ఆరాధికుల కృతజ్ఞతాభావానికి సంతోషించి దీవెనలందిస్తారు'- అని పురాణ విజ్ఞానం.

తాత ముత్తాతలు నరకం వంటి దుర్గతులకు పోకుండా, జ్యోతిర్మయమైన ఆనంద లోకాలకు చేరాలి- అనే భావంతో దీపాలు, ఉల్కజ్వాలలు వెలిగించి చూపించడం వంటివి ఈ రోజున చేస్తుంటారు. ఒకవైపు పూర్వతరాలను తలచుకోవడం, మరొకవైపు ఐశ్వర్యాధి దేవతను పూజించడం, ఇంకోవైపు వేడుకల్లో తేలియాడటం- ఈ కాంతిపర్వంలోని కళలు. 'ఆ లక్ష్మీ నివాసం' పేరుతో దివ్వెలు వెలిగించడమేకాక, డప్పులు కొట్టి చప్పుళ్లు చేయడం ప్రాచీనకాలంలోని ఆచారం. ఆ చప్పుళ్ళే బాణసంచాధ్వనులుగా, కాంతిలీలలుగా క్రమంగా ఆవిష్కృతయ్యాయి.

విజయోత్సవాల్ని బాణసంచాతో జరుపుకోవడం- ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో భాగం. అంటే ఇది మానవుల్లోని వినోద స్వభావమన్నది స్పష్టం. పారలౌకిక భావనలను అలా ఉంచి, దుఃఖానికి ప్రతీకలైన నరకమార్గాలను, అలక్ష్మిని పరిహరించి, సుఖస్వరూపమైన దివ్యత్వాన్ని సంతరింపజేసుకోవడమే ఈ దీపపర్వంలోని విశిష్టత.


దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?, Worshiping with Light How?



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
  • దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?-సిద్దాంతి డా వి.జి.శర్మ

చాలామంది భక్తులు ఏ దైవారధనకు ఎన్ని వత్తుల దీపాన్ని వెలిగించాలి, ఏ వారం, ఏ సమయంలో దైవారధన చేయాలి అనే విషయాల్లో సందిగ్ధతతో సతమతమవుతుంటారు. వారికోసమే ఈ శీర్షిక... క్రింద చూపబడినట్లుగా దైవారధన చేసి భగవంతుని కృపను పొందండి.


వత్తులు--------వారము-------శుభగడియలు-------జరుపవలసిన పూజ----------పండుగ

ఏక వత్తి--------ఆదివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -రథసప్తమి, దీపావళి
ద్వి వత్తులు ---- సోమవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- శివపార్వతుల పూజ -శివరాత్రి
త్రి వత్తులు----- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు - దత్త పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుష్ఠ వత్తులు- బుధవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -గురుపౌర్ణమి
పంచ వత్తులు-- సోమవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం- దత్తజయంతి
షణ్ముఖ వత్తులు- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- సుబ్రహ్మణ్య పూజ- సుబ్రహ్మణ్య షష్ఠి
సప్త వత్తులు--- శనివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -దీపావళి
అష్ఠ వత్తులు--- ఆదివారం - ఉ 4.30 గం నుండి 6 గం లోపు- వినాయక పూజ - వినాయక చవితి
నవ వత్తులు-- శుక్రవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - దుర్గాదేవి పూజ -నవరాత్రులు
దశ వత్తులు-- బుధవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - రుద్రాభిషేకం -తొలి ఏకాదశి
ఏకాదశ వత్తులు- సోమవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -శివరాత్రి
ద్వాదశ వత్తులు- ఆదివారం - ఉ 6 గం నుండి 7 గం -లోపుసూర్య పూజ -రథసప్తమి
త్రయోదశ వత్తులు- మంగళవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు-సుబ్రహ్మణ్య పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుర్దశ వత్తులు- మంగళవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు -ఆంజనేయ పూజ -హనుమజ్జయంతి




జన్మనక్షత్రం - వెలిగించాల్సిన వత్తులు


నక్షత్రం ----------వత్తులు
అశ్వని ---------నవ వత్తులు
భరణి --------- షణ్ముఖ వత్తులు
కృత్తిక-------- ఏక లేదా ద్వాదశ వత్తులు
రోహిణి------- ద్వి వత్తులు
మృగశిర----- త్రి వత్తులు
ఆరుద్ర------ అష్ఠమ వత్తులు
పునర్వసు-- పంచమ వత్తులు
పుష్యమి---- సప్తమ వత్తులు
ఆశ్లేష------ చతుర్‌ వత్తులు
మఖ------ నవ వత్తులు
పుబ్బ----- షణ్ముఖ వత్తులు
ఉత్తర ----- ఏక లేదా ద్వాదశ వత్తులు
హస్త------ ద్వి వత్తులు
చిత్త ------ త్రి వత్తులు
స్వాతి----- అష్ఠ వత్తులు
విశాఖ----- పంచ వత్తులు
అనూరాధ-- సప్త వత్తులు
జ్వేష్ఠ ------ చతుర్‌ వత్తులు
మూల----- నవ వత్తులు
పూర్వాషాఢ- షణ్ముఖ వత్తులు
ఉత్తరాషాఢ-- ఏక లేదా ద్వాదశ వత్తులు
శ్రవణం----- ద్వి వత్తులు
ధనిష్ఠ------ త్రి వత్తులు
శతభిషం --- అష్ఠ వత్తులు
పూర్వాభాద్ర- పంచ వత్తులు
ఉత్తరాభాద్ర-- సప్త వత్తులు
రేవతి------ చతుర్‌ వత్తులు

పై విధంగా జన్మనక్షత్ర రీత్యా దైవారాధన చేసినట్లయితే... సకల శుభాలు కలిగి సుఖ సౌఖ్యాలు పొందుతారు.



దీపారాధన-వెలిగించవలసిన వత్తులు,Lights Prayer-Number of threads used



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే
విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --దీపారాధన-వెలిగించవలసిన వత్తులు-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



  • నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

* దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
* వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.

  • జన్మ తేదీల రీత్యా... వెలిగించవలసిన వత్తులు

1. మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20 వరకు - (5) పంచవత్తులు
2. ఏప్రిల్‌ 21 నుండి మే 20 వరకు - (7) సప్తవత్తులు
3. మే 21 నుండి జూన్‌ 20 వరకు - (6) షణ్ము వత్తులు
4. జూన్‌ 21 ఉండి జూలై 20 వరకు - (5) పంచముఖి వత్తులు
5. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు - (3) త్రివత్తులు
6 ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20 వరకు - (6) షణ్ముఖ
7. సెప్టెంబరు 21 నుండి అక్టోబర్‌ 20 వరకు - (7) సప్త వత్తులు
8. అక్టోబర్‌ 21 నుండి నవంబర్‌ 20 వరకు - (2) ద్వి వత్తులు
9. నవంబర్‌ 21 నుండి డిసెంబర్‌ 20 వరకు - (5) పంచమ వత్తులు
10. డిసెంబర్‌ 21 నుండి జనవరి 20 వరకు - (6) షణ్ముక వత్తులు
11. జనవరి 21 నుండి ఫ్రిబవరి 20 వరకు - (5) షణ్ముక వత్తులు
12. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు - (2) ద్వి వత్తులు



  • అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు

1. 1.10.19 - 1 (ఏక లేదా ద్వాదశ వత్తులు)
2. 2.11.20 - 2 ( ద్వి వత్తులు)
3. 3.12.21 - 5 ( పంచమ వత్తులు)
4. 4.13.22 - 8 (అష్టమ వత్తులు)
5. 5.14.23 - 4 (చతుర్‌ వత్తులు)
6. 6.15.24 - 6 (షణ్ముఖ వత్తులు)
7. 7.16.25 - 9 (నవ వత్తులు)
8. 8.17.26 - 7 (సప్త వత్తులు)
9. 9.18.27 - 3 (త్రి వత్తులు)



  • నవరత్నములు ధరించని వారు వెలిగించవలసిన వత్తులు....

1. కెంపు - 1 ఏక వత్తి లేదా 12 ద్వా దశ వత్తులు
2. ముత్యము - 2 ద్వి వత్తులు
3. పగడము - 3 త్రి వత్తులు
4. జాతిపచ్చ - 4 చతుర్‌ వత్తులు
5. కనకపుష్యరాగం- 5 పంచవత్తులు
6. వత్రము - 6 షణ్ముఖ వత్తులు
7. ఇంద్రనీలము- 7 సప్త వత్తులు
8. గోమేధికము - 8 అష్ట వత్తులు
9. వైఢ్యూర్యము - 9 నవ వత్తులు



  • సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు

1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి
2. మానసిక రోగములు నివారణకు- 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్‌ వత్తుల
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తుల
14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తుల



  • వెండి దీపాలతో దీపారాధన వలన కలిగే ఫలితాలు.....
1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.
2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat