హోమము : మనలోని మలినాన్ని ప్రకృతి సహజము గా తొలగించే విధానాలలో హోమము ఒక పద్దతి . హోమము - దైవప్రీతి, దైవానుగ్రహము, గ్రహశాంతి మొదలైన వాటికోసము అగ్ని లో మూలికలు, నెయ్యి హోమద్రవ్యాలు వేస్తూ చేసే క్రతువు. క్రతువంటే యజ్ఞము .
యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడము యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి"(వేసినవి) అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
పంచభూతాలలో అగ్ని ఒకటి . ఇది ప్రకృతి సహజముగా లభించే శక్తి అయినా కాలక్రమేనా అగ్నిని రాజేయడం మనిషి కనుక్కునాడు . సుదూరములో ఉండే అగ్ని గోళాన్ని ఆరంభమునుండీ గమనించిన మానవుడు ఈ భూలోకాన్నంతా నడిపిస్తున్న ప్రత్యక్ష దైవము గా సూర్యభగవానుని కొలిచే సాంప్రదాయాన్ని ఆనాడే ఆరంభించాడు . గోళమైనా సూర్యుని ... తెలియక , అంతపాటి శాస్త్రవిజ్ఞానము లేక దేవునిగా కొలిచేడు ... ఆరాదించాడు . సూర్యోదము , సూర్యాస్తమయము రెండూ ఎన్నిసార్లు చూసినా తనివితీరని అపురూప దృశ్యాలే ... ఆ మధురమైన దృశ్యాన్ని తిలకిస్తూ తమ జీవితాలకు ఆధారంగా నిలుస్తున్న ఆ భగవంతునికి ఉదయం , సాయంత్రం సమయాల్లో నమస్కరించి దన్యవాదాలు తెలియజేయడం మానవుని కనీస ధర్మముగా భావించాడు . అలా ప్రారంభమయినదే సూర్యనమస్కార సంప్రదాయము . రెండుపూటలా ప్రతిరోజూ చేయడం శరీరానికి మంచి వ్యాయమము ఎంతో ఆరోగ్యదాయకము . ఏ రోగము దరిచేరదు .
సూర్యుని నుండి ఉష్ణము , కాంతి అందుకునే మానవునికి దానికి మూలమైన అగ్నిని అర్ధము చేసుకునేందుకు కొంచం సమయం పట్టినది . అడవులలో చెట్ల రాపిడికి పుట్టి అడవులనే దహించివేసి భీబత్సవాన్ని సృస్టించిన అగ్నిని చూసి భయపడి దానికి దేవతా స్థానము కల్పించి పూజించడం ప్రారంచాడు ... తన ఇంట వెలుగునిచ్చే దేవుడిగా ప్రార్ధనలు చేసి కొలువసాగాడు . ఇంటనే హోమాలను నిర్వహించడం మొదలుపెట్టేడు . హోమములో ఎటువంటి పుల్లలు వాడాలి .. వాటి ప్రయోజనం ఏవిటి అనేది కాలక్రమేనా అర్ధము చేసుకున్నాడు . ఆ విధంగా హోమము హిందూధర్మ శాస్త్రము లో ఒక సంస్కృతి ... సాంప్రదాయం గా మారినది .
హోమ సామగ్రి :
హోమము చేయడం అనేది చాలా సులభమే . వాడె వస్తువులు సులువుగా దొరికేవే .
- పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర ,
- ఆవు పిడకలు ,
- స్వచ్చమైన ఆవు నెయ్యి ,
- పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము),
- సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు),
- ఎండు మామిడి పుల్లలు ,
- కర్పూరము ,
- పూజా సామగ్రి ,
- తాటాకుల విసనకర్ర ,
- ఔషద మొక్కలు , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని ,
హోమ శక్తి : ఔషధ ఉపయోగాలు :
హోమము చేయడం ఛాందసవాదం గా కొంతమంది పరిగణిస్తారు . కాని వాస్తవానికి దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము .
- హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు .
- హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి .
- హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి ,
- మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది ,
- ప్రదక్షిణలు చేయడం ఒకరకమైన వ్యాయామము వలన ఉపయోగము ,
- చర్మాన్ని మెరుగుపరుస్తుంది ,
- రక్తాన్ని శుబ్రపరుస్తుంది ,
- మెదడు కణాలకు కొత్త శక్తినిస్తుంది ,
- శరీరములో ఉన్న రోగకారక సూక్ష్మజీవులను సంహరిస్తుంది ,
- హోమము నుండి వచ్చే వాయులులు పీల్చడం వలన ఊపిరితిత్తులు సుద్ది అవుతాయి ,
హోమము వలన కలిగే నష్టాలు:
- మితిమీరిన పొగ వలన కలిగే అనారోగ్యము ... ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ప్రాణ సంకటమే ,
- పొగవలన కళ్ళు మండటము , ఎర్రబారిపోవడమూ జరుగును ,
- ఎక్కువ వేడి తగిలి చర్మము కందిపోవడము ,
- నెయ్యి ,పేడ , బూడిద లో కూదినటువంది తీర్దాలు త్రాగడం వలం ఎసిడిటీ ప్రోబ్లమ్స్ రావడము ,
- సమయము వృదా చేయడము ,
ఒరిగేదేమీ లేక పోయినా మన పురాతన ఆచార సాంప్రదాయాలను తరువాత తరాలవారికి కనుమరుగయిఫోకుండా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూఉండాలి . అది మన కనీష ధర్మము .