వినాయక వ్రత విధానము :

వినాయక వ్రత విధానము : 

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు – వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు) ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.

మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు – ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము – ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
భారతీయులకు గణపతి జీవనాధారమైన ఒక మూలతత్వము . భారతీయ హిందువులు ప్రతి పనికి ముందు గణేష్ ని పూజించి తమ పనులు చేసుకుపోతుంటారు.

శ్రీ వినాయక వ్రతం

శ్లోకం :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఆచమనం:

ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

దైవ ప్రార్థన

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||


భూతోచ్చాటన : 

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం :

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || 

సంకల్పము: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే.

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ : 

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం 

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం 

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో 

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత 

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ 

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే

పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ : 

గణేశాయ నమః – పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి

శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి

అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి

హేరంబాయ నమః – కటిం పూజయామి

లంబోదరాయ నమః – ఉదరం పూజయామి

గణనాథాయ నమః – నాభిం పూజయామి

గణేశాయ నమః – హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి

గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ : 

సుముఖాయనమ – మాచీపత్రం పూజయామి

గణాధిపాయ నమ – బృహతీపత్రం పూజయామి

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి

లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి

గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి

గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి

వటవేనమః – దాడిమీపత్రం పూజయామి

సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి

హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి

ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి

వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి

సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి

శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా :
    1. ఓం గజాననాయ నమః
    2. ఓం గణాధ్యక్షాయ నమః
    3. ఓం విఘ్నరాజాయ నమః
    4. ఓం వినాయకాయ నమః
    5. ఓం ద్వైమాతురాయ నమః
    6. ఓం ద్విముఖాయ నమః
    7. ఓం ప్రముఖాయ నమః
    8. ఓం సుముఖాయ నమః
    9. ఓం కృతినే నమః
    10. ఓం సుప్రదీప్తాయ నమః
    11. ఓం సుఖనిధయే నమః
    12. ఓం సురాధ్యక్షాయ నమః
    13. ఓం సురారిఘ్నాయ నమః
    14. ఓం మహాగణపతయే నమః
    15. ఓం మాన్యాయ నమః
    16. ఓం మహాకాలాయ నమః
    17. ఓం మహాబలాయ నమః
    18. ఓం హేరంబాయ నమః
    19. ఓం లంబజఠరాయ నమః
    20. ఓం హయగ్రీవాయ నమః
    21. ఓం ప్రథమాయ నమః
    22. ఓం ప్రాజ్ఞాయ నమః
    23. ఓం ప్రమోదాయ నమః
    24. ఓం మోదకప్రియాయ నమః
    25. ఓం విఘ్నకర్త్రే నమః
    26. ఓం విఘ్నహంత్రే నమ
    27. ఓం విశ్వనేత్రే నమః
    28. ఓం విరాట్పతయే నమః
    29. ఓం శ్రీపతయే నమః
    30. ఓం వాక్పతయే నమః
    31. ఓం శృంగారిణే నమః
    32. ఓం ఆశ్రితవత్సలాయ నమః
    33. ఓం శివప్రియాయ నమః
    34. ఓం శీఘ్రకారిణే నమః
    35. ఓం శాశ్వతాయ నమః
    36. ఓం బల్వాన్వితాయ నమః
    37. ఓం బలోద్దతాయ నమః
    38. ఓం భక్తనిధయే నమః
    39. ఓం భావగమ్యాయ నమః
    40. ఓం భావాత్మజాయ నమః
    41. ఓం అగ్రగామినే నమః
    42. ఓం మంత్రకృతే నమః
    43. ఓం చామీకర ప్రభాయ నమః
    44. ఓం సర్వాయ నమః
    45. ఓం సర్వోపాస్యాయ నమః
    46. ఓం సర్వకర్త్రే నమః
    47. ఓం సర్వ నేత్రే నమః
    48. ఓం నర్వసిద్దిప్రదాయ నమః
    49. ఓం పంచహస్తాయ నమః
    50. ఓం పార్వతీనందనాయ నమః
    51. ఓం ప్రభవే నమః
    52. ఓం కుమార గురవే నమ
    53. ఓం కుంజరాసురభంజనాయ నమః
    54. ఓం కాంతిమతే నమః
    55. ఓం ధృతిమతే నమః
    56. ఓం కామినే నమః
    57. ఓం కపిత్థఫలప్రియాయ నమః
    58. ఓం బ్రహ్మచారిణే నమః
    59. ఓం బ్రహ్మరూపిణే నమః
    60. ఓం మహోదరాయ నమః
    61. ఓం మదోత్కటాయ నమః
    62. ఓం మహావీరాయ నమః
    63. ఓం మంత్రిణే నమః
    64. ఓం మంగళసుస్వరాయ నమః
    65. ఓం ప్రమదాయ నమః
    66. ఓం జ్యాయసే నమః
    67. ఓం యక్షికిన్నరసేవితాయ నమః
    68. ఓం గంగాసుతాయ నమః
    69. ఓం గణాధీశాయ నమః
    70. ఓం గంభీరనినదాయ నమః
    71. ఓం వటవే నమః
    72. ఓం జ్యోతిషే నమః
    73. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
    74. ఓం అభీష్టవరదాయ నమః
    75. ఓం మంగళప్రదాయ నమః
    76. ఓం అవ్యక్త రూపాయ నమః
    77. ఓం పురాణపురుషాయ నమః
    78. ఓం పూష్ణే నమః
    79. ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
    80. ఓం అగ్రగణ్యాయ నమః
    81. ఓం అగ్రపూజ్యాయ నమః
    82. ఓం అపాకృతపరాక్రమాయ నమః
    83. ఓం సత్యధర్మిణే నమః
    84. ఓం సఖ్యై నమః
    85. ఓం సారాయ నమః
    86. ఓం సరసాంబునిధయే నమః
    87. ఓం మహేశాయ నమః
    88. ఓం విశదాంగాయ నమః
    89. ఓం మణికింకిణీ మేఖలాయ నమః
    90. ఓం సమస్తదేవతామూర్తయే నమః
    91. ఓం సహిష్ణవే నమః
    92. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
    93. ఓం విష్ణువే నమః
    94. ఓం విష్ణుప్రియాయ నమః
    95. ఓం భక్తజీవితాయ నమః
    96. ఓం ఐశ్వర్యకారణాయ నమః
    97. ఓం సతతోత్థితాయ నమః
    98. ఓం విష్వగ్దృశేనమః
    99. ఓం విశ్వరక్షావిధానకృతే నమః
    100. ఓం కళ్యాణగురవే నమః
    101. ఓం ఉన్మత్తవేషాయ నమః
    102. ఓం పరజయినే నమః
    103. ఓం సమస్త జగదాధారాయ నమః
    104. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
    105. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

  1. దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
  2. ధూపమాఘ్రాపయామి
  3. సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
  4. దీపందర్శయామి
  5. సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్
  6. భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
  7. నైవేద్యం సమర్పయామి
  8. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
  9. సువర్ణపుష్పం సమర్పయామి.
  10. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
  11. తాంబూలం సమర్పయామి
  12. ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
  13. నీరాజనం సమర్పయామి
అథ దూర్వాయుగ్మ పూజా :

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి

నమస్కారము, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన

పునరర్ఘ్యం సమర్పయామి

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

విఘ్నేశ్వర  పద్యములు :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని

తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా

దలచెదనే హేరంబుని

దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు

చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌

నిటలాక్షు నగ్రసుతునకు

బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము :

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు – జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి – జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు – జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు – జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను – జయమంగళం నిత్య శుభమంగళం

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా

వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ

తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!