పాతాళ గణపతి-శ్రీకాళహస్తి

P Madhav Kumar

 పాతాళ గణపతి-శ్రీకాళహస్తి

----------------------------------


తొలి పూజలు అందుకునే గణపతి అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తి ఈ క్షేత్రంలో పాతాళ గణపతి కూడా దర్శనమిస్తుంటారు. ఈ స్వామి వారు నలభై అడుగుల లోతులో కొలువై ఉండడం వెనుక ఒక కథనం కలదు.

 

పూర్యం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిలో ప్రవేశించాలని పరమశివుని ప్రార్థిస్తుంటాడు. ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు ఉండవు. గణపతిని పూజించకుండా ఈ కార్యాన్ని చేయడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళంలోనికి చేరుకున్న గణపతి ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. 

 

అగస్త్యుడి కోరిక మేరకు గణపతి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీకాళహస్తిలోని వినాయకుని పూజించడం వలన ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తులు వాళ్ళ అనుభవంతో చెబుతుంటారు.


శ్రీ కాళహస్తీ

--------------


పూర్వం ఒక అడవి లో ఒక శివలింగం ఉండేది . ఏనుగు ఒకటి రోజు సువర్ణ ముఖి నది లో స్నానం చేసి కొంత నీరు పుక్కిలి పట్టి తెచ్చి ఆ నిటి తో లింగానికి అభిషేకం చేసి పులు పత్రి తెచ్చి పూజ చేసేది . 

ఏనుగు వెళ్ళిపోగానే ఒక పాము వచ్చి ఆ ఆకులూ ,పులు ప్రక్కకు జరిపి రత్నాలతో పూజించేది . ఒక సాలె పురుగు స్వామీ చుట్టూ గుడు అల్లి సేవించేది . ఐతే ఒకరి పూజ ఒకరికి నచ్చేది కాదట .. తమలో తము బాద పడేవారట . చివరకు ముగ్గురు స్వామి అనుగ్రహంతో ముక్తి పొందటం తో కథ సుకన్థమైన్ది అని చెబుతారు . ఆ శివ లింగమే శ్రీ కళాహస్తీస్వరుడిగా ( శ్రీ అంటే సాలె పురుగ, కాళము అంటే పాము , హస్తి అంటే ఏనుగు ) . భక్త కన్నప్ప స్వామి వారి పరిక్ష్ లో రెండు కళ్ళు ఇచ్చేసి స్వామి వారి కృప తో మోక్షం పొందాడు . 


గూడూరు నుండి తిరుపతి వెళ్ళే మార్గం లో ఉన్న ఈ మహిమన్మితమైన క్షేత్రం కి ఘనమైన చరిత్ర ఉంది . గోపురాలు ఎత్తుగా ఉండి శిల్ప సంపదతో కుడి ఉన్నాయి . ఇక్కడ లింగము వాయు లింగం అని ప్రసస్తి . గర్భ గుడి లో ఉన్న ఒక దీపం ఇందుకు నిదర్శనంగా ఎప్పుడు కదులుతూ ఉంటుంది . శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం.


శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. 


ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజుప్రతిష్టించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.


మహా శివరాత్రికి కి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి . తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది.






Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat