పురాతన కాలములో బ్రాహ్మలు అవసరము మేరకు తప్పించి సంపాదించ కూడదనే నియమము వుండేది.
మను ధర్మ శాస్త్రము కూడా ఇదే విషయాన్ని బలపరుచుతుంది. వీరు పౌరులకు హితము చేయుట తప్ప స్వలాభము చూచుకొనరాదు.
అందుకే వారిని పురోహితులన్నారు. అందువల్ల వారిలో చిన్న చిన్న అగ్రహారములలో ఉండేవారికి ఏదైనా పెద్ద కార్యము పడి వేద
పండితులు వెంటపిలిచుక పోతే తప్ప జీవనోపాధి వుండేది కాదు. అందువల్ల అధికులు పేదరికములోనే జీవించేవారు.
ఆవిధమైన పేదరికమూ లో భార్య గంపెడు పిల్లలతో భోజరాజు కాలములో జీవించే వాడు మన కథా నాయకుడు.ఈ దుర్భర
దారిద్ర్యమును అనుభవించ లేక ఒకనాడు అతని భార్య " ఏమండీ ఈ పేదరికము భరించలేము. మీరు కవినని నాతో చెప్పుకొంటుంటారు
కదా మీ ఘనతను భోజరాజు గారి ముందు చాటి ఎందుకు బహుమతులు పొంది మన దారిద్ర్యమును పారద్రోల కూడదు అని అడిగింది.
అతని నోటిలో పచ్చి వెలగ కాయ పడినట్లైనది. కాదన లేక ధారా నగరానికి బయయలు దేరినాడు.ఎందుకంటే తానూ గొప్పలు
చెప్పుకొన్నాడన్న విషయం తన భార్యకు తెలియదు.తన మెదడు ఒక 'గవి'( అంటే లోపల ఖాళీ ) కావున కాలేదతను కవి.
సాయంకాలానికి నగరము చేరి ఒక సత్రములో బస ఏర్పాటు చేసుకొన్నాడు. ఆ కాలములో పరాయి ప్రాంతములనుండి వచ్చినవారికి
భోజన వసతులు ఏర్పాటు చేసే దాతలు, రాజులు పుష్కలముగా వుండినారు. ఆ బాపడు,భోజనము చేసి, అంతో ఇంతో ఎంతో కొంత కవిత్వము వ్రాయవలెనని చింతజేసి ఒక తాటియాకు,ఘంటము తీసుకొని ఆలోచించి ఆలోచించి శ్లోకమునకు తగిన ఒక పాదము
వ్రాసినాడు. తన కుటుంబము భోజనము లేక గడిపిన రోజులు గుర్తు చేసుకొని చేసుకొని ఆ స్లోకపాదము వ్రాయగలిగినాడు.
ఆ పాదమే 'భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం' అని. అదికూడా ఎట్లు వ్రాసినాడంటే 'బ్రాహ్మణో భోజనప్రియ' అన్న నానుడి
వుండనేవుంది దానికి తోడుగా తిండిలేక తానూ తన కుటుంబము ఎన్నో రోజులు గడిపినారు కాబట్టి. అప్పటికే బాగా రాత్రి
అయినందువల్ల వ్రాసిన ఆ తాళపత్రము తలగాడగా చేసుకొన్న తన మూతక్రిండ పెట్టుకొని పడుకోన్నాడు. అది పూర్తిగా తలగడ క్రిందికి
జోనపనందువల్ల గాలికి రెపరెపలాడుతూవుండినది.
ప్రతి రోజు మారు వేషములలో భోజరాజు కాళిదాసు తో కూడి నగరమునకు వచ్చిన క్రొత్తవాళ్ళెవరు,వారిలో శతృవులేమైనా ఉన్నారా అని
గమనించుట వారి ముఖ్య ఉద్దేశ్యము. రెపరెపలాడే తాళపత్రము కాళీదాసు కంట పడింది. అదృష్టము కొద్దీ భోజుడు అక్కడ లేడు.
ఆపత్ర్ము చూసి కాళీదాసు కంట తడిపెట్టుకొని మిగిలిన పాదము తాను ఈ విధంగా పూర్తి చేసినాడు.
'మాహిషశ్చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి' అని పూర్తీ చేసి ఆతని తలగడ క్రిందనే యుంచి వెళ్లిపోయినాడు. తెల్లవారి బ్రహ్మడది
చూసుకొని విస్మితుడై రాజువద్దకు వెళ్లి తన శ్లోకము వినిపించించగా,రాజు "ఓ పారుడా! నీ శ్లోకములోని రెండపాదము అత్యద్భుతముగా
వున్నది. అటువంటి ప్రయోగము మా కాళీదాసు తరువాత నీవే చేసినావు" అని మెచ్చుకొనుచూ చివరి పాదమునకు అక్షరలక్షలు ఇచ్చినాడు. బ్రాహ్మణుని కళ్ళు కృతజ్ఞతతో కాళిదాసు కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయినాయి.
అసలు చివరి పాదానికి అక్షరలక్షలు భోజుడెందుకు ఇచ్చినాడంటే. అక్కడ 'దధి' అంటే పెరుగు ఆవుది కాదు. ఆవుదైతే అమితమైన
తెల్లగా వుండదు బఱ్ఱె పెరుగు మాదిరి. అందుకని అతి తెల్లనైన అని చెప్పుటకు 'మాహిషశ్చ' అన్న పదము, ఆతెలుపు ఎంత తెలుపు
అంటే అది శరదృతువులో అత్యంత వెలుగు విరజిమ్మే వెన్నెల లాగా అని వాడినాడు కవి.👏🏻💐👏🏻