ఎవరీ శివుడు : మనిషా, కల్పనా లేక దైవమా?

P Madhav Kumar
“శివ” అంటే “ఏది లేదో అది” అని అర్థం. నేడు ఆధునిక విఙ్ఞాన శాస్త్రం కూడా అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. ఇంకోస్థాయిలో మనం “శివ” అన్నప్పుడు, ఒక యోగి గురించి మాట్లాడుతున్నాము.

ఎవరీ శివుడు : మనిషా, కల్పనా లేక దైవమా?

శివుడు ఎవరు? భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ వ్యక్తి చుట్టూ ఎన్నో కధలు, పురాణాలూ ఉన్నాయి. ఆయన దేవుడా? లేక భారతీయ సంస్కృతి చేసిన సంయుక్త కల్పనా? లేక దాన్ని అన్వేసిస్తున్న వారికి మాత్రమే అర్థం అయ్యేలా ‘శివ’ అనేదానికి ఇంకా లోతైన అర్థం ఏదైనా ఉందా?

శివ అంటే శూన్యత

సద్గురు: సద్గురు “శివ” అన్నప్పుడు మనం రెండు ప్రాధమికమైన అంశాల గురించి మాట్లాడుతున్నాము. “శివ” అనే పదానికి భాషా పరంగా“ఏది లేదో అది” అని అర్థం. నేడు ఆధునిక విఙ్ఞాన శాస్త్రం కూడా అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. ఈ సృష్టి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలు కేవలం చల్లిన నీటి తుంపర లా, దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యమే, దీనినే శివ అంటారు. అంటే అదే గర్భం, ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి.ఇందువల్లే శివుణ్ణి అస్తిత్వం ఉన్నవానిగా కాక అస్తిత్వం లేనివానిగా వర్ణిస్తారు.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat