🔱అభిషేక ఫలితాలు🔱

P Madhav Kumar


దేవాలయాలలో భగవంతుని మూలవిగ్రహానికి గాని , ఉత్సవ విగ్రహానికి గాని విశేషమైన రోజుల్లో అభిషేకాలు చేయడానికి 11 రకాల ద్రవ్యాలు విశిష్టమైనవిగా

చెప్పబడినవి. అవి -


చందనాది తైలం,

పంచగవ్యం, పంచామృతం, నెయ్యి , పాలు,పెరుగు , తేనె, పళ్ళరసం, చెఱకు పానకం, 

లేతకొబ్బరి నీరు .

వీటన్నింటికి ఒక్కక్క దానికి ఒక్కొక్క ఫలితం వున్నది.


చందానాది తైలాభిషేకం....

ఋణవిముక్తి కలిగించి పేదరికం నిర్మూలిస్తుంది.


పంచగవ్యం...


మూర్ఛ (ఫిట్స్) మరియు ఇతర వ్యాధులను

తొలగిస్తుంది.


పంచామృతం... ఆశించిన కార్యాలు , కోరికలు నెరవేరుతాయి.


నెయ్యి....

ఐశ్వర్యం కలిగిస్తుంది.


పాలు.... 

పలు జన్మల పాపాలు తొలగిపోయేలా చేస్తుంది.


పెరుగు....

దుఃఖాలను , కష్టాలను దూరంకావడానికి దోహదపడుతుంది.


తేనె.....

వాక్కును , తెలివితేటలను కలిగిస్తుంది.


పళ్ళరసాలు.... భోగాభాగ్యాలు లభించేలా చేస్తుంది.


చెఱుకు రసం...

తలపెట్టిన కార్యాలు జయప్రదమౌతాయి.


లేతకొబ్బరి నీరు... మనసు కి ప్రశాంతత లభిస్తుంది.


అరగదీసిన చందనం...

సర్వమంగళాలను

చేకూరుస్తుంది.


భక్తులు వారి వారి కోరికలను అనుసరించి ఈ అభిషేకాలు 

చేయించుకుని భగవంతుని అనుగ్రహానికి పాత్రులై శుభాలు పొందవచ్చును.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat