పుత్రదా ఏకాదశి*

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

   
హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు.

ఈ *పుష్య పుత్రదా ఏకాదశి* ఈ ఏకాదశిని *పవిత్ర ఏకాదశి* అని కూడా అంటారు.

ఈ పవిత్రమైన రోజున విష్ణు మూర్తిని ఎలా ఆరాధించాలి.. పుత్రదా ఏకాదశి రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు.. ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

*పుత్రదా ఏకాదశి రోజున* 

ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో లక్ష్మీ విగ్రహాన్ని పూజ గదిలో లేదా ఆలయంలో ఉండేలా చూసుకోండి. ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి. పూజ తర్వాత గంగా(నీటిని) జలం తీసుకుని మీ ఆత్మను శుద్ధి చేయండి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా మేల్కొని విష్ణువును కీర్తించండి.
*‘ఓం గోవింద , మాధవయ నారాయాణయ నమః'* అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి.

*బియ్యం వినియోగించకూడదు*

ఈ పుష్య ఏకాదశి రోజున బియ్యం వినియోగించకూడదంట. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందట. ఈ పవిత్రమైన రోజున బియ్యం తినడం ద్వారా , మనకు కొంత గందరగోళంగా ఉంటుంది.

*కోపాన్ని నివారించాలి*

ఈ పవిత్రమైన రోజున విష్ణువును ఆరాధించడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఈరోజున కోపం రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అలాగే ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి.

*బ్రహ్మచార్యం పాటించాలి*

ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ శారీరక సంబంధాలను పెట్టుకోకూడదు. ఈరోజంతా బ్రహ్మచార్యాన్ని అనుసరించాలి. ఏకాదశిన మనస్ఫూర్తిగా విష్ణుదేవుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి.

*వీటిని తీసుకోవద్దు*

ఈ పవిత్రమైన రోజున మాంసాహారం , మద్యపానం , పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సాధారణ ఆహారాన్నే తినాలి , పెరుగన్నం లేదా ఏదైనా శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

*మహిళలను అవమానించొద్దు*

ఈ పుష్య పుత్రదా ఏకాదశి రోజున ప్రతి ఒక్క మహిళను మనం గౌరవించాలి. ఈరోజున ఎలాంటి సందర్భాల్లోనైనా మహిళలను అవమానించడం మరియు అగౌరపరచడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా , ఉపవాసాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాదు మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat