సైంటిస్టులు వెతికే దైవకణం బయట ఎప్పటికీ దొరకదు., సద్గురువు, శూన్య స్థితి, ఆత్మ , వేదాంతం అంటే?

P Madhav Kumar

 🌷అంతరాలోచన🌷

సైంటిస్టులు వెతికే దైవకణం బయట ఎప్పటికీ దొరకదు., తన లోపలే అది దొరుకుతుంది.


ఆ దైవకణమే -- నేను.


సద్గురువు అంటే --


'సత్యమే గురువు' అని అర్థం.


కర్తృత్వ భావనే బంధం;


 అది తొలగితేనే మోక్షం.


➡ పదార్థం గురించి చెప్పేది - సైన్స్ 


➡ పరమార్ధం గురించి చెప్పేది - ఆధ్యాత్మికం


➡ గణిత శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ - సున్న 


➡ భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ - చక్రం


➡ ఆధ్యాత్మిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ - ధ్యానం ( శూన్య స్థితి)


➡ తనకు వచ్చిన కల గురించి పక్కవాడు నిర్ధారణ చేయడం ఎంత అర్ధరహితమో,

 ➡ ధ్యానం యొక్క అనుభవం గురించి, మరొకరు నిర్వచించడం కూడా అంత అర్థరహితమే.


 తన కలకు తానొక్కడే సాక్షి.

 తన అనుభవానికి తానొక్కడే సాక్షి.


భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.

➡ నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.

  అదే విధంగా., 

➡ జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,

 ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.


'జీవం లేనిది' అంటూ ఏదీ లేదు. పరమాణువు నుండి గోళాల వరకు ప్రతిదీ -- "శక్తి, చైతన్యం, జ్ఞానం" అనే మూడింటి కలయికల శకలాలే. 


శక్తి, చైతన్యం, జ్ఞానం అనే ఈ మూడింటి శకలాల కలయికకు

-- ఒక పరమార్థం, ప్రణాళిక, లక్ష్యం ఉన్నాయి. 


ప్రతి ఒక్కరూ ఇక్కడ వున్నది 

-- ఆనందించేందుకు, పరిశోధించేందుకు, ఎదిగేందుకు.


ఆత్మ అంటే మొత్తం. (Totality)


ఆత్మ ఒక్కటే జ్ఞాని., అని ఎరిగిన వాడే -- ఆత్మజ్ఞాని.


ఆత్మ తప్ప మరేదీ లేదని గ్రహించడమే -- ఆత్మసాక్షాత్కారం.


పుణ్యం-పురుషార్థం:-


➡ పుణ్యం అంటే మంచి పనుల మూట కాదు. పుణ్యం అంటే ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకొన్న ఆత్మజ్ఞానమే.

➡ పురుషుడు అంటే జీవాత్మ. జీవాత్మ ఏ 'అర్థం' (పని) కోసం భౌతిక శరీరం తీసుకుందో., ఆ అర్థమే పురుషార్థం.


 ఆధ్యాత్మిక పురోగతే పురుషార్థము.


➡ కారణం నీ లోపలిది

➡ కార్యం నీ వెలుపలిది


 వెలుపల (ప్రపంచంలో) కారణ కర్తను (భగవంతుణ్ణి) వెతకొద్దు.


శంకరాచార్యులు:- జరుగు.. జరుగు..


చంఢాలుడు:- ఏది జరగాలి??

 శరీరమా? చైతన్యమా?

 శరీరం జడం.. అది జరగలేదు.

 చైతన్యం అనంతం.. అది జరిగే అవకాశం లేదు.

 మరి ఏది జరగాలి?


జ్ఞానాన్ని ఇచ్చేవాడు ప్రధానం కాదు,

 పుచ్చుకునేవాడు ప్రధానం.


జ్ఞానం ఉండేది ఇచ్చేవానిని బట్టి కాదు.,

పుచ్చుకునే వానిని బట్టి.


మట్టి, బంగారం రెండు ఒకలా కనబడితే --


"స్వర్ణ యోగం" సిద్ధించినట్లే.


అష్టాక్షరీ మహా మంత్రం 


నే-ను-మా-త్ర-మే

ఉ-న్నా-ను


వేదాంతం అంటే---


👉 అర్థమైనట్టు ఉండి అర్థం కానిది.

👉 అర్థం కానట్టు ఉండి అర్థమయ్యేది.


👉 పూర్తి భౌతిక విషయం - ద్వైతం 


👉 భౌతిక విషయంలో కొంత ఆధ్యాత్మిక విషయం కలిస్తే - విశిష్టాద్వైతం 


👉 పూర్తి ఆధ్యాత్మిక విషయం - అద్వైతం


చేతబడులు అనేవి లేవు.


➡ మనస్సు బలహీనం వల్ల అన్నీ అలానే అనిపిస్తుంది, కనిపిస్తుంది.

 ➡ మానసికంగా ధృడం కావాలి.


దానికి మార్గం - ధ్యానమే.


👉 సినిమా జరుగుతున్నప్పుడే 'తెర'ను చూడగలగడం -- జీవన్ముక్తి.


👉 సినిమా అయిపోయిన తర్వాత 'తెర'ను చూడడం -- విదేహముక్తి.


➡ మార్పులేని సత్యము - ఆత్మ 

➡ మారుతూ ఉండే సత్యము - ప్రకృతి 


        రెండు సత్యమే.


➡ ధర్మం అనేది లౌకిక విషయం 

➡ జ్ఞానం అనేది అలౌకిక విషయం 


 ముందు జ్ఞానవంతుడివి కా.

 తర్వాత నీవు నడిచే దారి అంతా ధర్మమే అవుతుంది.


👉 మాట ఆగితే - మౌనం


👉 మనస్సు ఆగితే - ధ్యానం


స్వర్గానికి ఓ కుక్క కూడా వెళ్ళింది.

 మనిషి వెళ్లడం పెద్ద విశేషమేమీ కాదు.

 "జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని అంతిమ లక్ష్యం.

'స్వర్గం' కాదు.


➡ భోగం, రోగం -- పాశ్చాత్య లక్షణం


➡ యోగం, జ్ఞానం -- భారతీయ లక్షణం


సులభంగా, క్లుప్తంగా చెప్పబడిన వేదాంతమే - సామెత.


ఆత్మ బంధువు అంటే:-


 ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.


జనన మరణాలనేవి (ఆత్మకు) లేవని తెలుసుకోవడమే 

"జనన మరణ రహస్యం".


నీ మనసు దిగంబరం అయితే నీవే "అవధూత".


ఆధ్యాత్మికం అంటే ఉన్నదానిని ఉన్నది అని తెలుసుకోవడమే.


' నీ తాడు తెగా..' 

ఇది ఒక వేదాంత పరమైన ఆశీర్వచనం.


 నీకు బంధం తొలగి (తాడు తెగి) మోక్షం కలగాలని ఆశీర్వదించడం అన్నమాట.


భగవంతుని త్రాసులో:-


అణువు, బ్రహ్మాండం

 సమంగా తూగుతాయి.


👉 మొదట 'జ్ఞానాన్ని' చూడు 


👉తర్వాత 'జ్ఞాని'ని చూడు


ఏ దృష్టికి చూసేవాడు - చూడబడేది అనేవి ఉండవో; ఆ దృష్టే 'దివ్య దృష్టి'.


👉 జ్ఞాని మరణం - దేహాన్ని వదిలిపెడతాడు.


👉 అజ్ఞాని మరణం - దేహం నుండి వదలగొట్టపడతాడు.


జీవితం అంటే...,


ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.


చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,


 బాధోస్తే బ్రతకలేమా?


సకల జీవులు భగవత్ అవతారములే..,


అందులో ఓ పది మాత్రమే అవతారములు గా ప్రాచుర్యం పొందినాయి.


➡ జీవుని తలంపు -

  కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.


➡ భగవంతుని తలంపు - కార్యం ఏకకాలంలో జరుగుతాయి



.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat