ఇంట్లో స్పటిక లింగాన్ని పూజించవచ్చా..?...!!

P Madhav Kumar

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿సాధారణంగా మనం శివలింగాలను ఎక్కువగా దేవాలయాలలో మాత్రమే పూజించడం చూస్తుంటాము.కానీ కొందరికి శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చా అనే సందేహాలు కలుగుతుంటాయి?

🌸 అయితే ముఖ్యంగా శివలింగాలలో స్పటిక శివలింగం ఇంట్లో పూజించుకోవడం మంచిదేనా?స్పటిక లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి.

🌿 అయితే స్పటిక లింగం ఇంట్లో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

🌸 స్పటిక లింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే 
ఈ స్పటిక లింగం మన ఇంట్లో ఉండడం వల్ల ప్రతి రోజు పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో అభిషేకం నిర్వహించాలి.

🌿అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి.ఈ విధంగా ప్రతిరోజు స్పటిక లింగాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

🌸స్పటికంతో తయారైన శివలింగం మాత్రమే కాకుండా స్పటికంతో తయారైన విగ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా పూజించడం వల్ల మన ఇంట్లో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

🌿ముఖ్యంగా స్పటిక శివలింగానికి విభూతితో అభిషేకం ఎంతో ప్రీతికరమైనది.ఈ విధంగా విభూతి అభిషేకం చేయడం ద్వారా నవ గ్రహ దోషాలు తొలగిపోతాయి.

🌸అభిషేక అనంతరం శివ లింగం ముందు కూర్చుని 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని జపించటం వల్ల అనుకున్న కోరికలు తీరడంతోపాటూ, అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది.

🌿స్పటిక శివలింగాన్ని మన ఇంట్లో పెట్టకున్నప్పుడు ఎంతో నియమ నిష్టలతో ప్రతిరోజు అభిషేకాలను, పూజలను నిర్వహించవలసి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.

🌿స్పటిక శివలింగం ముందు కూర్చుని కేవలం పంచాక్షరి మంత్రమే కాకుండా, లక్ష్మీ అష్టోత్తరం కూడా పట్టించవచ్చు.

🌸ఈ విధంగా స్పటిక శివలింగానికి ప్రత్యేక పూజలను చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు...స్వస్తీ..🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat