యజ్ఞయాగాలెందుకు?!

P Madhav Kumar

 


అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి దేవుళ్లను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రం ఏర్పాటుచేస్తారు. రాగి పాత్రలో లేదా కుండలో పిడకలు పేర్చి, కర్పూరం వేసి అగ్ని రాజేస్తారు.


అగ్ని అనేది అధిష్ఠాన దేవత. హోత్రం అంటే హవిస్సు. అగ్నిలో భక్తి పూర్వకంగా, మంత్రసహితంగా ఆయా దేవుళ్లకు స్వాహా అంటూ జారవిడిచే పాలు, అన్నం, నెయ్యి, మూలికలు మొదలైనవి హవిస్సులు. యజ్ఞం విష్ణు స్వరూపం. దేవతలకూ, మనకూ సంధానం ఏర్పరచేది హోమం. దేవతలను హవిస్సులతో సంతృప్తిపరచి, ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి, సంతతి, శాంతి పొందాలనుకుంటారు. యజ్ఞాల వల్ల పర్యావరణం పరిశుభ్రమవుతుంది. వర్షాలు కురుస్తాయి. రోగనిర్మూలక మూలికలు వేసి మండించడం వల్ల వ్యాధులు దూరమవుతాయి. 


తద్వారా మనసు ప్రక్షాళితమై ప్రశాంతమవుతుంది. అత్యధిక సంఖ్యలో సాధువులు పాల్గొనే, అధిక ధనం ఖర్చయ్యే అతిరాత్ర యాగం, చండీయాగం లాంటి మహాయాగాలే కాకుండా అందరూ చేయదగిన కొన్ని సంప్రదాయ ప్రక్రియలూ ఉన్నాయి. నిత్యం ఇళ్లలో హోమం చేస్తే నిత్యాగ్నిహోత్రులంటారు. యాగాల్లో అశ్వమేధ, పుత్రకామేష్టి, రాజసూయ, సర్ప, విశ్వజిత్‌ యాగాలు ముఖ్యమైనవి. పెళ్లిలో నవదంపతులు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవటం, అగ్ని సాక్షిగా ఒక్కటవడం తెలిసిందే. గృహప్రవేశ సమయంలో జరిపే గణపతి హోమం శాంతి సౌఖ్యాలనిస్తుంది. యాగాలు, హోమాలతో సుఖశాంతులు లభిస్తాయన్నది మహర్షుల ఉవాచ.


ఓం నమః శివాయ



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat