అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఉపయోగాలు:-

P Madhav Kumar

 


అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం..మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. 


శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 


వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.


ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.


ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.


వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.


ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. 


ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!


అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది.

సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat