హిందూ సంస్కృతిలో శంఖం

P Madhav Kumar


సముద్ర తనయాయ విద్మహే

శంఖరాజాయ ధీమహీ, తన్నో శంఖ ప్రచోదయాత్‌.




పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం సిరి సంపదలకు ప్రతీక. దీన్ని పూజా గదుల యందు ఉంచినట్లయితే అన్ని అరిష్ఠాలు తొలగిపోతాయి. దేవాలయాలలో, యజ్ఞ్య యాగాది క్రతువులందు, శుభకార్యాలలోనూ శంఖము యొక్క ధ్వని చేయుట వలన ఆయా కార్యక్రమములకు శోభ పెరుగును . విష్ణు పురాణం ప్రకారం క్షీరసాగర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి.ఒక విధంగా శంఖము లక్ష్మీదేవికి వారసురాలు. కూర్మ పీఠం పై ఎర్రన్ని పట్టు వస్త్రాన్ని వేసి శంఖ దేవతను పూజించినచో సకల శుభములు చేకూరును. పగిలినది, విరిగినది, పలచనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు ఉన్న శంఖాలు పూజకు పనికిరావు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. ఒకొక్క రకానికి ఒకొక్క పూజా విధానం కలదు. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని 3 రకాలుగా విభజిస్తారు.


1. దక్షిణావృత శంఖం – ఎడమ చేతితో పట్టుకునే శంఖము (పూజకు మాత్రమే ఉపయోగిస్తారు)

2. ఉత్తరావృతవ శంఖం – మధ్యలో నోరులా ఉన్న శంఖము (ఊదుటకు మాత్రమే ఉపయోగిస్తారు)

3. మధ్యావృత శంఖం – కుడిచేతితో పట్టుకునే శంఖము


కొన్ని ముఖ్య శంఖాల పేర్లు:

1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.


శంఖము యొక్క ఉపయోగాలు


శంఖము యొక్క ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.


వాయిద్యంగా శంఖం


శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది. యుద్ధ భేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం చెప్పడానికి దీనిని వాడుతారు. జంగం దేవరలు దీనిని ఇంటింటికి ముందు వాయిస్తారు. ఈ శంఖానాథాన్ని శుభ సూచకంగా భావిస్తారు. శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మందిరాలలోను, శుభకార్యాలలోనూ దీని ధ్వని పవిత్రతను, శోభను పెంచుతుందని హిందువుల నమ్మకం. దీని పుట్టుక సముద్ర మథనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మథనంలో వచ్చిన పదునాలుగు రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల అభివృద్ధికలుగుతుందని విశ్వసిస్తారు. దీనికి అనేక రకాల పూజా విధానాలు ఉన్నాయి. పూర్వం కొన్నింటిని గృహకృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి.


శంఖం ఎలా పుట్టిందనడానికి బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ చెప్తారు. పూర్వ కాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణకవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తి వచ్చాడు. దాంతో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. దానితో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసీ తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని కథనము.


ఉపయోగాలు


శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజలో ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపిస్తున్నారు. లక్ష్మిదేవి స్వయంగా శంఖం నా సహోదరి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్థాపించాలి. గణేశ శంఖాలలో నీరు నింపి, గర్భవతులకు త్రాగించినట్లయితే అంగవైకల్యంతో కూడిన సంతానం కలగదని కొందరు నమ్ముతారు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖాల మాలలను ధరిస్తారు కూడా. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు,శంఖ భస్మము వల్ల అనేక రోగాలు నయమౌతున్నాయి. ఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని, శంఖము పాపనాశని అని కొందరి విశ్వాసం.


కొన్ని శంఖాల వివరణ


దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి, పూరీలో దొరుకుతాయి.


మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి:


శ్రీకృష్ణుడు - పాంచజన్యం


అర్జునుడు - దేవదత్తం,


భీముడు - పౌంఢ్రకం


యుధిష్ఠిరుడు - అనంత విజయ


నకులుడు - సుఘోష


సహదేవుడు - మణిపుష్పక


కాశీరాజు - శిఖండి


దృష్టద్యుమ్నుడు, విరాటుడు - స్వాతిక

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat