ప్రతి హిందువు తెలుసుకోవలసిన హిందూమతం యొక్క చరిత్ర - History of Hinduism

P Madhav Kumar


హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సంప్రదాయాల మరియు బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది. ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్ మరియు భారతదేశం పై ఆదారితమైనవి.

హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది. పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సంప్రదాయాలు మరియు బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు.

హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేద కాలం అంటే సుమారు (సా.శ.పూ 2000) సంవత్సరములు.సుమారు సా.శ.పూ 800 మరియు 200 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలనికి మరియు హిందూ దర్మానికి మధ్య మలుపు తిప్పిన కాలం.ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ద మతం మరియు జైన మతాలు విరసిల్లాయి. (సా.శ.పూ 200 నుండి సా.శ 500 ) కాలాన్ని పురానాల కాలంగా పిలువబడుతుంది గుప్త సామ్రాజ్యము కాలంతో మమేకం అయిన ఈ కాలాం హిందూ మతం యొక్క చరిత్రలో సువర్ణకాలంగా వ్యవహరించబడింది. ఈ కాలంలోనే సమాఖ్య, యోగా, న్యయ, వైశేషిక, మిమాంస, మరియు వేదాంత అనే ఆరు హిందూ వేదాంతశాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు మరియు వైష్ణవులు ఏర్పడ్డారు. సా"శ"పూ 600 నుండి సా"శ 1100 మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది.ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్బవించింది.


ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటిషు పరిపాలనా సమయంలో పాశ్చాత దేశాల ఉద్యమాన్ని స్పూర్తిగా చేసుకోని అనేక ఉద్యమాలు జరిగి 1947 లో స్వాతంత్ర్యంతో హిందూ మేజారిటి దేశంగా ఉద్బవించింది.

ప్రవాస భారతీయుల కారణంగా 20 వ శతాబ్దంలో అనేక ఖండాలలో ముఖ్యంగా అమెరికా మరియు యునైటెడ్ కింగ్ డమ్ లో హిందూవుల సంఖ్య పెరిగింది. 1980 కాలంలో హిందూ దేశికరణ ఒక గోప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీ గా ఏర్పడింది.1999 నుండి 2004 వరకు తిరిగి 2014 లో అదికారం సాగించింది. అట్లాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2006 లో రాష్ట్ర ప్రభుత్వం సాదించింది.

పూర్వ వేదకాలం మతాలు:
హిందూమత పూర్వ చరిత్ర
శాస్త్రీయంగా ఆధునిక మానవులు సూమారు 75,000 నుండి 60,000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలా యుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు. వీరు ఆష్ట్రేలోయ్డ్స్. వారు చాలావరకు కనుమరుగైయ్యారు లేదా కొంత మంది మనుగడ సాగించారు.

ఆష్ట్రేలోయ్డ్స్ తరువాత సా"శ"పూ" 6000 నుండి 4000 కాలంలో ఎలమో - ద్రవీడీయన్లు వచ్చారు. BCE) తరువాత ఇండో - ఆర్యులు (సా"శ"పూ 2000 నుండి 1500), మరియు మన్గోలియాయ్డ్స్, సైనో - టిబెటన్లు భారతదేశానికి వలస వచ్చారు.ఎలమో - ద్రవీడియన్లు ఎలమో ప్రాంతం (ఇరాన్) నుండి మరియు టిబెటో - బర్మన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుండి వలస వచ్చారు.

పూరాతన భారతదేశ మతము (హిందూ మతము) దాని ఉనికిని ప్రాచీన శిలా యుగంకు చెందిన భీమ్‌బేట్కా శిలా గుహలులో కనబరుస్తుంది. భీమ్‌బేట్కా శిలా గుహలులో ఉన్న అనేక చిత్రాలు వేద కాలం నాటి శివుడిని పోలి ఉంటాయి.కాని ఇతర దేవుళ్ళ చిత్రాలు కనబడవు. ఇవి సూమారు సా"శ"పూ 30,000 సంవత్సరాలకు చెందినవి.అట్లాగే నవీన శిలా యుగం లేదా నియోలిథిక్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది. హిందూ మతంలో మరి కొన్ని ఆచారాలు 4000 BCE కాలం నాటివి. హిందూ మతం దక్షిణ ఆసియాలో లిపి పుట్టకముందు నుండే దాని ఉనికిని చాటింది.

సింధు లోయ నాగరికత - Indus Valley Civilization (3300–1700 BCE)
కొన్ని హిందూ మరియు ఇతర హిందూ ఉప మతాలలో ఉపయోగించిన స్వస్తిక్ ముద్రికల సింధు నాగరికత పట్టణాలలో దోరికాయి. సింధు నాగరికత పట్టణాలైన హరప్ప మరియు కాళిబంగన్ లో అనేక శివ లింగాలు లభించాయి. తరువాతి కాలంలో ఇవి హిందూ మతంలో పూజించబడుతున్నాయి.

బ్రిటీషు సంగ్రహాలయంలో భద్రపరిచిన సింధు నాగరికతకు చెందిన స్వస్తిక్ ముద్రికలు
అనేక జంతువుల ముద్రికలు సింధు నాగరికతలో ఉపయోగంచుట జరిగింది. సింధు లోయ నాగరికత నగరమైన మోహన్ జోదారోలో స్టియాలైట్ తో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగోనబడింది. ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం మరియు జింక ఉన్నాయి.ఈ ముద్రిక కోంతమేరకు దెబ్బతిని ఉంది.ఈ ముద్రికలో గల ప్రతిమకు ముడు తలలు కలిగి ఉన్నాయి.పశుపతి కోమ్ముల కలిగి చూట్టు పశువులతో అలంకరించబడ్డాడు. ఇతడు ఒక కోమ్ముల కలిగిన దేవతామూర్తి. ఇతడిని హిందూ మతంలో పూజించే శివుని రూపంగా భావిస్తారు.

1997లో డోరిస్ మెత్ శ్రీనివాసన్ ప్రకరాం పశుపతి ముద్రిక ఒక మగ మహిష దేవుడు అని అభిప్రాయపడ్డారు.

ఐరావతం మహదేవన్ రచించిన The Indus Script: Texts, Concordance and Tables (1977), అనే పుస్తకంలో 47 మరియు 48 గుర్తులను దక్షిణ భారత దేవతా మూర్తైన మురుగున్ లేదా కుమారస్వామి అని వర్ణించాడు. అనేక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు.ఆ ఆరాధన నేటికి హిందూ మతంలో కోనసాగుతునే ఉంది.
    సింధు నాగరికత భవంతులలో ఏరకమైన దేవాలయాలు కనుగోనలేదు.ఒకవేల ఉంటే వాటిని కనుగోనాల్సివుంది. ఏమైనప్పటికి మోహంజోదారో దిగువ పట్టణం లోని HR-A ప్రాంతం House - 1 ని దేవాలయంగా గుర్తించారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat